Nani33: దసరా కాంబినేషన్ రిపీట్.. అధికారికంగా ప్రకటించిన నాని .. మళ్లీ యాక్షన్ రూటే..-dasara combination repeats nani and srikanth odela movie announced officially nani 33 tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani33: దసరా కాంబినేషన్ రిపీట్.. అధికారికంగా ప్రకటించిన నాని .. మళ్లీ యాక్షన్ రూటే..

Nani33: దసరా కాంబినేషన్ రిపీట్.. అధికారికంగా ప్రకటించిన నాని .. మళ్లీ యాక్షన్ రూటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 30, 2024 07:19 PM IST

Nani 33: దసరా సినిమా కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు హీరో నాని. ఓ పోస్టర్ కూడా షేర్ చేశారు.

Nani33: దసరా కాంబినేషన్ రిపీట్.. అధికారికంగా ప్రకటించిన నాని .. మళ్లీ యాక్షన్ రూటే..
Nani33: దసరా కాంబినేషన్ రిపీట్.. అధికారికంగా ప్రకటించిన నాని .. మళ్లీ యాక్షన్ రూటే..

Nani 33: నేచురల్ స్టార్ నాని కెరీర్లో ‘దసరా’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రస్టిక్ మాస్ యాక్షన్ క్యారెక్టర్ చేశారు నాని. గతేడాది మార్చి 30వ తేదీన రిలీజైన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అయింది. యాక్షన్ అవతార్‌లో నాని యాక్టింగ్‍కు మరోసారి అందరూ ఫిదా అయ్యారు. నానికి తొలి రూ.100 కోట్ల కలెక్షన్ల మూవీగానూ దసరా నిలిచింది. అలాంటి సూపర్ హిట్ సినిమాకు నేటి (మార్చి 30, 2024)తో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా నాని సర్‌ప్రైజింగ్ ప్రకటన చేశారు. శ్రీకాంత్ ఓదెలతో సినిమాను అనౌన్స్ చేశారు. దీంతో దసరా కాంబో మళ్లీ రిపీట్ కానుంది.

శ్రీకాంత్ ఓదెలతో నాని మరో సినిమా చేస్తారని కొంతకాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రానికి స్క్రిప్ట్ పనుల్లో శ్రీకాంత్ బిజీగా ఉన్నారని తెలిసింది. అయితే, ఇప్పుడు ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమాను నేడు కన్ఫర్మ్ చేశారు నాని. ఓ పోస్టర్ కూడా షేర్ చేశారు.

యాక్షన్ థ్రిల్లరే!

నానికి 33వ చిత్రం కావడంతో దీని వర్కింగ్ టైటిల్ నాని33గా ఉంది. ఈ చిత్రం కూడా యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుంది. “విప్లవం ప్రారంభమయ్యే ముందు హింస సరైన రూపంలోకి మారుతుంది” అంటూ మూవీ టీమ్ ఈ సినిమాను ప్రకటించింది. త్వరలో రక్తపాతం కోసం సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ చిత్రంలోనూ యాక్షన్ భారీగా ఉండనుందని అర్థమవుతోంది.

నాయకుడిగా ఉండేందుకు గుర్తింపు అవసరం లేదంటూ Nani33 పోస్టర్‌పై ఉంది. అలాగే పోస్టర్ అంతా రక్తపు రంగులో ఉంది. నాని షర్ట్, కళ్లద్దాల్లో ప్రజలు ఉన్నట్టుగా పోస్టర్ ఉంది. దీంతో ఈ చిత్రంలో నాయకుడిగా నాని నటిస్తాడని తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో నాని నోట్లోని బీడీ నుంచి వచ్చే పొగ హైలైట్ అయి ఉంది. ఈ విషయం కూడా ఇంట్రెస్టింగ్‍గా ఉంది.

2025లో..

ఇక, నాని33 మూవీని ఎస్‍ఎల్‍వీ సినిమాస్ పతాకంపై సుధారర్ చెరుకూరి నిర్మించనున్నారు. దసరాను కూడా నిర్మించింది ఆ బ్యానరే. దీంతో Nani33తో దసరా త్రయం మళ్లీ వేచ్చేస్తోంది అంటూ మూవీ టీమ్ వెల్లడించింది. 2025లో ఈ చిత్రాన్ని రీలీజ్ చేయనున్నట్టు పేర్కొంది.

నాని లైనప్

నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. డిఫరెంట్ కాన్సెప్టుతో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం విడుదల కానుంది.

సుజీత్ దర్శకత్వంలోనూ నాని మరో మూవీ చేయనున్నారు. ఇది కూడా యాక్షన్ చిత్రంగా ఉండనుంది. బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో మరో మూవీ కూడా నాని లైనప్‍లో ఉంది. ఈ చిత్రానికి ఎల్లమ్మ అనే టైటిల్ ఖరారైంది. ఇప్పుడు, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోని సినిమా కూడా నాని లైనప్‍లోకి వచ్చేసింది.