తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hi Nanna Trp: ఓటీటీలో హిట్.. టీవీలో ఫట్.. నాని హాయ్ నాన్నకు దారుణమైన టీఆర్పీ.. ఎవరూ పట్టించుకోలేదు

Hi Nanna TRP: ఓటీటీలో హిట్.. టీవీలో ఫట్.. నాని హాయ్ నాన్నకు దారుణమైన టీఆర్పీ.. ఎవరూ పట్టించుకోలేదు

Hari Prasad S HT Telugu

02 April 2024, 7:44 IST

google News
    • Hi Nanna TRP: నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న మూవీకి టీవీల్లో దారుణమైన టీఆర్పీ వచ్చింది. ఓటీటీలో మంచి ఆదరణ లభించినా.. టీవీలో మాత్రం ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు.
ఓటీటీలో హిట్.. టీవీలో ఫట్.. నాని హాయ్ నాన్నకు దారుణమైన టీఆర్పీ.. ఎవరూ పట్టించుకోలేదు
ఓటీటీలో హిట్.. టీవీలో ఫట్.. నాని హాయ్ నాన్నకు దారుణమైన టీఆర్పీ.. ఎవరూ పట్టించుకోలేదు

ఓటీటీలో హిట్.. టీవీలో ఫట్.. నాని హాయ్ నాన్నకు దారుణమైన టీఆర్పీ.. ఎవరూ పట్టించుకోలేదు

Hi Nanna TRP: ఓటీటీల హవా పెరుగుతున్న క్రమంలో ఇక టీవీల పనైపోయినట్లేనా? ఈ ప్రశ్న చాలా రోజులుగా వినిపిస్తున్నా.. తాజాగా నాని మూవీ హాయ్ నాన్నకు వచ్చిన టీఆర్పీతో ఇది మరోసారి తెరపైకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో హిట్ అయిన ఈ మూవీని టీవీల్లో మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఈ మధ్యే జెమిని టీవీలో ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ వచ్చిన విషయం తెలిసిందే.

హాయ్ నాన్న టీఆర్పీ

నాని, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు థియేటర్లలోనూ పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ముఖ్యంగా దసరాలాంటి మాస్ మూవీ తర్వాత నాని మరోసారి ఓ క్లాస్ సినిమాతో రావడం, మూవీ అంతా చాలా స్లోగా సాగడంతో థియేటర్లలో నెగటివ్ రివ్యూలే వచ్చాయి. ఇప్పుడా ప్రభావం టీవీ ప్రీమియర్ పైనా పడినట్లుగా కనిపిస్తోంది.

మార్చి 17వ తేదీని జెమినీ టీవీలో ఈ మూవీ వచ్చింది. అంతకు చాలా రోజుల ముందే ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. అయినా హాయ్ నాన్న మూవీకి అర్బన్ ఏరియాల్లో 4.45 టీఆర్పీ, రూరల్ ఏరియాల్లో 4.06 టీఆర్పీ వచ్చింది. నాని లాంటి హీరో మూవీకి ఇలా చాలా చాలా తక్కువే అని చెప్పాలి. ఫ్యామిలీతో కలిసి చూడగలిగే సినిమాకు ఇంత దారుణమైన టీఆర్పీ అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో టాప్

ఓ పెద్ద హీరో సినిమాకు కనీసం రెండంకెలు దాటితేనే మంచి టీఆర్పీగా పరిగణిస్తారు. కానీ హాయ్ నాన్న దానిని చాలా దూరంలోనే ఆగిపోయింది. నిజానికి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చినప్పుడు మంచి రెస్పాన్సే వచ్చింది. చాలా వారాల పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ ట్రెండింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా హాయ్ పాపా పేరుతో హిందీలో డబ్ కాగా.. ఆ మూవీకి తెలుగు కంటే కూడా మంచి రెస్పాన్స్ రావడం విశేషం.

కానీ టీవీలో మాత్రం ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్స్ లో స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీలాంటి ఛానెల్స్ కు పోటీ ఇవ్వలేక కిందామీదా పడుతున్న జెమిని టీవీ ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నా ఫలితం లేకపోయింది.

హాయ్ నాన్న ఎలా ఉందంటే?

ఈ మూవీలో విరాజ్ పాత్ర‌లో నాని అద‌ర‌గొట్టాడు. కూతురి కోసం ఆరాట‌ప‌డే తండ్రిగా.. ప్రేమికుడిగా, డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో కూడిన పాత్ర‌లో చ‌క్క‌టి వేరియేష‌న్స్ చూపించాడు. వ‌ర్ష‌, య‌శ్న‌గా రెండు షేడ్స్‌తో సాగే పాత్ర‌లో మృణాల్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. సీతారామం త‌ర్వాత మ‌రోసారి త‌న యాక్టింగ్‌తో మెప్పించింది. శృతిహాస‌న్ ఓ పాట‌లో మాత్ర‌మే క‌నిపిస్తుంది. బేబీ కియారా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది.

అంగ‌డ్‌బేడీ, జ‌య‌రామ్ చిన్న పాత్ర‌లే అయినా త‌మ అనుభ‌వంతో మెప్పించారు.ఈ సినిమాకు హీష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ మ్యూజిక్ పెద్ద ఎసెట్‌గా నిలిచింది. ఆద్యంతం హాయ్ నాన్న క‌థ నెమ్మ‌దిగా సాగ‌డం కాస్త ఇబ్బందిక‌రంగా అనిపిస్తుంది. కానీ నాని, మృణాల్ ఠాకూర్ త‌మ కెమిస్ట్రీతో ఆ ఫీల్ క‌ల‌గ‌కుండా చేశారు. విరాజ్‌, వ‌ర్ష ల‌వ్ స్టోరీని డిఫ‌రెంట్‌గా రాసుకుంటే బాగుండేది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం