తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns February 26th Episode: అమర్​ ప్రేమలో మిస్సమ్మ​​​! బెడిసికొట్టిన మనోహరి ప్లాన్​

NNS February 26th Episode: అమర్​ ప్రేమలో మిస్సమ్మ​​​! బెడిసికొట్టిన మనోహరి ప్లాన్​

Sanjiv Kumar HT Telugu

26 February 2024, 12:50 IST

google News
  • Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 26వ తేది ఎపిసోడ్‌లో మనోహరి ప్లాన్ బెడిసికొడుతుంది. అన్నం లేకుండా భాగమతిని పస్తులు ఉంచుదామనుకున్న మనోహరికి షాక్ తగులుతుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 26వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 26వ తేది ఎపిసోడ్‌

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 26వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam 26th February Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 26th February Episode) భాగమతికి అమర్​ తల్లి బహుమతిగా ఇచ్చిన ఆభరణాన్ని దొంగిలించడానికి వచ్చిన నీలను భయపెడుతుంది అరుంధతి. దాంతో పరిగెత్తుకుంటూ వెళ్లి మనోహరికి విషయం చెబుతుంది నీల. అక్క చెల్లెలు ఒకే దగ్గర చేరారు అన్నమాట అంటుంది మనోహరి. ఈ పెళ్లితో భాగిని వాళ్ల ఇంటికి పంపిస్తా.. అరుంధతిని ఘోరకి పట్టిస్తా.. ఇద్దరి పీడా ఒకేసారి విరగడైపోతుంది అంటుంది మనోహరి.

దొంగతనం ఎవరు చేస్తారు

నీలను పంపించి భాగమతి నగలకు కాపలాగా ఉన్న అరుంధతిని చూసి.. అక్క మీరెప్పుడొచ్చారు అని అడుగుతుంది భాగమతి. నేను ఇందాకే వచ్చాను మిస్సమ్మ, కానీ నగలు ఏంటి ఇలా బయటపెట్టి నువ్వు వాష్ రూమ్‌లోకి వెళ్తే కనీసం డోరైన వేసుకోవాలి కదా అంటుంది అరుంధతి. ఇంట్లోకి ఎవరు వచ్చి దొంగతనం చేస్తారు అక్క అంటుంది భాగమతి. నాలాంటి వాళ్లు వచ్చి కొట్టేస్తే ఎవరిని అడుగుతావు. అందుకే జాగ్రత్తగా నగలు దాచి పెట్టుకో ఇంకెప్పుడు ఇలా బయట పెట్టకు అంటుంది అరుంధతి.

సరే అక్క నువ్వు చెప్పావు కదా ఇక మీదట నుంచి జాగ్రత్తగానే ఉంచుకుంటాను అంటుంది భాగీ. మిస్సమ్మ నువ్వు ఆర్జీ భాగీగా వర్క్ చేశావు కదా అని అడుగుతుంది అరుంధతి. నీకెలా తెలుసు అక్క అని అడిగిన భాగీతో.. నువ్వు అవార్డు తీసుకునేటప్పుడు టీవీలో వచ్చింది కదా అప్పుడు చూశాను. ఒకసారి అలా మళ్లీ మాట్లాడవా అని అంటుంది అరుంధతి. భాగమతి మాట్లాడగానే ఎంత బాగా మాట్లాడవు మిస్సమ్మ ఎంత బాగుందో నీ వాయిస్ అని మురిసిపోతుంది అరుంధతి.

నీరసంగా రుబ్బుతున్నావ్

అక్క నీ వాయిస్ వింటుంటే మనం ఎప్పుడైనా ఫోన్‌లో మాట్లాడుకున్నామా. నాకు అలాగే అనిపిస్తుంది అంటుంది భాగమతి. రోజు నీతో మాట్లాడుతున్నాను కదా అలా అనిపించిందేమో. పద కింద గోరింటాకు రుబ్బుతున్నారు అంటుంది అరుంధతి. రాథోడ్ నీరసపడుతూ గోరింటాకు రుబ్బుతూ ఉంటాడు. రాథోడ్.. ఏంటయ్యా ఇంత నీరసంగా రుబ్బుతున్నావ్. గోరింటాకే రుబ్బ లేని వాడివి ఇక దేశాన్ని ఏం కాపాడుతావయ్యా అని నిర్మల అంటుంది.

