Aspirants Season 2 Trailer: ఆస్పిరెంట్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. రెండో సీజన్ ట్రైలర్ అదుర్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-aspirants season 2 trailer released thursday october 19th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aspirants Season 2 Trailer: ఆస్పిరెంట్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. రెండో సీజన్ ట్రైలర్ అదుర్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Aspirants Season 2 Trailer: ఆస్పిరెంట్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. రెండో సీజన్ ట్రైలర్ అదుర్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Oct 19, 2023 03:30 PM IST

Aspirants Season 2 Trailer: ఆస్పిరెంట్స్ మళ్లీ వచ్చేస్తున్నారు. ఈ సూపర్ హిట్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ట్రైలర్ గురువారం (అక్టోబర్ 19) రిలీజైంది. ఐఏఎస్ కావాలని కలలు కనే ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథే ఈ ఆస్పిరెంట్స్.

ఆస్పిరెంట్స్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది
ఆస్పిరెంట్స్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది

Aspirants Season 2 Trailer: ఆస్పిరెంట్స్ (Aspirants) వెబ్ సిరీస్ ఎంతటి ఆదరణ సంపాదించిందో తెలుసు కదా. టీవీఎఫ్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజై.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ గురువారం (అక్టోబర్ 19) రిలీజైంది.

అభిలాష్, గురి, ఎస్‌కే అనే ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథే ఈ ఆస్పిరెంట్స్ (Aspirants). రెండో సీజన్ కూడా ప్రధానంగా ఈ ముగ్గురితోపాటు సీనియర్ ఆస్పిరెంట్ సందీప్ భయ్యా (సన్నీ హిందూజా) చుట్టూనే తిరిగినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ముగ్గురిలో అభిలాష్ (నవీన్ కస్తూరియా) మాత్రమే ఐఏఎస్ సాధిస్తాడు. మిగతా ఇద్దరూ వేర్వేరు దారులు చూసుకుంటారు.

సందీప్ భయ్యా మాత్రం తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. ఈ ముగ్గురు స్నేహితులు తమ ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేయలేక పలు సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. వాటిని రెండో సీజన్ లో మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు. తొలి సీజన్ మొత్తం ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అడ్డా అయిన ఢిల్లీలోని రాజేందర్ నగర్ లో జరిగితే.. రెండో సీజన్ రామ్ పూర్ కు షిఫ్ట్ అవుతుంది.

ఈ రెండో సీజన్ లో సీనియర్ అయిన సందీప్ భయ్యా.. జూనియర్ అయిన అభిలాష్ కింద పని చేయాల్సి రావడం, ఒక దశలో అతని ముందు తలదించుకోవాల్సి రావడం ట్రైలర్ లో చూడొచ్చు. ముగ్గురు స్నేహితుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి.

ఈ ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్ ను అరుణబ్ కుమార్, శ్రేయాన్ష్ పాండే క్రియేట్ చేశారు. ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) నిర్మించిన అద్భుతమైన సిరీస్. దీపేశ్ సుమిత్రా జగదీశ్ స్క్రిప్ట్ అందించగా.. అపూర్వ్ కర్కి డైరెక్ట్ చేశాడు. సన్నీ హిందూజా, నమితా దూబె, అభిలాష్ తప్లియాల్, శివాంకిత్ పరిహార్, నవీన్ కస్తూరియా నటించారు. ఆస్పిరెంట్స్ సీజన్ 2 అక్టోబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Whats_app_banner