తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Prize Money: బిగ్‌బాస్ ప్రైజ్‌మ‌నీ ఎంతో చెప్పిన‌ నాగార్జున - నిఖిల్‌కు ముద్దుపెట్టిన గౌత‌మ్

Bigg Boss Prize Money: బిగ్‌బాస్ ప్రైజ్‌మ‌నీ ఎంతో చెప్పిన‌ నాగార్జున - నిఖిల్‌కు ముద్దుపెట్టిన గౌత‌మ్

09 December 2024, 11:11 IST

google News
  • Bigg Boss :బిగ్‌బాస్ సీజ‌న్ 8 నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యింది. అవినాష్‌, నిఖిల్‌, గౌత‌మ్, ప్రేర‌ణ‌, న‌బీల్ ఫైన‌ల్ చేరుకున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్ 8 ప్రైజ్‌మ‌నీ ఎంత‌న్న‌ది నాగార్జున రివీల్ చేశాడు. బిగ్‌బాస్ హౌజ్‌లోకి నువ్వుంటే నా జ‌త‌గా టీమ్ ఎంట్రీ ఇచ్చిన‌ట్లు లేటెస్ట్ ప్రోమోలో చూపించారు.

బిగ్‌బాస్ సీజ‌న్ 8 ప్రైజ్‌మ‌నీ
బిగ్‌బాస్ సీజ‌న్ 8 ప్రైజ్‌మ‌నీ

బిగ్‌బాస్ సీజ‌న్ 8 ప్రైజ్‌మ‌నీ

Bigg Boss Prize Money: బిగ్‌బాస్ 8 తెలుగు నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యింది. జెన్యూన్ గేమ్ ఆడుతూ వ‌స్తోండ‌టంతో విష్ణుప్రియ టాప్ ఫైవ్‌లో ఉంటుంద‌ని బిగ్‌బాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ విష్ణుప్రియకు షాకిస్తూ గౌత‌మ్‌, నిఖిల్‌, న‌బీల్‌, ప్రేర‌ణ‌, అవినాష్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టిన‌ట్లు నాగార్జున ప్ర‌క‌టించాడు.

ప్రైజ్‌మ‌నీ ఎంతంటే...

బిగ్‌బాస్ సీజ‌న్ 8 ప్రైజ్‌మ‌నీ ఎంత‌న్న‌ది సండే ఎపిసోడ్‌లో నాగార్జున రివీల్ చేశాడు. ప్ర‌స్తుతం 54 ల‌క్ష‌ల 30 వేల ప్రైజ్‌మ‌నీ ఉంద‌ని, గ్రాండ్ ఫినాలే లోగా ఆ మొత్తం త‌గ్గొచ్చు...పెర‌గొచ్చుఅని నాగార్జున అన్నాడు. అంతే కాకుండా విన్న‌ర్‌కు ప్రైజ్‌మ‌నీతో పాటు ఓ కారు కూడా గిఫ్ట్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు నాగార్జున‌. సండే ఎపిసోడ్‌లో మీరు గ‌న‌క బిగ్‌బాస్ విన్న‌ర్ అయితే ఆ ప్రైజ్‌మ‌నీతో ఏం చేస్తార‌ని ఒక్కో కంటెస్టెంట్‌ను నాగార్జున ప్ర‌శ్న అడిగారు. త‌మ స్వంత అవ‌స‌రాల‌కే ఆ డ‌బ్బును వాడ‌తామంటూ అంద‌రూ చెప్పారు.

అన్న‌య్య కూతురు పెళ్లికి...

తాను విన్న‌ర్ అయితే అన్న‌య్య కూతురి పెళ్లి కోసం బిగ్‌బాస్ ప్రైజ్‌మ‌నీని వాడుతాన‌ని అవినాష్ అన్నాడు. బిగ్‌బాస్ ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తో త‌ల్లిదండ్రుల‌కు ఉన్న అప్పుల‌న్నీ తీర్చేస్తాన‌ని ప్రేర‌ణ చెప్పింది.

పృథ్వీకి గోల్డ్ రింగ్‌...

