Balakrishna Anjali: అంజలిని నెట్టిన బాలకృష్ణ.. అవాక్కైన నేహా శెట్టి.. వైరల్ అవుతున్న వీడియో
29 May 2024, 18:01 IST
- Nadamuri Balakrishna - Anjali: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో నటి అంజలిని తోశారు బాలకృష్ణ. అక్కడే ఉన్న నేహా శెట్టి షాకయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Balakrishna Anjali: అంజలిని నెట్టిన బాలకృష్ణ.. అవాక్కైన నేహా శెట్టి.. వైరల్ అవుతున్న వీడియో
Balakrishna - Anjali: మాస్ కా దాస్, యంగ్ హీరో నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. విశ్వక్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పారు. తన మార్క్ స్పీచ్‍తో బాలయ్య అలరించారు. అయితే, ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్టేజ్‍పై ఓ దశలో నటి అంజలిని బాలకృష్ణ కాస్త అలా తోసేశారు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే..
స్టేజ్‍పైకి వచ్చిన తర్వాత పక్కకు జరగాలని అంజలికి సైగ చేశారు బాలకృష్ణ. అంజలి కాస్త పక్కకు వెళ్లారు. అయితే, ఇంకా జరగాలంటూ అంజలిని కాస్త గట్టిగా చేత్తో తోశారు బాలయ్య. దీంతో ఏకంగా తూలి కిందపడపోయినట్టు అయి మళ్లీ నిలబడ్డారు అంజలి. ఇందతా వెనక నుంచి చూసిన నేహా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంజలిని బాలయ్య అలా తోసేయడంతో అవాక్కయ్యారు. అయితే, ఆ తర్వాత అంజలి గట్టిగా నవ్వారు. జరగమంటే.. జరగలేదని బాలయ్య ఏదో అన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ - అంజలి ఇద్దరూ హైఫై ఇచ్చుకున్నారు.
బాలకృష్ణ ఒక్కసారిగా నెట్టడంతో అంజలి కూడా షాక్ అయినట్టు అనిపించారు. అయితే, నవ్వుతో కవర్ చేసుకున్నట్టు కనిపించారు. అయితే, బాలయ్య సరదాగానే అలా చేసినట్టు అనిపిస్తోంది. అదంతా చూస్తూ అవాక్కైన ఎక్స్‌ప్రెషన్‍తోనే నవ్వారు నేహా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య దురుసుగా ప్రవర్తించారని కొందరు అంటుంటే.. సరదాగానే అలా చేశారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
గతంలో డిక్టేటర్ చిత్రంలో బాలకృష్ణ, అంజలి కలిసి నటించారు. అంజలికి టాలెంట్, ప్యాషన్ చాలా ఉన్నాయని తన స్పీచ్‍లో ప్రశంసించారు బాలయ్య. అలాగే, ఇండస్ట్రీలో తాను కొందరితోనే చనువుగా ఉంటానని, అందులో విశ్వక్ ఒకరని బాలకృష్ణ చెప్పారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో విశ్వక్‍సేన్,న నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గోదావరి జిల్లా బ్యాక్‍డ్రాప్‍లో రూరల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో అంజలి కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. గోపరాజు రమణ, హైపర్ ఆది, సాయికుమార్, నాజర్ కీరోల్స్ చేశారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయిసౌజన్య ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో విశ్వక్‍సేన్.. విశ్వరూపం చూస్తారని ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో నాగవంశీ చెప్పారు. రస్టిక్ మాస్ యాక్షన్‍తో ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కాగా, బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి (కేఎల్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ మూవీ (NBK 109) సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలే నిర్మిస్తున్నాయి. ఎన్‍బీకే 109 నుంచి జూన్ 10న మరో గ్లింప్స్ వస్తుందని నాగవంశీ చెప్పారు.