Article 370 OTT: యామి గౌతమ్, ప్రియమణి సినిమాకు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..-article 370 movie getting very positive reviews from audience after ott release on netflix praises on yami gautam film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Article 370 Ott: యామి గౌతమ్, ప్రియమణి సినిమాకు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..

Article 370 OTT: యామి గౌతమ్, ప్రియమణి సినిమాకు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 21, 2024 02:45 PM IST

Article 370 OTT Streaming: ఆర్టికల్ 370 సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో రీసెంట్‍గా స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ సినిమాపై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..

Article 370 OTT: యామి గౌతమ్, ప్రియమణి సినిమాకు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్.. నెటిజన్ల స్పందన ఇదే
Article 370 OTT: యామి గౌతమ్, ప్రియమణి సినిమాకు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్.. నెటిజన్ల స్పందన ఇదే

Article 370 OTT: బాలీవుడ్ నటి యామీ గౌతమ్, సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన ‘ఆర్టికల్ 370’ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం సుమారు రూ.110 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కమర్షియల్‍గా సక్సెస్ అయింది. ఆదిత్య జంబాలే ఈ మూవీకి దర్శకత్వం వహించారు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ‘ఆర్టికల్ 370’ ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా నెటిజన్ల నుంచి ప్రశంసలు పొందుతోంది.

జమ్ముకశ్మీర్‌లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 ఎత్తివేసే ప్రక్రియ, ఆ ప్రాంతంలో అప్పటి పరిణామాలను, ప్రభుత్వ చర్యలను ఈ సినిమాలో మేకర్స్ చూపించారు. ఈ చిత్రం ఉత్కంభరితంగా ఆకట్టుకోవడంతో ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‍తో లాంగ్ రన్ సాధించింది. సూపర్ హిట్ అయింది. ఏప్రిల్ 19వ తేదీన ‘నెట్‍ఫ్లిక్స్’ ఓటీటీలో ఆర్టికల్ 370 చిత్రం అడుగుపెట్టింది.

నెటిజన్ల రెస్పాన్స్ ఇదే

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఆర్టికల్ 370 చిత్రం చూసిన చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఆర్టికల్ 370 చిత్రం అద్భుతంగా ఉందని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. సస్పెన్స్‌గా ఉండటంతో పాటు ఎమోషనల్‍గానూ ఉందని అభిప్రాయపడుతున్నారు. దేశభక్తి మరో హైలైట్ కాగా.. కశ్మీర్, ఆర్టికల్ 370 గురించి చాలా సమాచారం కూడా ఈ చిత్రం చూడడం ద్వారా తెలుస్తుందని కొందరు పోస్టులు చేస్తున్నారు.

ఆర్టికల్ 370 చిత్రాన్ని అసలు మిస్ కావొద్దని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. థియేటర్లలో చూసినా మరోసారి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూశామని మరికొందరు తెలుపుతున్నారు. జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితులు, ఆర్టికల్ 370 ఎత్తివేత విషయాలను ఉత్కంఠభరితంగా చూపించిన డైరెక్టర్ ఆదిత్య జంబాలేను ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఎంత పరిశోధన చేశారో అర్థమవుతోందని కొందరు నెటిజన్లు అంటున్నారు.

ఆర్టికల్ 370 సినిమాలో యామి గౌతమ్ పర్ఫార్మెన్స్‌ అద్భుతంగా ఉందనే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రియమణి నటనపై పొగడ్తలు వస్తున్నారు. ఓవరాల్‍గా ఈ మూవీకి నెటిజన్ల నుంచి అద్భుత రెస్పాన్స్ వస్తోంది.

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఆర్టికల్ 370 చిత్రానికి భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో త్వరలోనే ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం హిందీలో మాత్రమే ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

ఆర్టికల్ 370 గురించి..

ఆర్టికల్ 370 సినిమాలో యామి గౌతమ్, ప్రియమణితో పాటు రాజ్ అరుణ్, శివమ్ ఖజురియా, వైభవ్ తత్వవాది, అరుణ్ గోవిల్, రాజ్ జుత్షి, దివ్య సేథ్, కిరణ్ కర్మాకర్, సుమీత్ కౌల్ కీలకపాత్రలు చేశారు. ఆదిత్య ధార్, మోనాల్ థాకర్ కథ అందించిన ఈ మూవీని డైరెక్టర్ ఆదిత్య సుహాస్ జంబాలే తెరకెక్కించారు.

ఆర్టికల 370 మూవీకి శశ్వాంత్ సచ్‍దేవ్ సంగీతం అందించారు. బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్ పతాకంపై జ్యోతి దేశ్‍పాండే, ఆదిత్య ధార్, లోకేశ్ ధార్ నిర్మించారు.

Whats_app_banner