తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam Comedy Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హిట్ మలయాళం కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హిట్ మలయాళం కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

Hari Prasad S HT Telugu

25 September 2024, 16:02 IST

google News
    • OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి మరో మలయాళం కామెడీ మూవీ వస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం అవుతోంది. మరో రెండు రోజుల్లోనే ఈ మూవీ రానుంది.
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హిట్ మలయాళం కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హిట్ మలయాళం కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హిట్ మలయాళం కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

OTT Malayalam Comedy Movie: మలయాళం సినిమా లవర్స్ కు గుడ్ న్యూస్. ఓటీటీలోకి మరో కామెడీ డ్రామా వచ్చేస్తోంది. గత నెలలో రిలీజైన భరతనాట్యం మూవీ.. ఇప్పుడు ఓటీటీలో అడుగుపెడుతోంది. మరో రెండు రోజుల్లో రాబోతున్న ఈ సినిమాకు ఫీల్ గుడ్ మూవీ అంటూ థియేటర్లలో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

భరతనాట్యం ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీలోకి రాబోతున్న మలయాళం కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు భరతనాట్యం. ఈ సినిమా ఆగస్ట్ 30న థియేటర్లలో రిలీజైంది. వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 27) నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ప్రముఖ మలయాళం నటుడు సైజు కురుప్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

భరతనాట్యం మూవీ ఏంటంటే?

భరతనాట్యం మూవీ టైటిల్ చూసి ఇదేదో ఆ సాంప్రదాయ నృత్యం చుట్టూ తిరిగే మూవీ అనుకుంటే పొరపాటే. నిజానికి ఇదో కామెడీ ఫ్యామిలీ డ్రామా. సినిమాలో ఓ ప్రధాన పాత్ర అయిన భరతన్ నాయర్ (సాయి కుమార్) పేరు మీదుగా ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టారు.

డెబ్యూ డైరెక్టర్ కృష్ణదాస్ మురళీ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మొత్తం భరతన్, అతని తనయుడు శశి (సైజు కురుప్), భరతన్ సీక్రెట్ గా దాచి పెట్టిన రెండో కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకు మలయాళ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఓటీటీల్లోని రీసెంట్ మలయాళం మూవీస్

ఓటీటీల్లోకి ఈ మధ్య కాలంలో ఎన్నో కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్ని తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. జీ5 ఓటీటీలో నూనక్కుళి, సోనీలివ్ ఓటీటీలో తలవన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో వాజా, జియో సినిమాలో వచ్చిన జలధార పంప్ సెట్ సిన్స్ 1962, నెట్‌ఫ్లిక్స్ లోని అడియోస్ అమిగో, అమెజాన్ ప్రైమ్ వీడియోలోని విశేషం సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తున్నారు.

తదుపరి వ్యాసం