OTT Romantic Horror: ఓటీటీలో రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ మూవీ.. మైండ్ డిస్టబ్ అయ్యే సీన్స్.. ఎక్కడ చూడాలంటే?
03 August 2024, 8:19 IST
Aamis Movie OTT Streaming: హారర్, రొమాన్స్ జోనర్‌లో వచ్చిన సినిమానే ఆమిస్. భయపడేలా హారర్ ఎఫెక్ట్స్ ఉంటూనే రొమాంటిక్ తరహాలో మైండ్ డిస్టర్బ్ అయ్యే సీన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఇంత క్రేజ్ ఉన్న ఆ ఆమిస్ సినిమాను ఏ ఓటీటీలో చూడాలనే వివరాల్లోకి వెళితే..
ఓటీటీలో రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ మూవీ.. మైండ్ డిస్టబ్ అయ్యే సీన్స్.. ఎక్కడ చూడాలంటే?
Aamis OTT Release: ఓటీటీలో ఎప్పటికప్పుడు భిన్నమైన జోనర్లలో సినిమాలు వస్తూనే ఉంటాయి. వాటిలో భయపెట్టే హారర్ సినిమాలే కాకుండా యూత్‌ను ఆకర్షించే రొమాంటిక్ మూవీస్ సైతం ఉంటాయి. అయితే, ఈ రెండింటి మేళవింపుతో ఓ సినిమా తెరకెక్కితే. అదే ఆమిస్. దాదాపుగా ఇండియాలో ఈ మూవీ వచ్చేంతవరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కలేదని చెప్పాలి.
ఆమిస్ తర్వాత ఇలాంటి కాన్సెప్ట్‌తో మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కాయి. కానీ, సస్పెన్సింగ్ సీన్స్, మరి వెగటుగా ఉండే రొమాంటిక్ సీన్స్ కాకుండా సందర్భాన్ని బట్టి వేచ్చే సీన్స్‌తో అట్రాక్ట్ చేస్తుంది ఈ సినిమా. లిమా దాస్, అర్ఘదీప్ బారుహ్, నీతాలీ దాస్, సమర్జ్యోతి సర్కార్ ఇతరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు భాస్కర్ హజారికా కథ, దర్శకత్వం వహించారు.
ఆమిస్ అనేది 2019లో వచ్చిన ఒక అస్సామీ సినిమా. నవంబర్ 22న 2019లో విడుదలైన ఈ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. అంతేకాకుండా పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 28న ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో 5 విభాగాల్లో ఆమిస్ నామినేట్ అయింది. ఆమిస్ అంటే అస్సామి భాషలో మాంసాహారి అని అర్థం వస్తుంది. ఈ టైటిల్‌కు తగినట్లే సినిమా సాగుతుంది.
ఓ లేడి డాక్టర్, ఒక పీహెచ్‌డీ విద్యార్థి మధ్య సాగే లవ్ ఎఫైర్ కథాంశంగా సాగిన ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు ఆశ్చర్యపరుస్తాయి. సందర్భానుసారం వచ్చే సీన్స్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయి. డాక్టర్, విద్యార్థి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్‌ను మరి బోల్డ్‌గా కాకుండా వారి మనసులో ఉన్న ఫీలింగ్స్‌ను చాలా బాగా ఆవిష్కరించారు.
ఇక కొన్ని సీన్స్ అయితే మైండ్ డిస్టర్బ్ అయ్యేలా ఉంటాయి. సెన్సిటివ్ పీపుల్స్ చూసి తట్టుకోవడం కష్టమే. కాబట్టి ఈ సినిమాను చూడాలంటే కాస్తా ధైర్యం కావాల్సిందే. సినిమా మొత్తం మాంసహార భోజనంపైనే జరుగుతుంది. ఈ క్రమంలో లేడి డాక్టర్‌కు ఆ విద్యార్థి వివిధ రకాలైన నాన్ వెజ్ రుచులు చూపిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు జంతువులను రుచి చూస్తుంది ఆ లేడి డాక్టర్.
దాంతో నాన్ వెజ్‌కు అడిక్ట్ అయిన లేడి డాక్టర్ సరికొత్త రుచి కోరుకుంటుంది. అదే మనిషి మాంసం. దానికోసం ఆ విద్యార్థి ఏం చేశాడనేదే సినిమా కథ. అక్కడక్కడ కొన్ని సీన్స్ బోరింగ్‌గా అనిపించినా అవి కథలో భాగంగా, పాత్రల డెప్త్, పరిస్థితులను అర్థం చేసుకునేందుకు పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఇక సినిమాకు క్వాన్ బే ఇచ్చిన మ్యూజిక్ చాలా ఎంగేజింగ్‌గా కథలో లీనమయ్యేలా ఉంటుంది.
సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోతుంది. పాత్రల ఫీలింగ్స్, డాక్టర్ మనిషి మాంసాన్ని రుచి చూసినప్పుడు ఆమెలో కలిగే అనుభూతులను విజువల్‌గా చాలా బాగా చూపించారు. బీజీఎమ్, విజువల్స్‌తో సినిమాలో హారర్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేలా చేశారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ ఆమిస్ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఐమ్‌డీబీ సంస్థ 10కి 7.8 రేటింగ్ ఇచ్చిన ఆమిస్ సోనీ లివ్‌లో ప్రస్తుతానికి అస్సామీ, హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి భాషా సినిమాలు అయినా చూస్తామనుకునేవారు ఇంగ్లీష్ సబ్‌టైటిల్‌తో ఎంచక్కా ఆమిస్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
కుప్పలుతెప్పలుగా వచ్చే పడే ఓటీటీ సినిమాల్లో ఏది చూడాలనే కన్‌ఫ్యూజన్ ఉన్నవారు.. ఓసారి ఆమిస్ ట్రై చేయడం బెటర్. కానీ, సెన్సిటివ్ మనుషులు ఈ సినిమాకు దూరంగా ఉండటం మంచిది. ఎలాంటి అడల్డ్ సీన్స్ లేవు. కాబట్టి ఓపెన్‌గా అందరిముందు ఇంట్లో కూడా చూడొచ్చు. మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఒక్కరే చూడటం బెటర్.