తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns March 15th Episode: హంతకుడికి దగ్గరికి పిల్లలు.. తల్లిని చంపమన్నది ఎవరో చెప్పమన్న అంజు.. దొరికిపోనున్న మనోహరి!

NNS March 15th Episode: హంతకుడికి దగ్గరికి పిల్లలు.. తల్లిని చంపమన్నది ఎవరో చెప్పమన్న అంజు.. దొరికిపోనున్న మనోహరి!

Sanjiv Kumar HT Telugu

15 March 2024, 13:31 IST

google News
  • Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 15వ తేది ఎపిసోడ్‌లో అరుంధతిని చంపిన హంతకుడి దగ్గరకు పిల్లలు వెళ్తారు. తమ తల్లిని ఎందుకు చంపావని, ఎవరు చంపమన్నారో అని బతిమిలాడుతారు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 15వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 15వ తేది ఎపిసోడ్‌

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 15వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam March 15th Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 15th March Episode) మీకు ఈ ఇంటికి సంబంధం ఉంది మిస్సమ్మ నా భార్య మీ నాన్నకి కూతురు, నీకు అక్క అవుతుంది అంటాడు అమర్​. ఆ మాట విన్న మనోహరి టెన్షన్ పడిపోతూ ఏం మాట్లాడుతున్నావ్ అమర్. ఆరు ఆయన కూతురా అంటుంది. అవును మనోహరి అని అంటాడు అమర్​. మీ భార్య నాకు అక్కవడమేంటి సార్ నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటుంది భాగమతి.

నువ్వే చెప్పేలా ఉన్నావ్

బాబు మీరు ఏమంటున్నారు అంటాడు రామ్మూర్తి. మీరు మా ఇంటికి వచ్చిన రోజు మా నాన్న ఏమన్నారు. నా భార్యకి తండ్రి స్థానంలో ఉండమన్నారు కదా అలాంటప్పుడు మీరు తండ్రి అవుతారు మిస్సమ్మ చెల్లి అవుతుంది. అనాధ అయిన నా భార్యకు మీరు తండ్రిగా ఉండలేరా అంటాడు అమర్​. అమ్మగారు నిజం తెలిసిపోయిందని భయపడ్డారా అంటుంది నీల. వాళ్లకు తెలియకపోయినా నువ్వే చెప్పేలా ఉన్నావు నోరు మూసుకోవే అంటుంది మనోహరి.

మిస్సమ్మ నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదనే కదా మీ నాన్న ఆరోగ్యానికి నా సంతకం అడగలేకపోయారు. అదే నా భార్యకి తండ్రి అయితే అప్పుడు మీరు అడగాల్సిన అవసరం ఉండదు. అది నా బాధ్యత అవుతుంది అని అంటాడు అమర్​. రాథోడ్ వెళ్లి లెటర్ తీసుకువస్తాడు. మీ నాన్న ఆరోగ్యం కోసం మా ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగావు. నీకు ఇష్టం లేకపోయినా ఇలాంటి పని చేయడానికి ఒప్పుకున్నావో ఆ లెటర్ మిస్సమ్మ.. తీసుకో అంటాడు అమర్​.

ఇప్పుడే చూస్తున్నాను

భాగమతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ లెటర్‌ని తీసుకుని దండం పెడుతుంది. దండం పెట్టి ఈ ఇంటికి సంబంధం లేనట్టు ఉండొద్దు మిస్సమ్మ అంటాడు అమర్​. బాబు.. స్కూల్లో ప్రేమగా పిలిచి నన్ను నా కూతురిని ఇంత ఆప్యాయంగా చూసుకుంటున్న మీ గొప్ప మనసుకి కాళ్ల మీద పడి నమస్కారం పెట్టాలని ఉంది. కానీ ఆయుష్షు తగ్గిపోతుందని ఆలోచిస్తున్నాను. మానవత్వం ఉన్న మనుషులు ఉంటారని విన్నాను. కానీ ఇలాంటి గొప్ప మనుషులు కూడా ఉంటారని ఇప్పుడే చూస్తున్నాను అని రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటాడు.

అన్నయ్యగారు ఇక మీదట మీకు ఎవరూ లేరని బాధపడకూడదు. మీరు ఈ ఇంటి మనుషులే అంటుంది నిర్మల. మీరు నా భార్యకి తండ్రి లాంటి వారు నేను చేస్తున్నది సహాయం కాదు. ఇది నా బాధ్యత అని అంటాడు అమర్​. ఆయనని ఇంటికి రమ్మని పిలిచి గొప్ప పని చేశావు నాన్న అంటాడు శివరామ్​. చాలా బాగా చెప్పారండి అని అరుంధతి సంతోషిస్తుంది. మిస్సమ్మ మీ నాన్నని తీసుకువెళ్లి హాస్పటల్లో జాయిన్ చేయించు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోకు అంటాడు అమర్​.

ఎవరు చంపించారో

మిస్సమ్మ నువ్వు వచ్చిన పని అయిపోయిందని వెళ్లిపోతావా అంటుంది అంజు. నేను వచ్చిన పని అయిపోలేదు అంజు. ఇప్పుడే కదా పెళ్లి పనులు మొదలయ్యాయి అంటుంది భాగమతి. ఏం మాట్లాడుతున్నావ్ అమర్ పిల్లల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్లడం ఏంటి అంటాడు శివరామ్. అంజలి ఇప్పుడు మనం వెళ్లి అమ్మని చంపిన హంతకుడిని కలవడమేంటే అంటుంది అమృత. అవునా.. పిల్లలని చూస్తే అయినా వాడు చేసింది తప్పని తెలుసుకొని ఆరుని ఎవరు చంపించారో చెబుతాడేమో అంటాడు అమర్​.

