తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mathuvadalara 2 Twitter Review: మ‌త్తు వ‌ద‌ల‌రా 2 ట్విట్ట‌ర్ రివ్యూ - క‌మెడియ‌న్ స‌త్య అస‌లైన హీరో - సీక్వెల్ టాక్ ఇదే!

Mathuvadalara 2 Twitter Review: మ‌త్తు వ‌ద‌ల‌రా 2 ట్విట్ట‌ర్ రివ్యూ - క‌మెడియ‌న్ స‌త్య అస‌లైన హీరో - సీక్వెల్ టాక్ ఇదే!

13 September 2024, 7:43 IST

google News
  • Mathuvadalara 2 Twitter Review: శ్రీసింహా కోడూరి, స‌త్య‌, ఫ‌రియా అబ్దుల్లా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌త్తు వ‌ద‌ల‌రా 2 మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సీక్వెల్ మూవీ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

మత్తు వదలరా 2 ట్విట్టర్ రివ్యూ
మత్తు వదలరా 2 ట్విట్టర్ రివ్యూ

మత్తు వదలరా 2 ట్విట్టర్ రివ్యూ

Mathuvadalara 2 Twitter Review: కీర‌వాణి త‌న‌యుడు శ్రీసింహా కోడూరి, క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన కామెడీ మూవీ మ‌త్తువ‌ద‌ల‌రా 2 శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. 2019లో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని సాధించిన మ‌త్తు వ‌ద‌ల‌రాకు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించింది. మ‌త్తు వ‌ద‌ల‌రా ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

పాజిటివ్ టాక్‌...

మ‌త్తు వ‌ద‌ల‌రా 2 ప్రీమియ‌ర్స్‌కు పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది. చ‌క్క‌టి ఫ‌న్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు రితేష్ రానా ఈ సీక్వెల్‌ను తెర‌కెక్కించాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. చివ‌రి ఇర‌వై నిమిషాల్లో ప్రీ క్లైమాక్స్‌తో పాటు క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్‌లు స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటాయ‌ని అంటున్నారు.

మ‌త్తు వ‌ద‌ల‌రా 2 మూవీకి స‌త్య వ‌న్‌మెన్ షోగా నిలిచాడ‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు యేసుదాసు పాత్ర‌లో స‌త్య అద‌ర‌గొట్టేశాడ‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. స్టార్టింగ్ నుంచి చివ‌రి సీన్ వ‌ర‌కు స‌త్య క్యారెక్ట‌ర్ హిలేరియ‌స్‌గా న‌వ్విస్తుంద‌ని చెబుతోన్నారు. స‌త్య కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచాయ‌ని అంటున్నారు. సినిమాకు అస‌లైన హీరో స‌త్య‌నే అని ట్వీట్స్ చేస్తున్నారు.

స్టార్ హీరోల రిఫ‌రెన్స్‌లు...

ఈ సినిమాలో చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ‌, మ‌హేష్‌బాబు పాటు ప‌లువురు స్టార్ హీరోల రిఫ‌రెన్స్‌లు క‌నిపిస్తాయ‌ని, అవ‌న్నీ ఆయా హీరోల‌ అభిమానుల‌ను మెప్పిస్తాయ‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ రిఫ‌రెన్స్‌ల‌తోనే మ‌త్తు వ‌ద‌ల‌రా 2 ప్రారంభ‌మ‌వుతుంద‌ని, మెగా హీరోల రిఫ‌రెన్స్‌ల‌ను డైరెక్ట‌ర్‌ సినిమాలో వాడుకున్న తీరు బాగుంద‌ని అంటున్నారు.

శ్రీసింహా, ఫ‌రియా అబ్దుల్లా యాక్టింగ్‌, కామెడీ ఆక‌ట్టుకుంటాయ‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. సినిమాలోని ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ ఫ‌న్నీగా, కొత్త‌గా రాసుకున్నాడ‌ని అన్నాడు. మ‌త్తు వ‌ద‌ల‌రాకు ప‌ర్‌ఫెక్ట్ సీక్వెల్ ఇద‌ని అంటున్నారు.

సెకండాఫ్ స్లో...

కిడ్నాపింగ్ డ్రామాతో సినిమా ఇంట్రెస్టింగ్‌గా మొద‌ల‌వుతుంద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. ఫ‌స్ట్ హాఫ్‌ను ఫ‌స్ట్ ఫేజ్‌లో ఫ‌న్ డ్రామాతో టైమ్‌పాస్ చేసిన ఈ మూవీ సెకండాఫ్‌లో మాత్రం బోర్ కొట్టిస్తుంద‌ని అంటున్నారు. సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్ లో ల్యాగ్ ఎక్కువైంద‌ని ఓ నెటిజ‌న్ అన్నాడు. మెయిన్ క్లైమాక్స్ ట్విస్ట్ ప్రెడిక్ట‌బుల్‌గా ఉంద‌ని చెబుతోన్నారు.

తదుపరి వ్యాసం