Family Star Movie: సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్.. పంచెకట్టులో రౌడీ హీరో: ఫొటోలు-vijay deverakonda and mrunal thakur shines in traditional looks at family star movie pre release press meet ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Family Star Movie: సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్.. పంచెకట్టులో రౌడీ హీరో: ఫొటోలు

Family Star Movie: సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్.. పంచెకట్టులో రౌడీ హీరో: ఫొటోలు

Apr 01, 2024, 09:09 PM IST Chatakonda Krishna Prakash
Apr 01, 2024, 09:03 PM , IST

  • Family Star Movie - Vijay Deverakonda: ఫ్యామిలీ స్టార్ మూవీ ఈవెంట్‍లో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. నిర్మాత దిల్‍రాజు కూడా ట్రెడిషనల్ లుక్‍లో వచ్చారు. ఆ ఫొటోలు ఇవే.. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా ప్రీ-రిలీజ్ ప్రెస్‍మీట్‍ను మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 1) నిర్వహించింది. ఈ ఈవెంట్‍కు సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారు విజయ్, మృణాల్. 

(1 / 6)

ఈ ఈవెంట్‍కు పంచె కట్టుతో ట్రెడిషనల్ లుక్‍తో వచ్చారు విజయ్ దేవరకొండ. లైట్ పింక్ కుర్తా, పంచె ధరించారు. నుదుటన తిలకం కూడా పెట్టుకున్నారు. ఈ లుక్‍లో కొత్తగా కనిపించారు విజయ్. 

(2 / 6)

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ట్రెడిషనల్ లుక్‍లో తళుక్కుమన్నారు. నిర్మాత దిల్‍రాజు కూడా పంచెకట్టుతో వచ్చారు. దర్శకుడు పరశురామ్ భార్య అర్చన అక్క స్ఫూర్తితో ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ పోషించిన ఇందు క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు విజయ్ చెప్పారు. 

(3 / 6)

విజయ్ - పరశురామ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన గీతగోవిందం భారీ సక్సెస్ అయిందని, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని నిర్మాత దిల్‍రాజు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని అన్నారు. 

(4 / 6)

ఫ్యామిలీ స్టార్ స్క్రిప్టును పరుశురామ్ చెప్పినప్పుడు అది తనకు కనెక్ట్ అయిందని విజయ్ దేవరకొండ చెప్పారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ పేరును గోవర్దన్ అని పెట్టాలని తాను దర్శకుడిని రిక్వెస్ట్ చేశానని తెలిపారు. గోవర్దన్ తన తండ్రి పేరు అని విజయ్ వెల్లడించారు. 

(5 / 6)

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ సంప్రదాయ దుస్తుల్లో చూడముచ్చటగా కనిపించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు