OTT Malayalam Thriller Movie: తెలుగులో ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ మలయాళ థ్రిల్లర్ మూవీ
OTT Malayalam Thriller Movie: ఓటీటీలోకి తెలుగులో ఓ మలయాళ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. అంచక్కల్లకోక్కన్ పేరుతో ఆరు నెలల కిందట రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు తెలుగులో ఆహా వీడియోలోకి అడుగుపెడుతోంది.
OTT Malayalam Thriller Movie: ఓటీటీలోకి ఇప్పుడు మరో మలయాళం మూవీ తెలుగులో రాబోతోంది. ఈ ఏడాది మార్చిలో అంచక్కల్లకోక్కన్ పేరుతో మలయాళంలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు తెలుగులో చాప్రా మర్డర్ కేసు పేరుతో నేరుగా ఓటీటీలో అడుగుపెడుతోంది. సినిమాకు మంచి టాకే వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం నష్టాలనే మిగిల్చింది ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.
చాప్రా మర్డర్ కేస్ ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళం మూవీ చాప్రా మర్డర్ కేస్ గురువారం (సెప్టెంబర్ 26) నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. "చాప్రా మర్డర్ కేస్ వెనుక ఉన్న నమ్మలేని నిజాన్ని వెలికి తీయండి.. సెప్టెంబర్ 26 నుంచి ఆహాలో ఈ మిస్టరీని ఛేదించడానికి మీరు కూడా మాతో కలవండి" అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 15న థియేటర్లలో రిలీజైంది.
చాప్రా మర్డర్ కేస్ మూవీ గురించి..
మలయాళంలో అంచక్కల్లకోక్కన్ పేరుతో ఈ సినిమా వచ్చింది. ఉల్లాస్ చెంబన్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. లూక్మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్, మణికందన్ ఆచారి, శ్రీజిత్ రవిలాంటి వాళ్లు ఈ మూవీలో నటించారు. ఓ నరహత్య చుట్టూ తిరిగే స్టోరీ ఇది. అంచక్కల్లకోక్కన్ మలయాళం వెర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది.
చాప్రా మర్డర్ కేస్ చిత్రం 1980ల బ్యాక్‍డ్రాప్‍లో సాగుతుంది. కేరళ - కర్ణాటక సరిహద్దు గ్రామంలో స్టోరీ నడుస్తుంది. భూస్వామి అయిన చాప్రా (శ్రీజిత్ రవి) హత్యకు గురవుతారు. అప్పుడే అక్కడి పోలీస్ స్టేషన్‍కు వాసుదేవన్ (లుక్మన్ అవరన్) కానిస్టేబుల్‍గా వస్తాడు. అప్పటికే హెడ్ కానిస్టేబుల్ నందవరంబన్ పీటర్ (చెంబన్ వినోద్ జోస్) పట్టుకలిగి ఉంటాడు. చాప్రా హత్య కేసును వీరి విచారిస్తారు.
తన తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు చాప్రా కుమారులు కూడా కసిగా ఉంటారు. ఈ క్రమంలో స్టోరీలో మలుపులు ఉంటాయి. ఆ తర్వాత ఏమైంది? చాప్రాను చంపిందెవరు? మిస్టరీ వీడిందా? అనేవి ఈ మూవీలో ఉంటాయి.