తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott Free: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఫ్రీగా సినిమాలు చూసేయండి.. కానీ, అదొక్కటి భరించాల్సిందే!

Netflix OTT Free: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఫ్రీగా సినిమాలు చూసేయండి.. కానీ, అదొక్కటి భరించాల్సిందే!

Sanjiv Kumar HT Telugu

26 June 2024, 16:09 IST

google News
  • Netflix OTT Offering Content For Free: తన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని కంటెంట్‌ను ఫ్రీగా చూసేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఓటీటీలోని సినిమాలు, వెబ్ సిరీసులను ఉచితంగా వీక్షించే సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఫ్రీగా సినిమాలు చూసేయండి.. కానీ, అదొక్కటి భరించాల్సిందే!
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఫ్రీగా సినిమాలు చూసేయండి.. కానీ, అదొక్కటి భరించాల్సిందే!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఫ్రీగా సినిమాలు చూసేయండి.. కానీ, అదొక్కటి భరించాల్సిందే!

Netflix OTT Free Content Without Subscription: ఓటీటీ సంస్థల్లో దిగ్గజంగా రాణిస్తోంది నెట్‌ఫ్లిక్స్. విభిన్నమైన కంటెంట్‌తో ఎప్పటికప్పుడు సగటి ఓటీటీ ప్రేక్షకుడు మెచ్చేలా సినిమాలు, వెబ్ సిరీసులను అందుబాటులో ఉంచుతోంది నెట్‌ఫ్లిక్స్. మొదట్లో ఎక్కువగా హాలీవుడ్ సహా ఇతర భాషల కంటెంట్ వచ్చేది.

కరోనా లాక్‌డౌన్ తర్వాత భారతదేశ ప్రేక్షకులు కూడా తన కంటెంట్ చూసేలా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ విసృత పరుచుకుంది. ఇదిలా ఉంటే, తాజాగా నెట్‌ఫ్లిక్స్ తన వ్యాపార వ్యూహంలో గణనీయమైన మార్పును చేస్తోందని తెలుస్తోంది. ఇకనుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కంటెంట్‌ను వినియోగదారులు ఉచితంగా చూసే వెసులుబాటు తీసుకువచ్చేందుకు వ్యూహం రచిస్తోందని పలు వెబ్ సైట్స్ పేర్కొంటున్నాయి.

అయితే, ఈ ఫ్రీ కంటెంట్‌ ప్లాన్‌ను ప్రధానంగా యూరప్, ఆసియాలోని ప్రేక్షకులను టార్గెట్‌గా చేసుకుని తీసుకువస్తున్నట్లు సమాచారం. కానీ, ఈ నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ కంటెంట్ ప్లాన్ భారతదేశానికి వస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా అనుమానంగా ఉంది. దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ ఇంకా ఉచిత ప్లాన్‌ను ప్రవేశపెట్టలేదు.

కాకపోతే ఇండియాలో కూడా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను ఫ్రీగా చూసే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌కి యాక్సెస్ పొందడానికి వినియోగదారులు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకుండానే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోని సినిమాలు, వెబ్ సిరీసులను ఎంచక్కా వీక్షించవచ్చు.

అయితే, ఉచితంగా చూసే వారికి అడ్వర్టైజ్‌మెంట్ బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. ఫ్రీగా చూసేవారికి కనీసం 20 నిమిషాలు లేదా అరగంటకు ఓసారి వ్యాపార ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉందని, ఆ అడ్వర్టైజ్‌మెంట్స్‌తోనే ఉచితంగా వీక్షించవచ్చట. ప్రకటనల బారి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం కనీసం నెలవారి ప్లాన్ తీసుకోవాల్సిందేనని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఈ నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ కంటెంట్ అనేది ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌ను కెన్యాలో పరీక్షించారు. లిమిటెడ్ సెలెక్ట్ కంటెంట్‌ను కెన్యాలో నెట్‌ఫ్లిక్స్ అందించింది. కానీ, తర్వాత దాన్ని నిలిపివేసింది. త్వరలో ఇలాంటి తరహా ప్లాన్‌నే పరిమిత కంటెంట్‌తో జపాన్, జర్మనీ వంటి దేశాల్లో ప్రయోగించనుందని సమాచారం.

ప్రస్తుతం ఓటీటీ సంస్థలతో ఉన్న పోటీని ఎదుర్కునేందుకే నెట్‌ఫ్లిక్స్ ఈ సంచలన మార్పు చేస్తున్నట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్య కాలంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హెచ్‌బీవో మ్యాక్స్ వంటి ప్రత్యర్థుల నుంచి నెట్‌ఫ్లిక్స్ సవాళ్లు ఎదుర్కొంటోంది. వీటిని దాటి ముందుకు మరింత మెరుగ్గా సాగడానికే పాస్‌వర్డ్ షేరింగ్, మల్టిపుల్ సబ్‌స్క్రిప్షన్ పెంపు వంటి చర్యల్లో మార్పులు చేసింది.

2022లో వ్యాపార ప్రకటనల నుంచి లాభాన్ని అర్జిందేకు ఫ్రీ యాడ్ కోసం సబ్‌స్క్రిప్షన్ ధర పెంచింది. కానీ, దీనివల్ల ఒక్కసారిగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ తగ్గిపోయారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. ప్రకటనలు అందిస్తూ ఉచితంగా కంటెంట్ అందిస్తే.. ధర చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోలేని ఆడియెన్స్‌ను ఆకర్షించే అవకాశం ఉంది. సంస్థకు ప్రకటనల ద్వారా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది.

అయితే, ఈ ఉచిత ఎంపికను యూఎస్‌లో ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేయలేదని, దాని ప్రస్తుత మోడల్‌లు చివరి దశలో ఉన్నాయని వెల్లడించింది. కాగా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ నెలవారీగా రూ. 149తో అతి తక్కువ ధరలో మొబైల్ ప్లాన్ అందిస్తోంది. ప్రీమియం కోసం నెలకు రూ. 649 వెచ్చించాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం