(1 / 5)
కీరవాణి తెలుగులో మాత్రమే కాకుండా పలు తమిళం, హిందీ సినిమాలకు మ్యూజిక్ అందించాడు. మరకతమణి పేరుతో కీరవాణిని బాలచందర్ కోలీవుడ్‌కు పరిచయం చేశారు. బాలీవుడ్‌లో ఎం.ఎం క్రిమ్ పేరుతో కీరవాణి మ్యూజిక్ అందించారు.
(2 / 5)
తెలుగులో ఒక్కో సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ స్వీకరిస్తోన్నట్లు సమాచారం. ఏఆర్ రెహమాన్, దేవిశ్రీప్రసాద్ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోన్న మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి నిలిచారు.
(3 / 5)
రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్‌లో 27 సినిమాలొచ్చాయి. ఒకే దర్శకుడితో ఎక్కువ సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి నిలిచారు.
(4 / 5)
హీరో నాగార్జున, కీరవాణి కలయికలో పదిహేను సినిమాలొచ్చాయి. అన్నమయ్య సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి నేషనల్ అవార్డు అందుకున్నారు.
(5 / 5)
నాగార్జున శివ సినిమాకు మొదటగా మ్యూజిక్ అందించే అవకాశం కీరవాణికి వచ్చింది. కీరవాణి పేరును రామ్‌గోపాల్ వర్మ సూపించారు. కానీ ఆర్‌జీవీకి కూడా అదే మొదటి సినిమా కావడంతో ప్రొడ్యూసర్లు ఒప్పుకోలేదు.
ఇతర గ్యాలరీలు