OTT Releases this week: ఈవారం ఓటీటీల్లోకి రాబోతున్న మూవీస్, వెబ్ సిరీస్, షోస్ ఇవే
23 October 2023, 16:52 IST
- OTT Releases this week: ఈవారం ఓటీటీల్లోకి ఇంట్రెస్టింగ వెబ్ సిరీస్, సినిమాలు, షోస్ రాబోతున్నాయి. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో అవి రిలీజ్ కానున్నాయి.
స్కంద మూవీలో రామ్ పోతినేని
OTT Releases this week: ప్రతివారంలాగే ఈ వారం ఓటీటీల్లోకి కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వీటిలో రెండు వెబ్ సిరీస్ లు రెండో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక కాఫీ విత్ కరణ్ టాక్ షో 8వ సీజన్ కూడా ఈ వారంలోనే ప్రారంభం కానుంది. ఏ ఓటీటీలో ఏ సినిమా, వెబ్ సిరీస్ రానుందో ఇప్పుడు చూద్దాం.
స్కంద - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney + Hotstar)
రామ్ పోతినేని నటించిన స్కంద మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో శుక్రవారం (అక్టోబర్ 27) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
దురంగా సీజన్ 2 - జీ5 (Zee5)
జీ5 (Zee5) ఓటీటీలో వచ్చిన దురంగా తొలి సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ రానుంది. మంగళవారం (అక్టోబర్ 24) ఈ సిరీస్ స్ట్రీమింగ్ మొదలవుతుంది. సౌత్ కొరియన్ సిరీస్ ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ కు ఇది రీమేక్. ఇందులో గుల్షన్ దేవయ్య, ద్రష్టి దామి, అమిత్ సాధ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఆస్పిరెంట్స్ సీజన్ 2 - ప్రైమ్ వీడియో (Prime Video)
ఐఏఎస్ కావాలని కలలు కనే ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథే ఆస్పిరెంట్స్. తొలి సీజన్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ ప్రైమ్ వీడియోలో బుధవారం (అక్టోబర్ 25) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్యే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
మాస్టర్ పీస్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney + Hotstar)
నిత్య మేనన్ నటించిన ఈ కామెడీ సిరీస్ కథ ఓ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఇందులో నిత్య మేనన్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ కొత్త సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో బుధవారం (అక్టోబర్ 25) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
చంద్రముఖి 2 - నెట్‌ఫ్లిక్స్ (Netflix)
18 ఏళ్ల కిందట రజనీకాంత్, జ్యోతిక నటించిన చంద్రముఖి మూవీకి సీక్వెల్ గా వచ్చిన చంద్రముఖి 2లో లారెన్స్ రాఘవ, కంగనా రనౌత్ నటించారు. తొలి పార్ట్ అంత భయపెట్టకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో గురువారం (అక్టోబర్ 26) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
కాఫీ విత్ కరణ్ సీజన్ 8 - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ 8వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో హిట్ గా నిలిచింది. ఇప్పుడు 8వ సీజన్ తొలి ఎపిసోడ్ లోనే రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ గెస్టులుగా రానున్నారు. ఈ కొత్త సీజన్ గురువారం (అక్టోబర్ 26) నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.