అమ్మూ.. అమ్మని ఎందుకు చంపాడు తెలుసుకోవాలి అంటుంది అంజలి. అమ్మ చచ్చిపోయింది కారణం తెలుసుకొని మనమేం చేసుకుంటాం. తెలుసుకుంటే మాత్రం చనిపోయిన అమ్మ తిరిగి వస్తుందా అంటుంది అమృత. నీకు తెలియదు అమ్మూ.. అమ్మ చనిపోయేటప్పుడు నేను తన పక్కనే ఉన్నాను. మనం వెళ్లి అడిగితే నైనా అంకుల్ మనసు మారి ఇంకొకరి పిల్లలకి తల్లిని దూరం చేయకుండా ఉంటాడు. మనలాగా ఇంకొకరు తల్లిని పోగొట్టుకొని బాధపడకూడదు అంటుంది అంజలి.

పోలీస్ట్ స్టేషన్‌కు పిల్లలు

ఆ మాటలు విన్న ముగ్గురు అంజలిని హగ్ చేసుకుని బాధపడి సరే అంజలి వెళ్దాం అని అంటారు. పిల్లల్ని తీసుకు వెళ్లడం నాకు ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నాను అమర్. కానీ తొందరగా వచ్చేయండి అంటాడు శివరామ్. ఇప్పుడు అమర్ పిల్లల్ని తీసుకుని వెళ్తే వాడు నిజం చెప్పేస్తాడు. నో అలా జరగకూడదు అంటే నేను అమర్‌తో వెళ్లాలి అనుకుంటుంది మనోహరి. పిల్లల్ని తీసుకొని అమర్ పోలీస్​స్టేషన్​కి​ బయలుదేరుతాడు.

అమర్ నేను కూడా వస్తాను అంటుంది మనోహరి. చూడక్కా నువ్వు ఉపవాసం ఉన్నావ్. ఈరోజు గుడికి వెళ్లాలి లేదంటే పెళ్లిలో ఉన్న దోషాలు పోవని భాగమతి మనోహరిని ఆపుతుంది. వెంటనే మనోహరి వేరే కారు వేసుకొని వెళుతుంది. నీ భయమే నువ్వు సార్ వాళ్ల భార్యని హత్య చేయించావని అర్థమవుతుంది. అది ఎలాగైనా సరే బయటపడాలి అని భాగమతి అనుకుంటుంది. అమర్​, పిల్లలు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. వాళ్లను చూసి భయపడుతూ ఉంటాడు ఆ రౌడీ.

ఒక్క ఫోన్ కాల్ చేస్తే

ఏంటి కుటుంబ సమేతంగా వచ్చావు అంటాడు సీఐ. ఆఫీసర్ ఒక పది నిమిషాలు అతన్ని మేము కలువచ్చా అంటాడు అమర్​. ఎంత మిల్ట్రీ ఆఫీసర్ వైన సరే రూల్స్ కొన్ని ఉంటాయి కదా వాటిని మేము అతిక్రమించలేము లెటర్ ఉందా అంటాడు సీఐ. ప్లీజ్ అంకుల్ మేము అంకుల్ని చూసి పదినిమిషాల్లో వెళ్లిపోతాము అని పిల్లలు బ్రతిమిలాడుతారు. చూడండి సార్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇక్కడ అతనికి ఎదురు చెప్పే వారు లేరు. కానీ, అతను భార్య ని పోగొట్టుకున్న బాధితునిలా వచ్చారు. ఒక మెట్టు దిగాడని మీరు ఇంకా అణగదొక్కాలని చూడకండి. మీకు మీ ఉద్యోగానికి అంత మంచిది కాదు అని రాథోడ్ అంటాడు.

బాగా ఆలోచించిన సీఐ 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు అని కండిషన్ పెడతాడు. అంకుల్ మా అమ్మని ఎందుకు చంపారు అని అంజలి అడుగుతుంది. మా అమ్మ వల్ల మీరేమైనా నష్టపోయారా. మా అమ్మకి నీకు ఏదైనా గొడవ ఉందా. ఎందుకు అంకుల్ మా అమ్మని మాకు దూరం చేశారు అంటుంది అమృత. అంకుల్ నేను ఎప్పుడు ఏడ్చిన మా అమ్మ నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని ఓదార్చేది. ఇప్పుడు నేను రోజు ఏడుస్తున్నాను మా అమ్మ మాత్రం రావట్లేదు. మీకు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారంట కదా మా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ నీకు ఇస్తున్నాం అని నలుగురి దగ్గర ఉన్న డబ్బులు తీసి అతని దగ్గర పెడతారు.

బయటపెడతాడా?

అరుంధతి హత్య వెనుక ఉన్నది ఎవరో హంతకుడు బయటపెడతాడా? మనోహరి కుట్ర బయటపడనుందా? అనే విషయాలు తెలియాలంటే మార్చి 16న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం