Tv Shows Trp Ratings: టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్స్ -టాప్‌లో శ్రీముఖి గేమ్ షో - సెకండ్ ప్లేస్‌కు పడిపోయిన బిగ్‌బాస్
Tv Shows Trp Ratings: టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బిగ్‌బాస్‌ను దాటేసి శ్రీముఖి టీవీ షో ఆదివారం విత్ స్టార్ మా పరివారం టాప్‌లోకి వచ్చింది. వీకెండ్స్‌లో మాత్రం బిగ్‌బాస్ పర్వాలేదనిపించింది. గత వారంతో పోలిస్తే లేటెస్ట్ టీఆర్‌పీలో ఈ టీవీ షోస్ రేటింగ్స్ భారీగా పెరిగాయి.
Tv Shows Trp Ratings: ఫైనల్ ముంగిట బిగ్‌బాస్‌కు తెలుగు ఆడియెన్స్ షాకిచ్చారు. లేటెస్ట్ టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బిగ్‌బాస్ సెకండ్ ప్లేస్‌కు పడిపోయింది. శ్రీముఖి ఫన్ రియాలిటీ గేమ్ షో ఆదివారం విత్ స్టార్ మా పరివారం బిగ్‌బాస్‌ను దాటేసి టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చింది.
స్టార్ మా షోస్‌దే హవా...
సీరియల్స్‌లోనే కాదు...టీవీ షోస్‌లో కూడా స్టార్ మా ఛానెల్‌దే డామినేషన్ కనిపిస్తోంది. లేటెస్ట్ టీఆర్‌పీలో స్టార్ మాకు చెందిన బిగ్‌బాస్, ఆదివారం స్టార్ మా పరివారం టాప్ ప్లేస్‌లో నిలిచాయి. బిగ్‌బాస్ వీకెండ్స్ ఎపిసోడ్స్ టీఆర్‌పీ బాగుండగా...వీక్‌డేస్‌లో మాత్రం ఆదరణ తగ్గింది.
బిగ్‌బాస్ వీకెండ్స్...వీక్ డేస్...
బిగ్‌బాస్ వీకెండ్స్ ఎపిసోడ్‌కు అర్బన్ రూరల్ ఏరియాలలో కలిపి 5.41 టీఆర్‌పీ రాగా...అర్బన్ ఏరియాలో 7.18 వచ్చింది. వీక్ డేస్‌లో మాత్రం బిగ్‌బాస్‌కు అర్బన్, రూరల్ ఏరియాల్లో కలిపి 3.76 మాత్రమే రేటింగ్ వచ్చింది. అర్బన్ ఏరియాలో మాత్రం 5.26తో పర్వాలేదనిపించింది.
గ్రాండ్ ఫినాలే...
వీకెండ్స్‌లో డ్రామా తగ్గడం, లవ్‌స్టోరీస్ ముగియడంతో పాటు టాస్కులు రొటీన్ కావడం వల్లే టీఆర్‌పీ తగ్గిందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఆదివారంతో బిగ్‌బాస్ ముగియనుంది. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే జరుగనుంది.
శ్రీముఖి టీవీ షో...
శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఆదివారం స్టార్ మా పరివారం షోకు అర్బన్ రూరల్ ఏరియాల్లో 3.81 టీఆర్‌పీ వచ్చింది. బిగ్‌బాస్ వీక్‌డేస్ టీఆర్‌పీని దాటేసి ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చింది. అర్బన్ ఏరియాలో మాత్రం బిగ్‌బాస్ కంటే శ్రీముఖి షో టీఆర్‌పీ తక్కువగా ఉంది. 3.98 మాత్రమే రేటింగ్ వచ్చింది.
ఈటీవీ షోస్...
స్టార్ మా తర్వాత ఈటీవీ షోస్ టీఆర్‌పీలో సత్తా చాటాయి.పోయిన వారంతో పోలిస్తే లెటేస్ట్ రేటింగ్స్‌లో పెరుగుదల కనిపిస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ 3.07 టీఆర్‌పీతో టాప్ త్రీ ప్లేస్‌లో నిలిచింది. ఈటీవీ షోస్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నది. గత వారం ఈ షోలోని స్కిట్స్‌లో కామెడీ బాగా వర్కవుట్ కావడం కలిసివచ్చింది.
ఢీ ఫైనల్...
ఢీ ఫైనల్ ఎపిసోడ్ 2.66 టీఆర్‌పీతో ఈటీవీ షోస్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉంది. జబర్ధస్థ్ 2.06, పాడుతా తీయగా 1.78, సుమ అడ్డా 1.42 టీఆర్‌పీని సొంతం చేసుకున్నాడు. ఈటీవీలో ఇటీవలే లాంఛ్ అయిన ఆడవాళ్లు మీకు జోహార్లు మాత్రం డిసపాయింట్ చేసింది. గత వారంతో పోలిస్తే ఈ రియాలిటీ షో టీఆర్‌పీ రేటింగ్ మరింత పడిపోయింది. కేవలం 0.62 రేటింగ్ మాత్రమే వచ్చింది.
సరిగమప...
జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న సరిగమప సింగింగ్ షో 2.58 టీఆర్‌పీతో సత్తా చాటింది. జీ తెలుగులో హయ్యెస్ట్ రేటింగ్ దక్కించుకున్న షోగా నిలిచింది. పాడుతా తీయగా కంటే ఎక్కువగా సరిగమపనే రేటింగ్ రావడం గమనార్హం.