The Family Man Season 3: ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై గుడ్ న్యూస్ చెప్పిన ప్రైమ్ వీడియో-the family man season 3 prime video reveals commencing of the web series shooting manoj bajpayee joins the team ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Family Man Season 3: ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై గుడ్ న్యూస్ చెప్పిన ప్రైమ్ వీడియో

The Family Man Season 3: ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై గుడ్ న్యూస్ చెప్పిన ప్రైమ్ వీడియో

Hari Prasad S HT Telugu
May 06, 2024 02:33 PM IST

The Family Man Season 3: ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 3పై గుడ్ న్యూస్ చెప్పింది ప్రైమ్ వీడియో. సోమవారం (మే 6) ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపింది.

ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై గుడ్ న్యూస్ చెప్పిన ప్రైమ్ వీడియో
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై గుడ్ న్యూస్ చెప్పిన ప్రైమ్ వీడియో

The Family Man Season 3: ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మూడో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సోమవారం (మే 6) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇది చూసి రాశీ ఖన్నా, నీల్ నితిన్ ముకేశ్, శ్రేయ ధన్వంతరిలాంటి సెలబ్రిటీలు కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ కొత్త సీజన్ షూటింగ్ ప్రారంభమైంది.

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3

అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్ వెబ్ సిరీస్ లలో ఒకటి ది ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. కొత్త సీజన్ కోసం చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తొలి సీజన్ కశ్మీర్ ఉగ్రవాదం, రెండో సీజన్ ఎల్టీటీఈ ఉగ్రవాదాన్ని రక్తికట్టించేలా చూపించారు మన తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే. దీంతో మూడో సీజన్ పై ఎక్కడలేని ఆసక్తి నెలకొంది.

మొత్తానికి ఇన్నాళ్లకు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని సోమవారం (మే 6) తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రైమ్ వీడియో వెల్లడించింది. షూట్ బిగిన్స్ అనే క్యాప్షన్ తో రెండు ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఒకటి క్లాప్ కొడుతున్నది కాగా.. రెండోది డైరెక్టర్లు రాజ్ అండ్ డీకేతో ఈ వెబ్ సిరీస్ లీడ్ మనోజ్ బాజ్‌పాయీ ఉన్న ఫొటో కావడం విశేషం.

ఈ అప్డేట్ చూసి రాశీ ఖన్నాలాంటి సెలబ్రిటీలు కూడా ఎక్జైట్ అయిపోతున్నారు. చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇండియన్ వెబ్ సిరీస్ లలో ఈ ఫ్యామిలీ మ్యాన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. మూడేళ్లుగా ఈ కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మొత్తానికి షూటింగ్ ప్రారంభం కావడంతో వచ్చే ఏడాది ఇది స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 20, 2019లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చినా.. తర్వాత అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. శ్రీకాంత్ తివారీ అనే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా ఓవైపు, దేశాన్ని ఉగ్రవాదుల నుంచి కాపాడే స్పైగా మరోవైపు మనోజ్ బాజ్‌పాయి ఇందులో నటించాడు.

అతని భార్య సుచిత్రా తివారీ పాత్రలో ప్రియమణి నటించింది. తొలి రెండు సీజన్లలోనూ ఈ ఇద్దరి పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొలి సీజన్ మొత్తం కశ్మీరీ ఉగ్రవాదం, రాజధాని ఢిల్లీకి వాళ్ల నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో సాగింది. ఇక రెండో సీజన్లో ఎల్టీటీఈ ఉగ్రవాదాన్ని చూపించారు. ఇందులో సమంత ఎల్టీటీఈ ఉగ్రవాదిగా నటించింది.

రెండు సీజన్లూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాయి. రెండో సీజన్ ను ఈశాన్య భారతంలో ముగించారు. ఈసారి శ్రీకాంత్ తివారి యాక్షన్ నార్త్ ఈస్ట్ లో మొదలు కానుంది. ఈ కొత్త సీజన్ మోస్ట్ అవేటెడ్ ఇండియన్ వెబ్ సిరీస్ లో ఒకటిగా నిలిచింది.