Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ నాకు స్ఫూర్తి.. అలా నా తొలి అడుగు పడింది: ఓటీటీ సిరీస్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్
15 December 2024, 15:54 IST
- Vikatakavi OTT Series Music Director Ajay Arasada: ఓటీటీ తెలుగు వెబ్ సిరీస్ వికటకవి, ఆయ్ వంటి సినిమాలకు మ్యూజిక్ అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ అరసాడ తనకు దేవి శ్రీ ప్రసాద్ స్ఫూర్తి అని తెలిపారు. డైరెక్టర్సే తనకు గురువులు అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో అజయ్ అరసాడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దేవి శ్రీ ప్రసాద్ నాకు స్ఫూర్తి.. అలా నా తొలి అడుగు పడింది: ఓటీటీ సిరీస్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్
Music Director Ajay Arasada On Devi Sri Prasad: తెలుగు పీరియాడిక్ డిటెక్టివ్ ఓటీటీ వెబ్ సిరీస్ వికటకవి, ఆయ్ వంటి సినిమాలకు సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ. నవంబర్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న వికటకవి బీజీఎమ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలో అజయ్ అరసాడ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
నేపథ్యం..?
- వైజాగ్‌లో పుట్టి పెరిగాను. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాను. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా 2011 నుంచి 2018వరకు జాబ్ చేశాను. ఉద్యోగం మానేసిన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఈ క్రమంలో నాకు మా ఫ్యామిలీ నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది.
మ్యూజిక్ అంటే ఆసక్తి ఎందుకు?
- మా ఇంట్లో అత్తలు, అక్క వీణ వాయిస్తూ ఉండేవారు. అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని. అలా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చాను. ముందు గిటార్ నేర్చుకోవాలనుకున్నాను. అందుకని శరత్ మాస్టర్ దగ్గర రెండున్నర నెలల పాటు బేసిక్స్ నేర్చుకున్నాను. తర్వాత నాకు నేనుగా సొంతంగా ప్లే చేస్తూ నేర్చుకోవటం స్టార్ట్ చేశాను.
- గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత కాస్త ఎక్కువ సమయం దొరికినట్లయ్యింది. కొన్ని సందర్భాల్లో అయితే కాలేజీలకు బంకులు కొట్టేసేవాడిని. అక్కడ మ్యూజిక్ బ్యాండ్స్‌తో కలిసి తిరగటం వల్ల మ్యూజిక్‌పై కాస్త పట్టు పెరిగింది.
సినీ రంగంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు?
- 2011 నుంచి 2018 వరకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే షార్ట్ ఫిల్మ్స్‌కు వర్క్ చేసేవాడిని. ఇలా చేయటం వల్ల నాకు మంచి ప్రాక్టీస్ దొరికినట్లయ్యింది. ఈ క్రమంలో ప్రదీప్ అద్వైత్ నన్ను జగన్నాటకం డైరెక్టర్ ప్రదీప్‌కు పరిచయం చేశారు. నేను అంతకు ముందు చేసిన ఓ ముప్పై సెకన్ల మ్యూజిక్ బిట్ విని నాకు జగన్నాటకం మూవీలో చాన్స్ ఇచ్చారు.
- అలా సినీ ఇండస్ట్రీలోకి నా తొలి అడుగు పడింది. తర్వాత ఇండిపెండెంట్‌గా వర్క్ చేసుకుంటూ వస్తుండేవాడిని. ఆ సమయంలో నా చిన్ననాటి స్నేహితుడు.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల నన్ను గూఢచారి సినిమాలో కీ బోర్డ్ ప్రోగ్రామింగ్ కోసం వర్క్ చేయమని అడగటంతో వర్క్ చేశాను.
- ఆ తర్వాత క్షీర సాగర మథనం, నేడే విడుదల, మిస్సింగ్, శ్రీరంగనీతులు సినిమాలకు వర్క్ చేశాను. సినిమాలతో వెబ్ సిరీస్‌లైణ సేవ్ ది టైగర్స్ సీజన్1, సీజన్2లకు సంగీతాన్ని అందించాను. రీసెంట్‌గా వికటకవి సిరీస్‌కు వర్క్ చేశాను.
మీకు ఇన్‌స్పైరింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
- దేవీ శ్రీ ప్రసాద్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయనే నాకు స్ఫూర్తి.