Krishna Vrinda Vihari OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కృష్ణ వ్రింద విహారి
Krishna Vrinda Vihari OTT Release Date: నాగశౌర్య హీరోగా నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందంటే...
Krishna Vrinda Vihari OTT Release Date: నాగశౌర్య(Naga Shaurya) కృష్ణ వ్రింద విహారి ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. భిన్న మతాలకు చెందిన ఓ జంట ప్రేమ కథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కృష్ణ వ్రింద విహారి సినిమా తెరకెక్కింది.
ఆచారాలు, సంప్రదాయాలతో కూడిన కుటుంబంలో పెరిగిన కృష్ణాచారి అనే బ్రాహ్మణ యువకుడు ఆధునిక భావాలున్న వ్రిందా అనే అమ్మాయితో ఎలా ప్రేమలో పడ్డాడు. అబద్దాలు ఆడి తన ప్రేమను గెలిపించుకోవాలని అనుకున్న కృష్ణాచారికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయనే పాయింట్‌తో ఎమోషన్స్‌కు వినోదాన్ని జోడించి దర్శకుడు అనీష్ కృష్ణ ఈ సినిమాను రూపొందించాడు.
సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. నాని హీరోగా నటించిన అంటే సుందరానికి కథతో కృష్ణ వ్రింద విహారికి దగ్గరి పోలికలు ఉండటం మైనస్‌గా మారింది. కాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నది.
అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో షిర్లే సేతియా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కృష్ణ వ్రింద విహారి సినిమాను నాగశౌర్య తల్లిదండ్రులు శంకర్‌ప్రసాద్, ఉష నిర్మించారు.