తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Best Crime Thriller Web Series: ఇండియాలో ఎక్కువ మంది చూసిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే

Best Crime Thriller Web Series: ఇండియాలో ఎక్కువ మంది చూసిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu

10 May 2024, 16:26 IST

    • Best Crime Thriller Web Series: ఇండియాలో ఎక్కువ మంది చూసిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఏవో తెలుసా? ఇప్పటి వరకూ వివిధ ఓటీటీల్లో ప్రేక్షకుల మనసులు గెలిచిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే.
ఇండియాలో ఎక్కువ మంది చూసిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే
ఇండియాలో ఎక్కువ మంది చూసిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే

ఇండియాలో ఎక్కువ మంది చూసిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే

Best Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలైనా, వెబ్ సిరీస్ అయినా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. మంచి సస్పెన్స్, థ్రిల్ ను పంచుతూ సాగే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ప్రస్తుతం ఓటీటీల్లో చాలానే ఉన్నాయి. వీటిలో బెస్ట్ ఏవి? ఏ ఓటీటీల్లో చూడాలన్నది ఇక్కడ చూడండి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో సినిమా, ఎంఎక్స్ ప్లేయర్ లాంటి ఓటీటీల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu May 20th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రపై రాజీవ్ హత్యాయత్నం- ధరణి కాళ్లు పట్టుకున్న భర్త

krishna mukunda murari serial: అబార్షన్ చేయించుకున్న మీరా.. బిడ్డ కోసం గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ

Jr NTR Movies on OTT: హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్: మ్యాన్ ఆఫ్ మాసెస్ సూపర్ హిట్ సినిమాలు ఈ ఓటీటీల్లో చూసేయండి

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. 'దీపకి, నీ కొడుక్కి ఏంటి సంబంధం'నిలదీసిన జ్యోత్స్న.. కార్తీక్ పై దీప ఫైర్

బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే

ఇండియాలో ఓటీటీ, వెబ్ సిరీస్ టైమ్ మొదలైన తర్వాత ఇక్కడి ప్రేక్షకులు ఎక్కువ ఆదరించినవి క్రైమ్ థ్రిల్లర్ జానర్ లోని వెబ్ సిరీసే. దీంతో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ జానర్ లోనే ఎక్కువగా సినిమాలు, సిరీస్ తీసుకొస్తున్నాయి. నిజానికి ఈ జానర్ లో ప్రస్తుతం ఓటీటీల్లో ఉన్న వెబ్ సిరీస్ లలో చాలా వరకూ ప్రేక్షకుల ఆదరణ పొందినవే. మరి ఆ వెబ్ సిరీస్ ఏవి? ప్రస్తుతం అవి అందుబాటులో ఉన్న ఓటీటీలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.

సేక్రెడ్ గేమ్స్ - నెట్‌ఫ్లిక్స్

ఇండియన్ ఆడియెన్స్ వెబ్ సిరీస్ లకు అలవాటు పడుతున్న తొలినాళ్లలోనే వచ్చిందీ సేక్రెడ్ గేమ్స్. సెన్సార్ లేని ఓటీటీలో కాస్త హింస, సెక్సువల్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ వెబ్ సిరీస్ కొంత మందికి ఇబ్బందిగా అనిపించినా.. చాలా వరకూ ఆకట్టుకుంది. దీంతో ఎక్కువ మంది చూసిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ల జాబితాలో టాప్ లో ఉండటం విశేషం.

ది ఫ్యామిలీ మ్యాన్ - ప్రైమ్ వీడియో

ది ఫ్యామిలీ మ్యాన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ కోసం రెడీ అవుతోంది. రాజ్ అండ్ డీకే డైరెక్షన్, మనోజ్ బాజ్‌పాయీ యాక్షన్ తో ఈ వెబ్ సిరీస్ బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ లిస్టులో చోటు సంపాదించింది.

మీర్జాపూర్ - ప్రైమ్ వీడియో

హింస ఎక్కువగా ఉండే వెబ్ సిరీస్ లలో ఇదీ ఒకటి. మీర్జాపూర్ సింహాసనం కోసం సాగే పోరాటం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ప్రైమ్ వీడియోలో రెండు సీజన్లు అందుబాటులో ఉన్నాయి. మూడో సీజన్ రావాల్సి ఉంది.

ఢిల్లీ క్రైమ్ - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ లోని మరో టాప్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఈ ఢిల్లీ క్రైమ్. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ నిర్భయ కేసు చుట్టూ తిరగగా.. రెండో సీజన్ కచ్చా బనియన్ గ్యాంగ్ అరాచకాలను కళ్లకు కట్టింది. మూడో సీజన్ కూడా రానుంది.

స్పెషల్ ఓపీఎస్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

పార్లమెంట్ పై దాడి, దాని వెనుక మాస్టర్ మైండ్ ను పట్టుకునేందుకు సాగించే ఆపరేషన్ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. మన రా ఏజెంట్లు విదేశాల్లో ఎలా గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహిస్తారన్నది కూడా ఇందులో చూడొచ్చు. హాట్‌స్టార్ లో ఈ సిరీస్ ఉంది.

అసుర్ - జియో సినిమా

క్రైమ్ థ్రిల్లర్ జానర్ లోనే వచ్చిన మరో బెస్ట్ వెబ్ సిరీస్ అసుర్. ఈ సిరీస్ ను జియో సినిమాలో చూడొచ్చు. వరుస హత్యల ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఆసక్తికరంగా సాగే సిరీస్ ఇది.

స్కామ్ 1992 - సోనీలివ్

30 ఏళ్ల కిందట దేశాన్ని కుదిపేసిన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ ఈ స్కామ్ 1992. అసలు అప్పట్లో స్టాక్, మనీ మార్కెట్లలో జరిగిన స్కామ్ గురించి కళ్లకు కట్టినట్లు వివరించే ఈ వెబ్ సిరీస్.. ఇండియాలో అత్యధిక ఐఎండీబీ రేటింగ్ సంపాదించిన సిరీస్ కూడా కావడం విశేషం.

ఇవే కాకుండా ప్రైమ్ వీడియోలో ఉన్న ఫర్జీ, పాతాళ్ లోక్, బ్రీత్.. నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న షి, బార్డ్ ఆఫ్ బ్లడ్.. ఎంఎక్స్ ప్లేయర్ లోని ఆశ్రమ్, జీ5లోని దురంగా, ది ఫైనల్ కాల్ లాంటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు కూడా చాలా ఇంట్రెస్టింగా ఉంటాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం