NNS February 24th Episode: భాగీని ముద్దుపెట్టుకోబోయిన అమర్.. మనోహరి కొత్త ప్లాన్.. వణికిపోయిన నీల
24 February 2024, 13:44 IST
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 24వ తేది ఎపిసోడ్‌లో పెళ్లి కూతురిలా ముస్తాబైన భాగమతిని చూసి అమరేంద్ర ఆశ్చర్యపోతాడు. తన భార్య అరుంధతిలా భావించి ముద్దు పెట్టుకోబోతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 24వ తేది ఎపిసోడ్
Nindu Noorella Saavasam 24th February Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 24th February Episode) భాగమతిని పెళ్లికూతురిని చేస్తూ తన కోడలు అరుంధతి నగల్ని అలంకరిస్తుంది నిర్మల. అది చూసిన మనోహరి కోపంతో రగిలిపోతుంది. మను ఎందుకే ఇంత కోపంగా ఉన్నావ్ అంటుంది అరుంధతి. అసలేం ఏమనుకుంటున్నారే వీళ్లంతా. ఆ నగా అమర్‌ని పెళ్లి చేసుకుంటే నాదే కదా మరి. నా నగ భాగీకి ఎందుకు ఇస్తారు. నువ్వేం చేస్తావో తెలియదు. నీలా మాయ చేస్తావో మంత్రం వేస్తావో ఆ నగ మాత్రం కొట్టేయాలి అంటుంది మనోహరి.
ఇలాంటి పనులు ఎందుకు
అమ్మగారు నగ కొట్టేస్తే దొరికిపోతానేమో అంటున్న నీలతో.. ఏదైనా అయితే నేను చూసుకుంటానే నువ్వు మాత్రం ఆ నగా కొట్టేయ్ భాగీ మెడలో ఆ నగ ఉండడానికి వీల్లేదు అంటుంది మనోహరి. ఏం ఆలోచిస్తున్నావే? ఆ నగను కొట్టేస్తే అలాంటి నగ నీకు ఒకటి ఇస్తాను అంటుంది మనోహరి. ఏ మను నీకు పిచ్చి పట్టిందానే ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావ్ అంటుంది అరుంధతి. సరే అమ్మగారు మిమ్మల్ని నమ్ముకొని ఈ దొంగతనానికి ఒప్పుకుంటున్నాను. ఏదన్నా తేడా జరిగితే మాత్రం మీరే కాపాడాలి అంటుంది నీల.
నగ కాపాడుకోమని మిస్సమ్మకు చెప్పాలి అని అరుంధతి వెళుతుంది. ఆ నగను కొట్టేసి నేనే ఉంచుకోవాలి అని నీల అనుకుంటుంది. అరుంధతి లోపలికి వస్తుంది. ఏంటక్కా చాన్నాళ్లకు కనిపించావు అంటుంది భాగమతి. నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్లిపోతే ఎలా వచ్చి మాట్లాడుతాను అంటుంది అరుంధతి. నాన్న ఆరోగ్యం బాగోలేదు అక్క అందుకే చెప్పకుండా వెళ్లాల్సి వచ్చింది అంటుంది భాగమతి. సరే భాగీ మీ నాన్నకి ఒంట్లో బాగోలేదు అన్నావు కదా ఎలా ఉన్నారు అని అడుగుతుంది అరుంధతి.
ఉరుములు మెరుపులు
బాగానే ఉన్నారు అంటూ ముఖం దిగాలుగా పెట్టిన భాగీతో.. ఏంటి పెళ్లి జరుగుతుంటే సంతోషంగా ఉండాలి. కానీ నీ కళ్లల్లో బాధ కనిపిస్తుంది అంటుంది అరుంధతి. ఈ పెళ్లి నాన్న కోసం చేసుకుంటున్నాను అక్క. నా మనస్ఫూర్తిగా చేసుకోవట్లేదు అని చెబుతుంది అరుంధతి. ఈ పెళ్లి మీ మామయ్య మంగళ కలిసి చేస్తున్నారని అరుంధతి చెప్పబోతూ ఉండగా ఉరుములు మెరుపులు వచ్చి మాటలు వినపడకుండా అవుతాయి. ఏంటి అక్క మా మామయ్య అంటున్నావ్ అని భాగమతి అంటుంది.
మీ మామయ్య మీ పిన్ని బాగున్నారా అని అడుగుతున్నాను భాగి అని అరుంధతి అంటుండగా.. ఇంతలో పిల్లలు వచ్చి భాగమతిని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి పిల్లలు అలా చూస్తున్నారు అని భాగమతి అంటుంది. ఆ నగ వేసుకుంటే అచ్చం నువ్వు మా అమ్మలాగే ఉన్నావు మిస్సమ్మ. మా అమ్మ కూడా ఎప్పుడూ ఇలాగే అందంగా రెడీ అయ్యి ఇంట్లో గలగల మాట్లాడుతూ తిరుగుతూ ఉండేది అంటుంది అమృత. ఏ ఫంక్షన్ జరిగినా మా అమ్మ ఇలాగే నగలు వేసుకునేది మిస్సమ్మ అంటాడు ఆనంద్.
వాష్ రూమ్ ఎక్కడ
మిస్సమ్మ నిన్ను నాయనమ్మ కిందికి రమ్మంటుంది అంటాడు ఆకాష్. సరే వస్తున్నాను పదండి అంటూ.. పద అక్క అంటుంది భాగమతి. ఇక్కడ ఎవరున్నారు మిస్సమ్మ అని పిల్లలు అంటారు. అక్క ఉంది అంటున్న భాగమతితో.. ఇక్కడ ఎవరూ లేరే అని పిల్లలు ఆశ్చర్యపోయి అంతా చూస్తూ ఉంటారు. ఇంతలో అరుంధతి మిస్సమ్మ వాష్ రూమ్ ఎక్కడ అని అడుగుతుంది. వాష్ రూమ్ అక్కడుంది అక్క అని భాగమతి చెప్పడంతో ఓ వాష్ రూమ్‌లో ఉందా అంటూ పిల్లలు వెళ్లిపోతారు.
మిస్సమ్మ నువ్వు పద నేను వస్తాను అని అరుంధతి బాత్రూంలోకి వెళుతుంది. భాగమతి పిల్లలతో కలిసి కిందికి వస్తుంది. పెళ్లికూతురు గెటప్‌లో భాగమతిని చూసి ఆశ్చర్యపోయి తనని చూస్తూ నిలబడతాడు అమర్. భాగమతి వచ్చి అమర్ ఎదురుగా నిలబడుతుంది. ఒక్క నిమిషం పాటు అరుంధతి అనుకొని తన మొహం పట్టుకొని నిమురుతూ ముద్దు పెట్టబోతాడు అమర్. అక్కడ ఉన్న వాళ్లందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఏమండీ ఆ చీరలో ఉన్నది నేనే అనుకుంటున్నారు అని అరుంధతి అంటుంది.
అమర్ టెన్షన్
అది చూసిన మనోహరి గబగబా పరిగెత్తుకొచ్చి అమర్ ఏం చేస్తున్నావ్ అని తనని పక్కకు నెట్టుతుంది. సారీ మిస్సమ్మ ఐ యాం సారీ అంటూ అమరేంద్ర వెళ్తాడు. పర్వాలేదండి అని భాగమతి అంటుంది. ఏం చేస్తున్నారు అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అని నిర్మల అంటుంది. భాగమతికి ముత్తైదువులు పసుపు రాసి ఆశీర్వదిస్తారు. అక్కడ తనను చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు అమరేంద్ర. కట్ చేస్తే,రాథోడ్ గోరింటాకు ఎందుకు తెచ్చావు. కోన్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని మనోహరి అంటుంది.
పెద్దమ్మ గారే తీసుకురమ్మన్నారు అమ్మ అని రాథోడ్ అంటాడు. మంచినీళ్లు కావాలంటే ఎవరైనా నల్ల నుంచి పట్టుకుంటారు. కానీ బావి తవ్వాలనుకోరు. ఈ రోజుల్లో గోరింటాకు ఎవరు పెట్టుకుంటున్నారు రాథోడ్ అని మనోహరి అంటుంది. ఇంతలో నిర్మల వచ్చి రాథోడ్ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి గోరింటాకు నూరాలి కదా అని అంటుంది. ఆంటీ కోన్ తెచ్చుకుంటే సరిపోయే దానికి గోరింటాకు ఎందుకు అని మనోహరి అంటుంది. మీ కాలంలో కోన్ పెట్టుకుంటున్నారు. కానీ మా కాలంలో గోరింటాకు నూరుకొని పెట్టుకునే వాళ్లం అమ్మ అదే మంచిది రండి. మీరు కూడా నూరుదురు అని నిర్మల వెళుతుంది.
నగ తీసుకురా
నీలా ఇంట్లో ఎవరూ లేరు అందరూ బయట ఉన్నారు. నగ కొట్టేసేయ్ అని మనోహరి చెబుతుంది. ఇంట్లో అందరూ ఉన్నారు కదా అమ్మ అని నీలా అంటుంది. అందరూ ఉన్నారు కాబట్టే నగ ఎవరు కొట్టేశారో ఎవ్వరూ కనిపెట్టలేరు వెళ్లు అని మనోహరి అంటుంది. మిస్సమ్మ తన గదిలోనే ఉంది కదా అమ్మా అని నీలా అంటుంది. అది ఇప్పుడే వాష్ రూమ్ కి వెళ్లింది. నువ్వు వెళ్లి నగ తీసుకురా అని మనోహరి చెబుతుంది.
కట్ చేస్తే, నీలా భాగమతి రూములో కెళ్లి నగ తీద్దామని చూస్తూ ఉంటుంది. నీలా భాగీ రూమ్ లోకి నువ్వెందుకే వచ్చావ్ ఏం చూస్తున్నావ్? నగ కొట్టేయాలి అనుకుంటున్నావా వద్దే పాపం అందరూ తనను తిడతారు. పెళ్లికూతురు అవుతుంది. తనని తిట్టియోదే అని అరుంధతి అంటుంది. నీలా భయపడుతూ నగని ముట్టుకోపోయేసరికి అరుంధతి కోపంతో నగముట్టుకో వదన్నాను కదా అని గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దానికి భయపడి పోయిన నీలా గబగబా కిందికి పరిగెడుతుంది.
మండిపడిన మనోహరి
ఏంటే నీలా నగ తెచ్చావా అని మనోహరి అడుగుతుంది. ఆ గదిలో అమ్మగారు ఉన్నారమ్మ అని నీలా అంటుంది. బాగి వాష్ రూమ్ కి వెళ్లిందని చెప్పాను కదా అని మనోహరి అంటుంది. ఆ గదిలో అరుంధతి అమ్మగారు ఉన్నారు అమ్మ అని భయపడుతూ చెబుతుంది నీలా. ఆ మాట వినగానే భయంతో కుప్పకూలిపోతుంది మనోహరి. మెహందీ ఫంక్షన్‌లో భాగమతికి గోరింటాకు పెడతాడు అమర్. అది చూసి కోపంతో మండిపడుతుంది మనోహరి.
అనంతరం చేతికి గోరింటాకు పెట్టుకున్న భాగమతికి స్వయంగా భోజనం తినిపిస్తాడు అమర్. భాగమతి, అమర్ మధ్య బంధం ముడిపడనుందా? మంగళ, మనోహరి ఏం చేయబోతున్నారు? అనే విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 26న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్