తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Movies In Otts: ఓటీటీల్లో ఉన్న టాప్ మలయాళం మూవీస్ ఇవే.. మీరు ఎన్ని చూశారు?

Malayalam Movies in OTTs: ఓటీటీల్లో ఉన్న టాప్ మలయాళం మూవీస్ ఇవే.. మీరు ఎన్ని చూశారు?

Hari Prasad S HT Telugu

04 October 2023, 10:30 IST

google News
    • Malayalam Movies in OTT: ఓటీటీల్లో ప్రస్తుత కొన్ని టాప్ మలయాళం మూవీస్ ఉన్నాయి. వాటిలో మీరు ఎన్ని చూశారు? ఈ మధ్య కాలంలో మలయాళ మూవీస్ కు క్రేజ్ పెరుగుతున్న విషయం తెలిసిందే.
ఓటీటీల్లో ఉన్న మలయాళ మూవీస్ ఇవే
ఓటీటీల్లో ఉన్న మలయాళ మూవీస్ ఇవే

ఓటీటీల్లో ఉన్న మలయాళ మూవీస్ ఇవే

Malayalam Movies in OTT: ఓటీటీలు వచ్చిన తర్వాత భాషలకు అతీతంగా ప్రేక్షకులు సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

విభిన్నమైన కథ, కథనం, నటనతో అక్కడి మేకర్స్ ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. మలయాళ నటులు ఫహద్ ఫాజిల్, దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, పార్వతి తిరువొత్తు, అన్నా బెన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లతోపాటు వెటరన్ నటులు మమ్ముట్టి, మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓటీటీల్లో ఉన్న టాప్ మలయాళ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం.

కింగ్ ఆఫ్ కొత్త

దుల్కర్ సల్మాన్ నటించిన ఈ కింగ్ ఆఫ్ కొత్త మలయాళ మూవీ తెలుగులోనూ రిలీజైంది. గ్యాంగ్‌స్టర్ రివేంజ్ స్టోరీ అయిన ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

ఆర్డీఎక్స్: రాబర్ట్ డోనీ జేవియర్

యాక్షన్ లవర్స్ ను బాగా ఆకట్టుకునే మూవీ ఆర్డీఎక్స్. ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. రాబర్ట్, డోనీ అనే ఇద్దరు సోదరులు.. వాళ్ల ఫ్రెండ్ జేవియర్ చుట్టూ తిరిగే కథ ఇది. కేరళలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.

వాయిస్ ఆఫ్ సత్యనాథన్

మంచి కామెడీ డ్రామాను ఇష్టపడే వాళ్లు ఈ వాయిస్ ఆఫ్ సత్యనాథన్ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. సత్యనాథన్ అనే ఓ ఫర్నీచర్ వ్యాపారి నిజాలను వెలికి తీసి అందరికీ చెబుతుంటాడు. అందులో ఒకటి భారత రాష్ట్రపతికి ముప్పుగా పరిణమిస్తుంది. అది అతన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది? అందులో నుంచి అతడు ఎలా బయటపడతాడన్నది సరదాగా చూపించారు. ఈ మూవీ మనోరమ మ్యాక్స్ ఓటీటీలో ఉంది.

ఓటీటీల్లోని మరికొన్ని మలయాళ మూవీస్ ఇవే

జర్నీ ఆఫ్ లవ్ 18+ - సోనీలివ్ ఓటీటీ

ఎన్నివర్ - సైనా ప్లే ఓటీటీ

నల్ల నిలవుల్ల రాత్రి - అమెజాన్ ప్రైమ్ వీడియో

కురుక్కన్ - మనోరమ మ్యాక్స్

తదుపరి వ్యాసం