Chiranjeevi Acharya Trp Rating: బుల్లితెరపై ఆచార్య డిజాస్టర్ - చిరు కెరీర్‌లో లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్
03 November 2022, 14:00 IST
Chiranjeevi Acharya Trp Rating: చిరంజీవి ఆచార్య ఫస్ట్ టీవీ ప్రీమియర్‌కు లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ వచ్చాయి. చిరంజీవి కెరీర్‌లో అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్ వచ్చిన సినిమాగా ఆచార్య నిలిచింది.
చిరంజీవి
Chiranjeevi Acharya Trp Rating: వెండితెరపై ప్రేక్షకుల్ని నిరాశపరిచిన ఆచార్య బుల్లితెరపై డిజాస్టర్‌గా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లో అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆచార్య సినిమా స్పెషల్ ప్రీమియర్ ఇటీవల జెమినీ టీవీలో ప్రసారమైంది. చిరంజీవి, రామ్‌చరణ్ (Ram charan) తొలిసారి కలిసి నటించిన సినిమా కావడంతో టీఆర్‌పీ రేటింగ్స్ బాగానే వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు.
కానీ ఈ సినిమాకు కేవలం 6.30 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే దక్కించుకున్నది. ఫస్ట్ టైమ్ ప్రీమియర్‌కు ఇంత తక్కువ టీఆర్‌పీ రేటింగ్ రావడం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి, ఖైదీ నంబర్ 150తో పోలిస్తే ఆచార్యకు చాలా తక్కువగా టీఆర్‌పీ రేటింగ్స్ వచ్చాయి.
చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.
ఇందులో ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే అన్యాయాల్ని ఎదురించే ఆచార్యగా చిరంజీవి కనిపించారు. సిద్ధ అనే యువకుడి పాత్రలో చరణ్ కనిపించాడు. కథను ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు కొరటాల శివ తడబడటంతో ఈ సినిమా డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది.
వంద కోట్లకుగాపై బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కేవలం వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా విషయంలో నిర్మాతలకు ఎదురైన నష్టాలను భరించడానికి తమ రెమ్యునరేషన్స్‌ను చిరంజీవి, రామ్‌చరణ్ వదులుకున్నారు. ఆచార్య సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది.