NNS February 10th Episode: మిస్సమ్మను కిడ్నాప్ చేయించిన మనోహరి.. కనిపెట్టిన అరుంధతి.. మోసపోయిన అమర్-nindu noorella saavasam february 10th episode manohari kidnap bhagamathi and arundhathi saw bhagamathi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns February 10th Episode: మిస్సమ్మను కిడ్నాప్ చేయించిన మనోహరి.. కనిపెట్టిన అరుంధతి.. మోసపోయిన అమర్

NNS February 10th Episode: మిస్సమ్మను కిడ్నాప్ చేయించిన మనోహరి.. కనిపెట్టిన అరుంధతి.. మోసపోయిన అమర్

Sanjiv Kumar HT Telugu
Feb 10, 2024 11:35 AM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 10వ తేది ఎపిసోడ్‌లో అవార్డ్ ఫంక్షన్‌కు వెళ్లకుండా మిస్సమ్మను కిడ్నాప్ చేయిస్తుంది మనోహరి. కానీ, మిస్సమ్మ బైక్ చూసి అనుమానపడతాడు అమర్. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 10వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 10వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam 10th February Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 10th February Episode) అమర్ బాధలో ఉంటే ఇప్పుడు ఫంక్షన్ కి పిలుస్తావేంటి అని రాథోడ్ మీద కోప్పడుతుంది మనోహరి. ఎవడో వెధవ ఏదో అన్నాడని మనం బాధపడుతూ కూర్చుంటామా వాడి సంస్కారం అంతే అని వదిలేయడమే అని మనోహరితో చెప్పి కొడుకుని ఫంక్షన్‌కి బయలుదేరమంటాడు అమర్ తండ్రి. భాగీ ఎప్పుడైనా ఇంటికి రావచ్చు అని చెప్పు అని కొడుకుతో చెప్తాడు శివరామ్​. సరే అని బయలుదేరబోతున్న అమర్‌ని ఒక నిమిషం ఆగమంటుంది మనోహరి.

ఫోన్ తీసుకుని

ఏంటి నీ ప్రాబ్లం మనోహరి, అసలు ఎందుకు భాగిని చూడటానికి ఆయనని వెళ్లనివ్వడం లేదు అని అంటుంది అరుంధతి. మనోహరి పిలుపుతో ఆగిన అమర్‌తో నేను కూడా మీతో ఫంక్షన్‌కి వస్తాను అరుంధతికి అంతగా నచ్చిన అమ్మాయిని నేను చూస్తాను అంటుంది. అందుకు ఒప్పుకుంటాడు అమర్. ఒక్క నిమిషం ఫోన్ తీసుకుని వస్తాను అని చెప్పి తన రూమ్‌లోకి వెళ్లి ఎవరికో ఫోన్ చేసి తిరిగి వస్తుంది. కారులో కూర్చుంటూ తన పక్క సీట్ వైపు చూస్తుంది.

తననే తీక్షణంగా చూస్తున్నట్లు గమనించి పక్కన నేను ఉన్నట్లే చూస్తుందేమిటి అని అనుమాన పడుతుంది అరుంధతి. భాగిని చూడ్డానికి వెళుతున్నామంటే ఆనందంగా నువ్వు కూడా మాతోపాటు వస్తావని నాకు తెలుసు అని నవ్వుకుంటుంది మనోహరి. ఆ తర్వాత కారులో వెళ్తూ తన గదిలో జరిగిన దానిని తలుచుకుంటుంది. మీకు చాలా సేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అని జరిగిందంతా చెప్పి అందుకే భాగిని ఫంక్షన్‌కి పంపించాను అని చెప్తుంది మంగళ.

ఒకేసారి ఇచ్చేస్తాను

కోపంతో సరేలే వాళ్లిద్దరూ కలవకుండా ఏదో ఒకటి నేనే చేస్తాను అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. చాలాసేపు ఏం చేయాలో ఆలోచించిన తర్వాత అరుంధతిని చంపిన కిల్లర్‌కి ఫోన్ చేసి భాగిని కిడ్నాప్ చేయాలని చెప్తుంది మనోహరి. ముందు డబ్బు ఇవ్వలేదు ముందు అది సెటిల్ చేయండి అంటాడు హంతకుడు. ముందు ఈ పని చేసి పెట్టు అమౌంట్ మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాను అని చెప్పి మిస్సమ్మ వాళ్ల ఫోటోలు సెండ్ చేస్తుంది మనోహరి.