తాను విన్న‌ర్ అయితే వ‌చ్చిన డ‌బ్బుల‌ను ఏం చేస్తాన‌నేదానిపై విష్ణుప్రియ పెద్ద లిస్ట్ చెప్పింది. ఆమె చెప్పిన లిస్ట్ విని నాగార్జున ఆశ్చ‌ర్య‌పోయాడు. ప్రైజ్‌మ‌నీలో నుంచి గంగ‌వ్వ‌కు ఐదు ల‌క్ష‌లు ఇస్తాన‌ని విష్ణుప్రియ అన్న‌ది. అభ‌య్‌ని ఫారిన్ టూర్ తీసుకెళ‌తాన‌ని, మ‌ణికంఠ‌కు నానో కారు కొనిస్తాన‌ని చెప్పింది. పృథ్వీకి గోల్డ్ రింగ్‌.. నిఖిల్‌కు ప్లాటినం ఇయ‌ర్ రింగ్స్‌...ప్రేర‌ణ‌కు డైమండ్ న‌క్లెస్ ఇలా విష్ణుప్రియ చెప్పుకుంటూ వెళ్లిపోయింది.

సినిమా తీస్తా...

త‌న‌కు వ‌చ్చిన డ‌బ్బుల‌తో మంచి సినిమా తీస్తాన‌ని న‌బీల్ అన్నాడు. డ‌బ్బులు లేక‌పోవ‌డంతో తాను తీసిన ఓ వెబ్‌సిరీస్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింద‌ని, దానిని పూర్తిచేస్తాన‌ని చెప్పాడు. త‌న‌కు వ‌చ్చిన ప్రైజ్‌మ‌నీతో అప్పులు తీర్చేస్తాన‌ని నిఖిల్ చెప్పాడు. పుట్టిన‌ప్ప‌టి నుంచి తాము అద్దె ఇంట్లో ఉంటున్నామ‌ని, బిగ్‌బాస్ ప్రైజ్‌మ‌నీతో సొంత ఇళ్లు క‌ట్టుకుంటాన‌ని చెప్పాడు. గౌత‌మ్ కూడా అమ్మ రిటైర్‌మెంట్ ద‌గ్గ‌ర‌లో ఉంద‌ని, ఆమె కోసం ప్రైజ్‌మ‌నీలో నుంచి యాభై శాతం సేవింగ్స్ చేస్తాన‌ని చెప్పాడు. గంగ‌వ్వ కూతురి ఇంటి కోసం ప‌ది ల‌క్ష‌లు ఇస్తాన‌ని చెప్పాడు.

క‌లిసిపోయిన గౌత‌మ్ నిఖిల్‌...

ఆ త‌ర్వాత హౌజ్‌లో మీరు థాంక్స్‌, సారీ ఎవ‌రికి చెబుతార‌ని కంటెస్టెంట్‌కు టాస్క్ ఇచ్చాడు నాగార్జున‌. ఇందులో ఒక్కొక్క‌రు ఒక్కొక్క‌రి పేరు చెప్పారు. నిఖిల్...థాంక్స్ పృథ్వీకి చెప్పాడు. కొన్ని సార్లు త‌ప్ప‌ని తెలిసిన గౌత‌మ్‌పై నోరు జారాన‌ని అత‌డికి సారీ చెబుతాన‌ని అన్నాడు. నిఖిల్ ఆ మాట అన‌గానే అత‌డికి గౌత‌మ్ ముద్ధుపెట్టాడు. గౌత‌మ్ కూడా..థాంక్స్‌...సారీ రెండు నిఖిల్‌కే చెప్పాడు.

నువ్వుంటే నా జ‌త‌గా సీరియ‌ల్…

ఆ త‌ర్వాత బిగ్‌బాస్ సోమ‌వారం నాటి ఎపిసోడ్‌లోకి నువ్వుంటే నా జ‌త‌గా సీరియ‌ల్ హీరోహీరోయిన్లు అర్జున్ క‌ళ్యాణ్, అనుమితా ద‌త్తా ఎంట్రీ ఇచ్చారు. ప్రైజ్‌మ‌నీ పెంచుకోవ‌డానికి వారితో కంటెస్టెంట్స్ ప‌లు గేమ్స్ ఆడిన‌ట్లుగా ప్రోమోలో చూపించారు.

తదుపరి వ్యాసం