Naga Shaurya New Movie: కొత్త సినిమాకు నాగశౌర్య శ్రీకారం.. యాక్షన్ జోనర్‌లో చిత్రం
03 November 2022, 15:22 IST
- Naga Shaurya New Movie: టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య తన తదుపరి చిత్రాన్ని యాక్షన్ జోనర్‌లో చేయనున్నాడు. తాజాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రకటనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
నాగ శౌర్య కొత్త చిత్రం షురూ
Naga Shaurya New Movie: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఇటీవలే కృష్ణ వ్రింద విహారి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లపరంగా పర్వాలేదనిపించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నాగశౌర్య తన తదుపరి చిత్రం గురించి ప్రకటించాడు. ఇప్పటి వరకు రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లపై మొగ్గు చూపిన ఈ హీరో.. ఈ సారి గేర్ మార్చాడు. మంచి పక్కా యాక్షన్ చిత్రంతో ముందుకు రానున్నాడు.
అరుణాచలం అనే నూతన దర్శకుడితో నాగశౌర్య తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ఈ సినిమాను వైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా రిలీజ్ చేయనున్నారు. శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
నాగశౌర్య కెరీర్‌లో అతడు నటిస్తున్న 24వ చిత్రమిది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ప్రకటించలేదు. త్వరలోనే అధికారికంగా ఈ సినిమాను లాంచ్ చేసి.. టైటిల్ కన్ఫార్మ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను నాగశౌర్య ట్విటర్ వేదికగా పంచుకున్నాడు.
యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం నాగశౌర్య అప్పుడే కసరత్తులు ప్రారంభించాడు. ఇప్పటికే చిత్రం కోసం ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ మార్చుకున్న నాగశౌర్య.. సినిమా కోసం విభిన్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. త్వరలోనే చిత్రబృందం ఈ సినిమా టైటిల్, ఇంకా ఇతర వివరాల గురించి అధికారికంగా తెలియజేయనుంది.
టాపిక్