తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Top Malayalam Movies In 2024: హాట్‌స్టార్ ఓటీటీలోకి ఈ ఏడాది వచ్చిన టాప్ మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ బ్లాక్‌బస్టర్సే

OTT Top Malayalam Movies in 2024: హాట్‌స్టార్ ఓటీటీలోకి ఈ ఏడాది వచ్చిన టాప్ మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ బ్లాక్‌బస్టర్సే

Hari Prasad S HT Telugu

18 December 2024, 10:52 IST

google News
    • OTT Top Malayalam Movies in 2024: మలయాళం మూవీస్ కు 2024 ఓ మరుపురాని ఏడాది అని చెప్పొచ్చు. ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్ ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. అందులో చాలా మూవీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ కు రావడం విశేషం.
హాట్‌స్టార్ ఓటీటీలోకి ఈ ఏడాది వచ్చిన టాప్ మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ బ్లాక్‌బస్టర్సే
హాట్‌స్టార్ ఓటీటీలోకి ఈ ఏడాది వచ్చిన టాప్ మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ బ్లాక్‌బస్టర్సే

హాట్‌స్టార్ ఓటీటీలోకి ఈ ఏడాది వచ్చిన టాప్ మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ బ్లాక్‌బస్టర్సే

OTT Top Malayalam Movies in 2024: ఓటీటీలో మలయాళం మూవీస్ కు కేరాఫ్ అని చెప్పగలిగే ప్లాట్‌ఫామ్స్ లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా ఒకటి. అయితే 2024లో మాత్రం ఈ ఓటీటీ ఎన్నో బ్లాక్ బస్టర్ మలయాళం సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన మంజుమ్మెల్ బాయ్స్ నుంచి ఏఆర్ఎం వరకు ఎన్నో మూవీస్ ప్రస్తుతం హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

హాట్‌స్టార్ టాప్ మలయాళం మూవీస్ 2024

మలయాళం సినిమా నుంచి 2024లో వచ్చినన్ని బ్లాక్‌బస్టర్స్ మరెప్పుడూ రాలేదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ఆ ఇండస్ట్రీ నుంచి మంచి సినిమాలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు తక్కువే. కానీ ఈ ఏడాది వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించిన మూవీస్ ఎన్నో ఉన్నాయి. వాటిలో చాలా వరకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఆ మూవీస్ ఏంటో చూడండి.

మంజుమ్మెల్ బాయ్స్

అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాగా చరిత్ర సృష్టించిన మంజుమ్మెల్ బాయ్స్ వివిధ భాషల్లో హాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ రూ.242 కోట్లు వసూలు చేయడం విశేషం. తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్న సినిమా. 2024లో హాట్‌స్టార్ లోకి వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మలయాళం మూవీ ఇది.

ప్రేమలు

మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన సర్‌ప్రైజ్ హిట్ కొట్టిన ప్రేమలు కూడా హాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ మాత్రం ఆహా వీడియోలో ఉన్నా.. మిగిలిన భాషల్లో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేస్తోంది. రూ.130 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది.

ఏఆర్ఎం

టొవినో థామస్ నటించిన మూవీ ఏఆర్ఎం. అంటే అజయంతే రండమ్ మోషనమ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఈ మధ్యే హాట్‌స్టార్ లోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

కిష్కింధ కాండం

మలయాళ థ్రిల్లర్ మూవీ కిష్కింధ కాండం. థియేటర్లలో రూ.76 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు హాట్‌స్టార్ లో మాత్రం మరింత అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఓ మిస్సింగ్ గన్ చుట్టూ తిరిగే కథ, ఊహకందని క్లైమ్యాక్స్ థ్రిల్ చేస్తోంది.

వాజా

కేవలం రూ.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ.40 కోట్లు వసూలు చేసిన మలయాళ కామెడీ డ్రామా వాజా (Vaazha). ఈ మూవీ హాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ తో యువతను ఆకట్టుకుంటున్న మూవీ ఇది.

గురువాయూర్ అంబలనడయిల్

పృథ్వీరాజ్ సుకుమారన్, బేసిల్ జోసెఫ్ నటించిన ఈ కామెడీ డ్రామా కూడా 2024లో మంచి హిట్ కొట్టిన మలయాళం మూవీ. ఇది కూడా హాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవే కాకుండా మోహన్ లాల్ నటించిన నెరు, మలైకొట్టై వాలిబన్.. మమ్ముట్టి, జయరాం నటించిన అబ్రహం ఓజ్లర్ లాంటి సినిమాలు కూడా ఈ ఏడాదే హాట్‌స్టార్ లో అడుగుపెట్టాయి. వీటిలో చాలా వరకు సినిమాలు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ వీటిలో ఏదైనా చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాలతోపాటు 1000 బేబీస్ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఈ ఏడాదే వచ్చింది.

తదుపరి వ్యాసం