Yami Gautam: త్వరలో తల్లి కానున్న బాలీవుడ్ హీరోయిన్.. గర్భంతో ఉన్నప్పుడు కూాడా షూటింగ్‍-yami gautam and aditya dhar expecting their first child confirmed at article 370 trailer release event bollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yami Gautam: త్వరలో తల్లి కానున్న బాలీవుడ్ హీరోయిన్.. గర్భంతో ఉన్నప్పుడు కూాడా షూటింగ్‍

Yami Gautam: త్వరలో తల్లి కానున్న బాలీవుడ్ హీరోయిన్.. గర్భంతో ఉన్నప్పుడు కూాడా షూటింగ్‍

Yami Gautam - Aditya Dhar: బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ త్వరలోనే తల్లికాబోతున్నారు. ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉన్నారు. ఆర్టికల్ 370 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ఈ విషయాన్ని ఆమె కన్ఫర్మ్ చేశారు.

Yami Gautam: త్వరలో తల్లి కానున్న బాలీవుడ్ హీరోయిన్

Yami Gautam: బాలీవుడ్ స్టార్ నటి, హీరోయిన్ యామీ గౌతమ్, ఆమె భర్త, ఫిల్మ్ మేకర్ ఆదిత్య ధార్ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. వారికి త్వరలో తొలి సంతానం కలగనుంది. యామీ గౌతమ్ ప్రస్తుతం గర్భిణిగా ఉన్నారు. ఆర్టికల్ 370 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (ఫిబ్రవరి 8) జరగగా.. ఆ విషయాన్ని ఇద్దరూ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం యామీ గౌతమ్ ఐదున్నర నెలల గర్భిణిగా ఉన్నారు. ఈ విషయంపై వారిద్దరూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో మాట్లాడారు.

ఆర్టికల్ 370 మూవీలో యామీ గౌతమ్ ప్రధాన పాత్ర పోషించగా.. ఆదిత్య ధార్ నిర్మాతగా ఉన్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు వైట్ డ్రెస్‍పై బ్లేజర్ ధరించి వచ్చారు యామీ. బేబీ బంప్‍తో కనిపించారు.

గర్భిణిగా ఉన్న సమయంలోనూ ఆర్టికల్ 370 సినిమా షూటింగ్‍లో పాల్గొన్నట్టు యామీ గౌతమ్ చెప్పారు. ఆ సమయంలో తన మదిలో చాలా ప్రశ్నలు తలెత్తాయని అన్నారు. “మానసికంగా కుంగిపోయినట్టు అనిపించింది. దీనిపై నేను థీసిస్ రాయగలను. చాలా ప్రశ్నలు తలెత్తాయి. మొదటిది ఎప్పుడైనా సవాలుగానే ఉంటుంది. ఆదిత్య పక్కన లేకపోతే ఏం చేసోదాన్నో కూడా నాకు తెలియదు” అని యామీ గౌతమ్ చెప్పారు.

ఆర్టికల్ 370 మూవీ కోసం కష్టమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు యామీ గౌతమ్ వెల్లడించారు. “ఈ సినిమా కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నా. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. గోప్యంగా నా పరిస్థితిని పర్యవేక్షించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ చిత్రంలో మా బేబీ కూడా భాగమైంది. మా తల్లి ఎలా పని చేశారో నేను చూశా. ఆమె నుంచి కూడా స్ఫూర్తి పొందా” అని యామీ గౌతమ్ చెప్పారు.

సంతోషంగా ఉంది

ఆర్టికల్ 370 చేయడం, ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే బేబీ రానుందని తెలియడం చాలా సంతోషంగా అనిపించిందని యామీ భర్త ఆదిత్య ధార్ అన్నారు. “ఈ చిత్రానికి మా కుటుంబానికి చాలా అనుబంధం ఉంది. నా సోదరుడు, నా భార్య ఉన్నారు. మా బేబీ త్వరలో రానుంది. ఈ సినిమా జరిగిన విధానం, మాకు బేబీ రానుందని తెలియడం ఇలా అద్భుతమైన సమయంగా గడిచింది” అని ఆదిత్య ధార్ చెప్పారు.

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు ప్రధాన అంశంగా ఆర్టికల్ 370 సినిమా రూపొందింది. ఈ చిత్రం ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది. ఎన్ఐఏ అధికారిగా యామీ గౌతమ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఆదిత్య ధార్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ గ్రిప్పింగ్‍గా.. ఆసక్తికరంగా ఉంది.

యామీ - ఆదిత్య పరిచయం అప్పుడే..

ఉరి: సర్జికల్ స్ట్రైక్స్ సినిమా సమయంలో యామీ గౌతమ్, ఆదిత్య ధార్ ప్రేమలో పడ్డారు. ఈ చిత్రంలో యామీ ప్రధాన పాత్ర చేయగా.. ఆదిత్య ధార్ డైరెక్షన్ చేశారు. ఈ మూవీ తర్వాత రెండేళ్లు డేటింగ్ చేసిన ఇద్దరూ.. 2021 జూన్‍లో వివాహం చేసుకున్నారు. ఇక ఇప్పుడు త్వరలో తల్లిదండ్రులు కానున్నారు.