బైక్ బాగు చేస్తున్నట్లు నటిస్తున్న కాళీకి మంగళ ఫోన్ చేస్తుంది. కాళీ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని మాట్లాడుతుంది భాగి. నాన్నకి ఎలా ఉంది పిన్ని, ఇప్పుడే బయలుదేరుతున్నాము అని చెప్తుంది. రావద్దని చెప్పటానికే ఫోన్ చేశాను. మీ నాన్న ఇప్పుడు బాగానే ఉన్నారు. డాక్టర్లు ఆయనని ఆనందంగా ఉండేలా చూసుకోమని చెప్పారు. అందుకే నువ్వు అవార్డు తీసుకొని రా అని చెప్తుంది మంగళ. నాన్న పెళ్లి గురించి ఏదో చెప్పబోయారు అంటుంది భాగీ.

కత్తి చూసి పారిపోయిన కాళీ

నాకు చెప్పారమ్మ, పెళ్లి సమయానికి నా ఆరోగ్యం సహకరించకపోతే నువ్వే కాళ్లు కడిగి కన్యాదానం చేయాలని చెప్పారు. పెళ్లిలో ఏ లోటు రాకూడదని చెప్పారు అని అబద్ధం చెప్తుంది మంగళ. అలా చెప్పారా అని బాధపడుతూ ఫోన్ కాళీకి ఇచ్చేస్తుంది. ఇద్దరు బైక్ మీద వెళుతుంటే కిడ్నాపర్లు అడ్డుకుంటారు. కాళీ వాళ్లని ఎదిరించాలనుకుంటాడు. కానీ వాళ్ల చేతిలో ఉన్న కత్తిని చూసి పారిపోతాడు. భాగి వాళ్ల నుంచి తప్పించుకోవటానికి పెనుగులాడుతుంది. అప్పుడే ఆమె గాజులు పగిలిపోతాయి.

అదే సమయంలో అటువైపుగా అమర్ వాళ్ల కారు వస్తుంది. సడన్‌గా అమర్ కారు ఆపమంటాడు. కారు ఆగిన తర్వాత కిందికి దిగి వస్తాడు. అక్కడ పగిలిపోయిన గాజులు, పడిపోయిన బండిని చూసి ఇక్కడ ఏదో జరిగింది చుట్టుపక్కల వెళ్లి వెతుకు అని రాథోడ్ కి చెప్తాడు. అప్పటికే భాగి నోరు నొక్కి పక్క గదిలోకి తీసుకొని పోతాడు కిడ్నాపర్. అది గమనించిన మనోహరి అమర్ చూసేస్తాడేమో అని కంగారు పడిపోతూ ఉంటుంది. అమర్ వాళ్లు కిందికి దిగి బండి దగ్గర చెక్ చేయటాన్ని కిల్లర్ చూస్తాడు.

మిస్సమ్మను చూసిన ఆరు

వాళ్లకి అనుమానం వచ్చినట్లుగా ఉంది. నువ్వు వెళ్లి మేనేజ్ చెయ్యు అని పక్కనున్న వాడికి చెప్తాడు. రూమ్ నుంచి బయటకు వచ్చిన వాడు నా బైక్ ఇలా పడిపోయింది ఏంటి అని పైకి లేపుతాడు. అమర్ గాజులు సంగతి ఏంటి అని అడిగితే మా ఆవిడవే పగిలిపోయినట్లుగా ఉన్నాయి అని అమర్ కి ఎలాంటి డౌటు రాకుండా మేనేజ్ చేస్తాడు. దాంతో రౌడీల చేతిలో మోసపోయిన అమర్ వాళ్లు అక్కడినుంచి వెళ్లిపోవడానికి కారు ఎక్కుతారు. సరిగ్గా అప్పుడే అరుంధతి కిటికీలోంచి మిస్సమ్మ కిడ్నాపర్ చేతిలో గించుకోవడం చూస్తుంది.

మిస్సమ్మ ప్రమాదంలో ఉందని తెలుసుకున్న అరుంధతి ఏం చేస్తుంది? రౌడీల నుంచి భాగీ ఎలా తప్పించుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 12న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner