NNS February 19th Episode: పెళ్లి కూతురిగా అమర్​ ఇంట్లో మిస్సమ్మ.. కోమాలో సరస్వతి.. అంజలికి భయపడుతున్న మనోహరి-nindu noorella saavasam february 19th episode bhagamathi as bride at amar home nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns February 19th Episode: పెళ్లి కూతురిగా అమర్​ ఇంట్లో మిస్సమ్మ.. కోమాలో సరస్వతి.. అంజలికి భయపడుతున్న మనోహరి

NNS February 19th Episode: పెళ్లి కూతురిగా అమర్​ ఇంట్లో మిస్సమ్మ.. కోమాలో సరస్వతి.. అంజలికి భయపడుతున్న మనోహరి

Sanjiv Kumar HT Telugu
Feb 19, 2024 12:50 PM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్‌లో సరస్వతి టీచర్‌కు కాళీతో మనోహరి యాక్సిడెంట్ చేయించడంతో ఆమె కోమాలోకి వెళ్తుంది. సరస్వతి టీచర్‌కు శత్రువులు ఎవరుంటారు అని అమర్ ఆరా తీస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam 19th February Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 19th February Episode) అమర్​తో నిజం చెప్పాలనుకున్న సరస్వతి టీచర్​ని కాళీతో యాక్సిడెంట్ చేయిస్తుంది మనోహరి. ఆ యాక్సిడెంట్​ని కళ్లారా చూసిన అంజలి షాక్​తో కిందపడిపోతుంది. అంజలి పడిపోవడం చూసిన అమర్​ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. సరస్వతి మేడంకి యాక్సిడెంట్​ జరిగిందని తెలుసుకుని హాస్పిటల్లో చేర్పిస్తాడు.

కోమాలోకి సరస్వతి

అంజలిని చూసిన డాక్టర్ తనకేమీ కాలేదని యాక్సిడెంట్ చూసి షాక్ అయింది. అందుకే స్పృహ కోల్పోయింది అని చెబుతాడు. ఇంతలో రాథోడ్ వస్తాడు. అంజలికి మెలకువ వస్తే కాళీ గురించి చెబుతుంది. అమర్ నన్ను వెతుక్కుంటూ వస్తాడు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి. రాథోడ్‌ని మేడంకి ఎలా ఉంది అని అడుగుతాడు అమర్​. కోమాలోకి వెళ్లింది సార్. వాళ్ల వాళ్లు వచ్చారు. నేను వచ్చేసాను అని రాథోడ్ చెబుతాడు. అంటే ఇక ఎప్పటికీ కోమా నుంచి బయటికి రాదా అని కంగారుగా అడుగుతుంది మనోహరి.

అందరూ షాకవుతారు. అంటే చిన్నప్పటినుంచి మమ్మల్ని చూసుకుంది కదా అందుకే తనకేమైనా అవుతుందేమో అని అలా అడిగాను అంటుంది మనోహరి. సార్ పోలీసులు ఎంక్వయిరీ చేస్తే అటెంప్ట్​ మడ్డరని తేలిందంట అని రాథోడ్ చెబుతాడు. తనని ప్లాన్ చేసి చంపాల్సిన అవసరం ఎవరుకుంటుంది అని అమరేంద్ర అంటాడు. ఏ మను.. నువ్వేనా మేడానికి ఈ ఘోరాన్ని తలపెట్టింది. మేడమ్‌కి ఏమైనా చేసావని నాకు తెలిస్తే జీవితంలో నిన్ను క్షమించను అని అరుంధతి అంటుంది.

శత్రుత్వం ఉందా

ఏవండీ మనూని అడగండి. మను మేడాన్ని ఎందుకో బెదిరించింది తనే ఈ పని చేసి ఉంటుంది అని అనుకుంటుంది అరుంధతి. మనోహరి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు అమర్. దేని గురించి అమర్ అంటుంది మనోహరి. మీ మేడాన్ని చిన్నప్పటినుంచి చూసావు కదా తనకి ఎవరైనా హాని చేసి అంత శత్రుత్వం ఉందేమో అని అమరేంద్ర అంటాడు. నాకు తెలియదు అమర్. మేడంని మొన్న చూసిందాకా తన గురించి నాకు తెలియదు అంటుంది మనోహరి. ఇప్పుడేం చేద్దాం రా అని నిర్మల అంటుంది.

