Ram Charan: ఇది తనకి పునర్జన్మ.. అది మాకు చాలా కష్టమైన సమయం.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్-ram charan comments on sai dharam tej in syg sambarala yetigattu carnage release event says that is hard time to us ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan: ఇది తనకి పునర్జన్మ.. అది మాకు చాలా కష్టమైన సమయం.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్

Ram Charan: ఇది తనకి పునర్జన్మ.. అది మాకు చాలా కష్టమైన సమయం.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్

Sanjiv Kumar HT Telugu
Dec 14, 2024 05:28 PM IST

Ram Charan About Sai Durga Tej In SYG Carnage Event: రామ్ చరణ్ ఇటీవల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ సంబరాల ఏటిగట్టు (ఎస్‌వైజీ-SYG) టైటిల్ కార్నేజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

ఇది తనకి పునర్జన్మ.. అది మాకు చాలా కష్టమైన సమయం.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్
ఇది తనకి పునర్జన్మ.. అది మాకు చాలా కష్టమైన సమయం.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్

Ram Charan Comments In SYG Carnage Event: మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి సినిమాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నటిస్తున్న ప్రాజెక్ట్ #SDT18. సరికొత్త యాక్షన్-ప్యాక్డ్ సినిమాగా వస్తున్న ఈ మూవీ టైటిల్‌ను ఇటీవల రివీల్ చేశారు.

yearly horoscope entry point

ముఖ్య అతిథిగా

ఈ సినిమాకు SYG (సంబరాల ఏటిగట్టు) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశఆరు. దీనికి సంబంధించి టైటిల్ రివీల్ చేసే వీడియోను రిలీజ్ చేస్తూ సంబరాల ఏటిగట్టు కార్నేజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విచ్చేశారు. ఈ ఈవెంట్‌లోనే రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

గుండెల్లో పెట్టుకుని ప్రేమించే

ఎస్‌వైజీ కార్నేజ్‌ లాంచ్ ఈవెంట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్‌కి, అలాగే మేము ఎంతగానో గుండెల్లో పెట్టుకొని ప్రేమించే మా అభిమానులందరికీ పేరు పేరునా నమస్కారం" అని చెప్పాడు.

మంచి కొడుకు

"ముందుగా తేజ్‌కి కంగ్రాచ్యులేషన్స్. ఒక ఫైటర్‌లా ఈ టెన్ ఇయర్స్‌ని పూర్తి చేశాడు. ఇది బ్యూటిఫుల్ జర్నీ. తేజ్ ఒక మంచి యాక్టర్ మాత్రమే కాదు మంచి వ్యక్తి. అది మీ అందరికీ తెలుసు. తను ఒక మంచి తమ్ముడు, మంచి అన్నయ్య, మంచి కొడుకు, మంచి మేనల్లుడు. తను ప్రతి క్యారెక్టర్‌కి తపన పడతాడు. కష్టపడతాడు" అని రామ్ చరణ్ అన్నాడు.

చాలా కష్టమైన సమయం

"మీ అందరి సపోర్ట్ వల్లే తను (సాయి ధరమ్ తేజ్) ఇక్కడ ఉన్నాడు. తేజు ఈరోజు ఇక్కడ ఎలా నిలిచి ఉండటానికి కారణం అభిమానుల బ్లెస్సింగ్స్. ఇది తనకి పునర్జన్మ. ఈ జన్మ అభిమానులే ఇచ్చారు. ఆ సమయాన్ని మళ్లీ గుర్తు చేసుకోవాలని నాకు లేదు. కానీ, ఆ మూడు నెలలు మాకు చాలా కష్టమైన సమయం. అంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత తేజు మళ్లీ ఇక్కడ నిల్చున్నాడు అంటే తిను మా తేజ్ కాదు మీ తేజు. మీ అందరికీ తేజ్ తరఫున, మా విజయ అక్క తరఫున పేరుపేరునా ధన్యవాదాలు" అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

తేజూ ఊచకోత చూస్తారు

"ఇది తేజుకి 18వ ఫిల్మ్. సంబరాల ఏటిగట్టు. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. అవుట్ స్టాండింగ్ విజువల్స్. రోహిత్ గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్తున్నాను. తను ఫస్ట్ సినిమా చేస్తున్నట్టుగా లేదు. చాలా అద్భుతంగా ఉంది" అని రామ్ చరణ్ అన్నాడు.

ఇంత బడ్జెట్ పెట్టినందుకు

"తేజ్ మీద ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్నందుకు నిర్మాతలు నిరంజన్, చైతన్య గారికి ఆల్ ది వెరీ బెస్ట్. ఇది సినిమా పట్ల వారికి ఉన్న ఫ్యాషన్‌ని తెలియజేస్తుంది. ఐశ్వర్య గారికి, ఈ సినిమాలో పని చేస్తున్న టెక్నీషియన్స్‌కి ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని రామ్ చరణ్ పేర్కొన్నాడు.

మంచి న్యూస్ వినిపించాలని

"తేజు ప్రేమ చాలా బండ ప్రేమ. ఒక్కసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు. అంత గట్టిగా ప్రేమిస్తాడు. ఈ సినిమాతో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి మంచి న్యూస్ కూడా వినిపించాలని కోరుకుంటున్నాను. థాంక్యూ. లవ్ యూ ఆల్" అని రామ్ చరణ్ తన స్పీచ్ ముగించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Whats_app_banner