Skanda Worldwide Collection: స్కంద 14 డేస్ కలెక్షన్స్.. 47 కోట్ల సినిమాకు వచ్చింది ఇంతే!-skanda movie 14 days worldwide box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Skanda Worldwide Collection: స్కంద 14 డేస్ కలెక్షన్స్.. 47 కోట్ల సినిమాకు వచ్చింది ఇంతే!

Skanda Worldwide Collection: స్కంద 14 డేస్ కలెక్షన్స్.. 47 కోట్ల సినిమాకు వచ్చింది ఇంతే!

Sanjiv Kumar HT Telugu
Oct 12, 2023 01:26 PM IST

Skanda Day 14 Collection: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, క్రేజీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‍లో వచ్చిన లేటెస్ట్ మూవీ స్కంద. సెప్టెంబర్ 28న రిలీజైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే మరి స్కంద సినిమాకు రెండు వారాల్లో కలెక్షన్స్ ఎంతొచ్చాయో లెక్కలేస్తే..

స్కంద  14 డేస్ కలెక్షన్స్
స్కంద 14 డేస్ కలెక్షన్స్

Skanda 14 Days Collection: రామ్ పోతినేని, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన స్కంద సినిమా రెండు వారాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటివరకు స్కంద సినిమాకు కలెక్షన్స్ పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇలా స్కంద సినిమాకు 13వ రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ. 26 లక్షల షేర్ కలెక్షన్స్ రాగా 14వ రోజున రూ. 18 లక్షల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్‌గా 14వ రోజు రూ. 20 లక్షల షేర్ కలెక్షన్స్ రాబట్టగలిగింది.

తెలుగు రాష్ట్రాల్లో

స్కంద సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాలకు కలిపినైజాంలో రూ. 10.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.23 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.65 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.29 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.47 కోట్లు, గుంటూరులో రూ. 2.62 కోట్లు, కృష్ణాలో రూ. 1.56 కోట్లు, నెల్లూరులో రూ. 1.22 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో టోటల్‌గా రూ. 27.94 కోట్ల షేర్, రూ. 46.95 కోట్ల గ్రాస్ వసూళు అయింది.

వరల్డ్ వైడ్‌ కలెక్షన్స్

అలాగే, స్కంద చిత్రానికి 14 రోజుల్లో కర్ణాటకతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.74 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.94 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అన్నీ కలుపుకుని రెండు వారాల్లో స్కంద మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 32.62 కోట్ల షేర్, రూ. 57.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఇప్పటివరకు 69 శాతం కలెక్షన్స్ రికవరీ అయింది.

ఇంకా రావాల్సింది

ఇదిలా ఉంటే రూ. 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన స్కంద మూవీ 2 వారాలు పూర్తి చేసుకుంది. ఇంకా సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కావాలంటే రూ. 14.38 కోట్లు షేర్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. కాకపోతే ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది.

Whats_app_banner