Zee5 OTT Movies: జీ5 ఓటీటీలోకి ఒకే రోజు రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు.. ఒకటి హారర్.. మరొకటి డైరెక్ట్ స్ట్రీమింగ్-zee5 ott movies released this friday horror thriller demonte colony 2 and love sitara will be streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee5 Ott Movies: జీ5 ఓటీటీలోకి ఒకే రోజు రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు.. ఒకటి హారర్.. మరొకటి డైరెక్ట్ స్ట్రీమింగ్

Zee5 OTT Movies: జీ5 ఓటీటీలోకి ఒకే రోజు రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు.. ఒకటి హారర్.. మరొకటి డైరెక్ట్ స్ట్రీమింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 25, 2024 05:05 PM IST

Zee5 OTT Movies: జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ వారం రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు అడుగుపెడుతున్నాయి. సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ డిమోంటీ కాలనీ 2 స్ట్రీమింగ్‍కు రానుంది. శోభితా ధూళిపాళ్ల నటించిన ఓ మూవీ నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

OTT Horror Thriller: జీ5 ఓటీటీలోకి ఒకే రోజు రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు.. ఒకటి హారర్.. మరొకటి డైరెక్ట్ స్ట్రీమింగ్
OTT Horror Thriller: జీ5 ఓటీటీలోకి ఒకే రోజు రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు.. ఒకటి హారర్.. మరొకటి డైరెక్ట్ స్ట్రీమింగ్

జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ దూకుడుగా సినిమాలు, వెబ్ సిరీస్‍లను తీసుకొస్తోంది. అందులో చాలా చిత్రాలు మంచి వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఈ వారం జీ5లో రెండు ఆసక్తికరమైన చిత్రాలు స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానున్నాయి. డిమోంటీ కాలనీ, లవ్ సితార చిత్రాలు ఈ వారమే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టన్నాయి. ఒకటి హారర్ థ్రిల్లర్ కాగా.. మరొకటి రొమాంటిక్ డ్రామాగా ఉంది. లవ్ సితార నేరుగా ఓటీటీలోకే వస్తోంది. ఆ వివరాలు ఇవే..

డిమోంటి కాలనీ 2

డిమోంటి కాలనీ 2 థియేటర్లలో సక్సెస్ అయింది. ఈ తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. రెండు భాషల్లో మంచి కలెక్షన్లను దక్కించుకుంది. 2015లో వచ్చి హిట్ అయిన డిమోంటి కాలనీక సీక్వెల్‍గా తొమ్మిదేళ్ల తర్వాత వచ్చింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ డిమోంటి కాలనీ 2 చిత్రం ఆగస్టు 15న తమిళంలో, ఆగస్టు 23 తెలుగులో థియేటర్లలో రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

డిమోంటి కాలనీ 2 చిత్రం ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ శుక్రవారం సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. తమిళం, తెలుగులో స్ట్రీమింగ్ అవనుంది. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రంలో అరుళ్‍నిథి, ప్రియా భవానీ లీడ్ రోల్స్ చేశారు.

నలుగురు స్నేహితులు శాపానికి గురైన ఓ చైన్‍ను దొంగలించడం వల్ల దెయ్యం మేల్కొంటుంది. దాని నుంచి వారు ఎలా తప్పించుకున్నారన్న విషయం చుట్టూ డిమోంటి కాలనీ 2 మూవీ సాగుతుంది. ఈ చిత్రంలో అర్చన్ రవీంద్రన్, జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, కూడా ముఖ్యమైన పాత్రలు చేశారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు. ఈ మూవీని సెప్టెంబర్ 27 నుంచి జీ5 ఓటీటీలో చూడొచ్చు. పాజిటివ్ టాక్ ఉండటంతో ఓటీటీలో ఈ చిత్రం మంచి వ్యూస్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు ‘లవ్ సితార’

లవ్ సితార చిత్రం థియేటర్లలోకి రాకుండా నేరుగా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెడుతోంది. ఈ సినిమా కూడా ఈ శుక్రవారం సెప్టెంబర్ 27న స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామా మూవీలో శోభితా ధూళిపాళ్ల, రాజీవ్ సిద్ధార్థ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేమ, మనస్ఫర్థలు, ఎమోషన్స్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. లవ్ సితార చిత్రానికి వందన కటారియా దర్శకత్వం వహించారు.

లవ్ సితార చిత్రంలో శోభితా, రాజీవ్‍తో పాటు సోనాలీ కులకర్ణి, జయశ్రీ, వర్జినియా రోడ్రిగ్స్, సంజయ్ భుటియానీ కీరోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆర్ఎస్‍వీపీ బ్యానర్ నిర్మించింది. ట్రైలర్ ఆకట్టుకోవటంతో ఈ మూవీపై మంచి హైప్ ఉంది.

కేరళ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ సితార చిత్రం సాగుతుంది. ఇంటీరియల్ డిజైనర్ సితార (శోభితా ధూళిపాళ్ల), చెఫ్ అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ) ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. వివాహ వేడుకలు మొదలవుతాయి. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మనస్ఫర్థలు వస్తాయి. కొన్ని రహస్యాలు బయటపడతాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది లవ్ సితార మూవీలో ఉంటుంది.

ఇలా, సెప్టెంబర్ 27న ఒకే రోజు హారర్ థ్రిల్లర్ డిమోంటి కాలనీ 2, రొమాంటిక్ డ్రామా లవ్ సితార చిత్రాలు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి.

Whats_app_banner