నేను మిస్సమ్మని ఇంటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నానమ్మా అంటాడు అమర్​. అదేంటీ అమర్ మిస్సమ్మని ఇప్పుడు తీసుకురావడం ఎందుకు. అసలే పెళ్లి జరుగుతుంది కదా అంటుంది మనోహరి. తన పెళ్లి గురించే తీసుకు వస్తున్నాను మనోహరి. పెళ్లి కూతురిగా మండపానికి మన ఇంటి నుంచే వెళ్లాలి అంటాడు అమర్​. అది కాదు అమర్ అని మనోహరి అంటూ ఉండగా నువ్వు ఆగు మనోహరి మంచి నిర్ణయం తీసుకున్నావురా అమర్ అంటాడు శివరామ్​.

జాలిపడి చేయట్లేదు

మిస్సమ్మ చేసిందానికి పెళ్లి చేసి పంపించాలి అంటుంది నిర్మల. అమ్మ మీరు వెళ్లి మిస్సమ్మని తీసుకురండి అంటాడు అమర్​. వాళ్లు వెళ్తూ ఉండగా ఆంటీ నేను కూడా వస్తాను అని మనోహరి వెళ్తుంది. కట్ చేస్తే, మిస్సమ్మని మా ఇంటికి తీసుకువెళ్లి పెళ్లి అయ్యేదాకా మా ఇంట్లో నుంచే పంపించాలి అనుకుంటున్నాం అని శివరామ్ అంటాడు. ఇది జాలిపడి చేయట్లేదమ్మా మా బాధ్యత అని నిర్మల అంటుంది. నేను చెప్పాను కదా ఆంటీ వాళ్లు ఒప్పుకోరు వెళ్దాం పదండి అని మనోహరి అంటుంది.

వద్దని చెప్పు అని మనోహరి సైగ చేస్తుంది మంగళకి. చాలా సంతోషమండి. అలాగే తీసుకువెళ్లండి అని మంగళ అంటుంది. క్షమించండి అంకుల్ నేను మా నాన్నని వదిలి పెట్టి రాలేను. కూతురుగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటుంది భాగీ. ఇంట్లోనే ఉంటే రామ్మూర్తి తన కూతురికి నిజం చెప్పేస్తాడనే భయంతో నచ్చజెప్పి వాళ్లతో పంపిస్తుంది మంగళ. తాను ప్లాన్​ చేసి బయటకి పంపిస్తే మళ్లీ భాగీని ఆ ఇంటికి పంపిస్తున్నందుకు మంగళపై కోప్పడుతుంది మనోహరి.

కావాలనే చేశారు

ఇంటికి వచ్చిన భాగీకి గ్రాండ్​గా వెల్​కమ్ చెబుతారు పిల్లలు. అది చూసి ఎమోషనల్​ అవుతుంది భాగమతి. అందరూ కలిసి అంజలిని చూడటానికి తన రూమ్​కి వెళతారు. స్పృహలో లేని అంజలిని చూసి బాధపడుతుంది మిస్సమ్మ. అంజలికి ఎక్కడ స్పృహ వస్తుందోనని భయంతో అందరినీ అక్కడనుంచి పంపించాలనుకుంటుంది మనోహరి. అప్పుడే అంజలి మిస్సమ్మ చెయ్యి పట్టుకుని కళ్లు తెరుస్తుంది. తాను ఆ యాక్సిడెంట్​ చూశానని, నిజానికి అది యాక్సిడెంట్​ కాదని, కావాలనే చేశారని చెబుతుంది.

అయితే ఆ యాక్సిడెంట్​ చేసిన వ్యక్తి ఎవరని అడుగుతాడు అమర్. తనకు తెలిసిన అంకులే ఆ యాక్సిడెంట్ చేశాడని చెబుతుంది అంజలి. కంగారుపడిన మనోహరి అంజలికి రెస్ట్​ అవసరమని చెప్పి అందరినీ అక్కడనుంచి పంపిస్తుంది. కాళీతో మిస్సమ్మ పెళ్లి జరుగుతుందా? అమర్​, భాగీ దగ్గర కాకుండా మనోహరి ఏం ప్లాన్ వేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 20న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాకి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner