Matka: వైజాగ్‌లో సామ్రాజ్యాలు స్థాపించారు.. తెలుగు సినిమాలో నిలబడిపోయే సీన్.. మట్కా డైరెక్టర్ కామెంట్స్
Matka Director Karuna Kumar About Vizag: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ కరుణ కుమార్ వైజాగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే, మట్కాలోని ఓ సీన్ హైలెట్ అని తెలిపారు.
Matka Director Karuna Kumar About Vizag: పలాస 1978, మెట్రో కథలు, కళాపురం, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాలతో డైరెక్టర్‌గా పాపులర్ అయ్యాడు కరుణ కుమార్. తాజాగా కరుణ్ కుమార్ డైరెక్ట్ చేసిన సినిమా మట్కా. ఈ సినిమాలో హీరోగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేయగా.. హీరోయిన్స్‌గా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటించారు.
వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్
నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా థియేటర్లలో మట్కా మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (నవంబర్ 10) నాడు వైజాగ్‌లో మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ కరుణ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"అందరికీ నమస్కారం. గుడ్ ఈవెనింగ్ వైజాగ్. నేను వైజాగ్ అల్లుడిని. దొండపర్తి మా అత్తగారి ఊరు. నా గ్రోత్‌ని ప్రత్యక్షంగా చూసినవాళ్లు ఈ వేడుకలో ఉన్నారు. వాళ్లందరికీ నమస్కారం. నిర్మాతలు నా మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు. మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని కరుణ కుమార్ తెలిపారు.
"వైజాగ్‌కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొంత పార్ట్‌ని ఈ సినిమాగా చూపిద్దాం అనుకున్నాను. ఒక చిన్న మత్స్యకార గ్రామంగా మొదలై వైజాగ్ ఈరోజు ప్రపంచ పటంలో ఒక పవర్ హౌజ్‌గా నిలిచింది. ఇంత దూరం వచ్చిందంటే దీని వెనక చాలామంది మనుషులు ఉన్నారు. వైజాగ్‌లో పుట్టి పెరిగిన వారి జీవితాలు చాలామందికి తెలియదు. ఆ జనరేషన్‌ని మళ్లీ ఒకసారి క్రియేట్ చేద్దామనుకున్నాను" అని కరుణ కుమార్ అన్నారు.
వైజాగ్‌లో నైట్ క్లబ్స్
"మట్కా మూవీ వైజాగ్‌లో ఒకప్పుడు జరిగిన కథ. వైజాగ్‌లో నైట్ క్లబ్‌లు ఉండేవి క్యాబ్రీలు ఉండేవి. అప్పటి మనుషులు అప్పుడు వాళ్లు చేసిన గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ అన్నీ చూపించాలనుకున్నాను. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. వైజాగ్‌లో సామ్రాజ్యాల స్థాపించిన వాళ్లు ఉన్నారు. వాళ్లందరి ఇన్స్పిరేషన్గా తీసుకొని మట్కా చేయడం జరిగింది" అని డైరెక్టర్ కరుణ కుమార్ తెలిపారు.
"కథ చెప్పిన ఫస్ట్ మీటింగ్‌లోనే వరుణ్ గారు ఓకే చేశారు. ఇప్పుడు నవంబర్ 14 కి మీ ముందుకు వస్తుంది. మీరంతా చూసి ఈ సినిమాని ఆశీర్వదించాలి. ఈ సినిమా గ్రోత్ గురించి మాట్లాడుతుంది. మనిషిలోని మంచి చెడు గురించి మాట్లాడుతుంది. నా విజయాన్ని నా విజన్‌కి తెరరూపం ఇచ్చిన మా డీవోపీ కిషోర్‌కి కృతజ్ఞతలు. అప్పటి వైజాగ్‌ని క్రియేట్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. ప్రొడక్షన్ టీం కి కృతజ్ఞతలు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు" అని కరుణ కుమార్ చెప్పారు.
"నా మొట్టమొదటి ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి నేను మెగా ఫ్యాన్‌ని. ఒక మెగా అభిమానిగా నేను ఈరోజు అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా ప్రిన్స్‌ని డైరెక్ట్ చేయడం నా సక్సెస్‌లో ఒక మైల్స్టోన్ అనుకుంటున్నాను. మెగా ఫ్యామిలీలో నెక్ట్స్ జనరేషన్ వరుణ్ బాబు గారు. ఆయన సెట్స్‌లో ఎలా ఉంటారో అనే ఆలోచన ఉండేది. కానీ, రెండో రోజే ఆ ఆలోచనలన్నీ పోయాయి" అని కరుణ కుమార్ వెల్లడించారు.
"వరుణ్ తేజ్ గారికి శుభ్రత అంటే ఇష్టం. కానీ, అలాంటి వ్యక్తి నేల మీద కూర్చోమంటే కూర్చున్నారు. బురదలో పడుకోమంటే పడుకున్నారు. వర్షంలో తడవమంటే తడిసారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక్కరోజు కూడా కంప్లైంట్ చేయకుండా వర్క్ చేశారు. ఈ సినిమాకి ఆయన పెట్టిన ఎఫర్ట్ నా భూతో నా భవిష్యతి" అని కరుణ కుమార్ చెప్పారు.
నిలబడిపోయే సీన్
"ఇది నా ఆత్మ విశ్వాసంతో చెప్తున్నాను. వరుణ్ గారిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే మీరంతా ఆనందపడతారో, ఆయన ఎలాంటి ఫైట్లు డాన్సులు చేయాలనుకుంటున్నారో అంత అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది. ఇందులో సింగిల్ షాట్లో ఒక సీన్ ఉంటుంది. అది తెలుగు సినిమాలో నిలబడిపోయే సీన్ అవుతుంది" అని కరుణ కుమార్ చెప్పుకొచ్చారు.
"నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు హీరో గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి జీవి ప్రకాష్ నెక్ట్స్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. మీనాక్షి, నోరా, జాన్ విజయ్ వీళ్లందరి పర్ఫార్మన్స్లో మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. అందరికీ నా కృతజ్ఞతలు. నవంబర్ 14న సినిమాని థియేటర్లో చూడండి. విజయవంతం చేయండి" అని కరుణ కుమార్ తెలిపారు.