గోరింటాకు రుబ్బడానికి దేశాన్ని కాపాడడానికి ఏమైనా సంబంధం ఉందా అమ్మ అంటాడు రాథోడ్. తన వల్ల కాదు కానీ నన్ను రుబ్బా మంటావా అని శివరామ్ అంటాడు. మీరు పది నిమిషాలు రుబ్బి 10 రోజులు మంచాన పడతారు అవసరం అంటారా. మీరు గమ్మున ఉండండి. నా కొడుకు ఒక పట్టు పడతాడు అంటుంది నిర్మల. ఏంటమ్మా గారు సార్ పొజిషన్ ఏంటి మీరు మాట్లాడుతున్న మాట ఏంటి. సార్ గోరింటాకు రుబ్బడమేంటి అంటాడు రాథోడ్. అయ్యో రాథోడ్ మా అమ్మ కోసం మా డాడీ గోరింటాకు రుబ్బేవాడు అని అంటుంది అమృత.

నాయనమ్మతో గోరింటాకు

అమరేంద్ర వచ్చి రుబ్బు నాన్న అంటుంది నిర్మల. డాడీ మమ్మీ కోసం నువ్వు గోరింటాకు రుబ్బే వాడివి అంటే వీళ్లు నమ్మట్లేదు వచ్చి రుబ్బండి అంటుంది అంజలి. అమర్​ గోరింటాకు రుబ్బుతూ అరుంధతితో కలిసి ఉన్న రోజులు గుర్తుకు తెచ్చుకుంటాడు. డాడీ.. నువ్వే మాకు గోరింటాకు పెట్టాలి అని అడుగుతుంది అమృత. నాయనమ్మతో పెట్టించుకోండమ్మా అంటాడు అమర్​. ప్లీజ్ డాడీ మా కోసం పెట్టవా అని పిల్లలు బ్రతిమిలాడుతారు. సరే అని అమర్​ పిల్లలకు గోరింటాకు పెడుతూ ఉంటాడు.

అమర్‌తో ఎలాగైనా గోరింటాకు పెట్టించుకోవాలనుకున్న మనోహరి అమర్ నాక్కూడా పెట్టవా అని అడుగుతుంది. పిల్లలకు పెట్టేసరికి లేట్ అవుతుంది మనోహరి నువ్వు అమ్మతో పెట్టించుకో అని అమరేంద్ర అంటాడు. పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను అంటుంది మనోహరి. నేను ఖాళీగానే ఉన్నాను కదా మనోహరి రా గోరింటాకు పెడతాను అని నిర్మల మనోహరి కి గోరింటాకు పెడుతుంది. అమర్‌తో పెట్టించుకుందామంటే ఈ ముసల్దొక్కటి అని మనోహరి గునుక్కుంటుంది.

భాగీకి అమర్ గోరింటాకు

అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు. కానీ ముఖ్యమైన పర్సన్ మిస్సమ్మ పెట్టుకోలేదేంటి అంటాడు శివరామ్. మనోహరికి పెట్టడం అయిపోయిన తర్వాత నేను పెడతానండి అని నిర్మల అంటుంది. డాడీ మిస్సమ్మకు కూడా నువ్వు పెట్టవా అని అంజలి అంటుంది. వద్దులే అమ్మ నాయనమ్మ పెడుతుంది అని అమరేంద్ర అంటాడు. ప్లీజ్ డాడ్ పెట్టండి అని పిల్లలు రిక్వెస్ట్ చేయడంతో అమరేంద్ర సరే పెడతాను అని భాగమతి దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. సరే పర్వాలేదులే ఏం చేస్తాం తనకు ఎవరూ లేరు కదా అని అరుంధతి అనుకుంటుంది.

అమరేంద్ర చెయ్యి చాపుతాడు భాగమతి తన చేతిలో చేయి పెడుతుంది. అమరేంద్ర తన వంక చూడకుండా చెయ్ పట్టుకొని గోరింటాకు పెడతాడు. భాగమతి మాత్రం అమరేంద్రని చూస్తూ ఉంటుంది. అమరేంద్ర గోరింటాకు భాగమతికి పెడతాడు. కట్ చేస్తే, ఇదేంటమ్మా గోరింటాకు పెట్టుకొని 10 నిమిషాలు కూడా ఉంచుకోలేదు ఎలా పండుతుంది అని నీలా అంటుంది. అమర్‌తో పెట్టించుకోవాలని నేను ఆశపడితే మధ్యలో ముసలి వచ్చి అంత ప్లాన్ పాడు చేసింది అని మనోహరి అంటుంది. కానీ అమరేంద్రయ్య మిస్సమ్మకి గోరింటాకు బాగా పెట్టాడమ్మా అని నీలా అంటుంది.

పండకపోతే ఫీల్ అవుతాడు

ఈ ఒక్కరోజే కదే పెళ్లి అయిపోయిన తర్వాత అమర్ దగ్గరికి రానివ్వను అని మనోహరి అంటుంది. అంజలి మాత్రం పెళ్లికి రాకూడదు అని మనోహరి అంటుంది. మా మిస్సమ్మ అని నెత్తిన పెట్టుకుంటారు కదమ్మా రాకుండా ఎలా ఉంటారు అంటుంది నీల. ఎలాగైనా సరే అంజలిని ఇంట్లోనే ఉంచాలి అని మనోహరి అంటుంది. ఆకలి వేస్తుంది ఎలా చేతులు కడుక్కుందామా అని భాగమతి ఆలోచించి వద్దులే ఆయన అంత కష్టపడి పెట్టాడు పండకపోతే ఫీల్ అవుతాడు అని ఊరుకుంటుంది.

ఆకలి వేస్తుంది నిద్ర పట్టదు. నీలా సహాయం తీసుకుందామని భాగమతి బయటికి వచ్చి అటు ఇటు చూస్తూ ఉండగా మనోహరి చూసి ఏంటి మిస్సమ్మ బయటకు వచ్చావు అని అడుగుతుంది. నేనింకా అన్నం తినలేదండి నీలాని పిలుద్దాము అనుకుంటున్నాను అని భాగమతి అంటుంది. నువ్వు వెళ్లు మిస్సమ్మ నేను నీలాకు చెప్పి పంపిస్తాను. బయట ఉంటే గోరింటాకు దేనికైనా తగిలిపోతుంది అని మనోహరి అంటుంది. భాగమతి లోపలికి వెళ్లి కూర్చుంటుంది.

ఎవరు గడియ పెట్టారు

భాగమతిని లోపల ఉంచి మనోహరి డోర్ పెట్టి నా అమర్‌తో గోరింటాకు పెట్టించుకుంటావా. ఈ నైటు అన్నం లేకుండా పస్తులు ఉండవే అని వెళ్లిపోతుంది. ఇంకా నీలా రావట్లేదు ఏంటి అని భాగమతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అమరేంద్ర వచ్చి మిస్సమ్మ గదిలో లైట్ వేసింది. కానీ డోర్ పెట్టి ఉందేంటీ అని డోర్ కొట్టి మిస్సమ్మ ఏంటి బయట గడియ పెట్టారు ఎవరు అని అమరేంద్ర అంటాడు. ఎవరు పెట్టారో తెలియదండి అని భాగమతి అంటుంది.

డోర్ తీసి అమరేంద్ర అంతా ఓకేనా అని అడుగుతాడు. అంతా ఓకే నండి అని భాగమతి అంటుంది. అమర్​, భాగీ.. ఒకరిపై ఒకరి ఇష్టాన్ని ప్రేమగా గుర్తిస్తారా? కాళీనే హంతకుడు అనే విషయం బయటపడుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 27న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

తదుపరి వ్యాసం