Guns and Gulaabs Web Series Review: దుల్కర్ సల్మాన్ వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ రివ్యూ.. లాస్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు-dulquer salmans guns and gulaabs web series review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guns And Gulaabs Web Series Review: దుల్కర్ సల్మాన్ వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ రివ్యూ.. లాస్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు

Guns and Gulaabs Web Series Review: దుల్కర్ సల్మాన్ వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ రివ్యూ.. లాస్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు

Hari Prasad S HT Telugu
Aug 21, 2023 02:27 PM IST

Guns and Gulaabs Web Series Review: దుల్కర్ సల్మాన్ నటించిన వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ చూస్తే అదుర్స్ అనాల్సిందే. ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ కావద్దు.

నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్
నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్

Guns and Gulaabs Web Series Review: మలయాళ టాలెంటెడ్ నటుడు దుల్కర్ సల్మాన్. అతనికి బాలీవుడ్ సూపర్ టాలెంటెడ్ రాజ్ కుమార్ రావ్, గుల్షన్ దేవయ్య కలిస్తే ఇక చెప్పేదేముంది. ఇలాంటి నటులను రాజ్ అండ్ డీకేలాంటి డైరెక్టర్లు డైరెక్ట్ చేస్తే ఆ షో సూపర్ హిట్ అనడంలో డౌటే లేదు. నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ అలాంటి మజానే అందించింది.

వెబ్ సిరీస్: గన్స్ అండ్ గులాబ్స్

ఏ ఓటీటీలో..: నెట్‌ఫ్లిక్స్

నటీనటులు: దుల్కర్ సల్మాన్, రాజ్ కుమార్ రావ్, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్

ఎపిసోడ్లు: 7 ఎపిసోడ్లు

డైరెక్టర్లు: రాజ్ అండ్ డీకే

గన్స్ అండ్ గులాబ్స్ స్టోరీ ఏంటి?

గులాబ్‌గంజ్ అనే ఊరు.. అక్కడ లీగల్‌గా, ఇల్లీగల్‌గా ఓపియం పండించే రైతులు, వ్యాపారులు.. ఆ ఓపీయం కోసం రెండు గ్యాంగ్ ల మధ్య నడిచే వార్.. ఈ గ్యాంగ్‌వార్ లోకి ఎంటరయ్యే నార్కోటిక్స్ ఆఫీసర్.. సింపుల్ గా చెప్పాలంటే ఇదీ గన్స్ అండ్ గులాబ్స్ స్టోరీ. అయితే ఆ స్టోరీ చెప్పే విధానంలోనే డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే తమదైన మార్క్ చూపించారు. ఈ సీరియస్ క్రైమ్ కు కామెడీని జోడించి ప్రేక్షకులను అలరించారు.

ఈ స్టోరీ 1990ల్లో జరిగినట్లుగా చిత్రీకరించారు. దీంతో ఆ కాలాన్ని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ మంచి ప్రయత్నమే చేశారు. కుమార్ సాను పాటలు, టేప్ రికార్డర్లు, క్యాసెట్లు, క్యాంపా కోలాలు.. వీటన్నింటినీ చూపిస్తూ సిరీస్ చూసే ప్రేక్షకులను మరోసారి 90ల్లోకి తీసుకెళ్లారు. ఈ సిరీస్ లో నార్కోటిక్స్ ఆఫీసర్ గా దుల్కర్ సల్మాన్ కనిపించాడు. అతనికిదే తొలి వెబ్ సిరీస్.

గులాబ్ గంజ్ లో ప్రభుత్వ, ఔషధ తయారీ అవసరాల మేరకు అక్కడి రైతులు నిషేధిత ఓపీఎం పండిస్తుంటారు. అయితే అదే సమయంలో స్థానికంగా ఉండే ఓ గ్యాంగ్ అక్రమంగా పెద్ద ఎత్తున రైతులతో ఓపీఎం పంట వేయిస్తుంది. వీటిని వెస్ట్ బెంగాల్ కు చెందిన ఓ బడా గ్యాంగ్‌స్టర్ కు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుంటుంది. అదే సమయంలో షేర్‌పూర్ లోని మరో గ్యాంగ్ దీనికి అడ్డుపడుతూ ఉంటుంది.

ఈ గ్యాంగ్ వార్ మధ్యలోకి వచ్చే నార్కోటిక్స్ ఆఫీసర్ (దుల్కర్ సల్మాన్) ఈ ఓపీఎం మాఫియాకు అడ్డుకట్ట వేస్తాడా? ఆ క్రమంలో ఎదురయ్యే ట్విస్టులు ఏంటి? చివరికి ఈ రెండు గ్యాంగ్ వార్లలో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఈ గన్స్ అండ్ గులాబ్స్ స్టోరీ.

గన్స్ అండ్ గులాబ్స్ ఎలా ఉంది?

ప్రైమ్ వీడియోలో ఫ్యామిలీమ్యాన్, ఫర్జీలాంటి అద్భుతమైన సిరీస్ లను అందించిన రాజ్ అండ్ డీకే తొలిసారి నెట్‌ఫ్లిక్స్ కు గన్స్ అండ్ గులాబ్స్ డైరెక్ట్ చేశారు. అయితే ఆ రెండు సిరీస్ ల స్థాయిలో మాత్రం ఈ గన్స్ అండ్ గులాబ్స్ లేదనే చెప్పాలి. ఏడు ఎపిసోడ్ల ఈ సిరీస్ మొదటి మూడు, నాలుగు ఎపిసోడ్లు కాస్త నెమ్మదిగా, బోరింగ్ గానే సాగుతాయి. నాలుగో ఎపిసోడ్ లో ఓ ట్విస్ట్ ఆకట్టుకుంది.

ఇక అసలు సిసలు రాజ్ అండ్ డీకే మార్క్ మాత్రం చివరి ఎపిసోడ్ లోనే కనిపిస్తుంది. ఆ ఎపిసోడ్ మొత్తం ట్విస్టులతోనే సాగుతుంది. ఈ క్రియేటివ్ మేకర్స్ తమదైన రీతిలో కథను చాలా ఇంట్రెస్టింగా మలచడం కనిపిస్తుంది. ఇక క్లైమ్యాక్స్ కూడా మరో సీజన్ రాబోతోందని స్పష్టం చేసింది.

గన్స్ అండ్ గులాబ్స్.. ఎవరెలా నటించారు?

ఈ సిరీస్ కు నటీనటుల నటనే హైలైట్. నార్కోటిక్స్ ఆఫీసర్ పాత్రలో దుల్కర్ సల్మాన్, పానా టిపు అనే అమాయక, గ్యాంగ్‌స్టర్ పాత్రలో రాజ్‌కుమార్ రావ్, చోటా గాంచీ పాత్రలో ఆదర్శ్ గౌరవ్, చార్ కట్ ఆత్మారాం పాత్రలో గుల్షన్ దేవయ్య నటన సూపర్. షోలో కాసేపే కనిపించినా తనదైన ముద్ర వేశాడు సీనియర్ నటుడు, దివంగత సతీష్ కౌశిక్.

షోలో చాలా వరకూ దుల్కర్ సల్మానే కనిపిస్తాడు. అటు రాజ్‌కుమార్ రావ్ కు కూడా మంచి స్క్రీన్ టైమ్ దక్కింది. టాలెంటెడ్ నటుడు గుల్షన్ దేవయ్యకు తగినంత సమయం దక్కకపోయినా.. కనిపించిన ఆకాసేపు కూడా విలక్షమైన నటనతో అలరించాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్.. గతంలో వచ్చిన రాజ్ అండ్ డీకే సిరీస్‌ల రేంజ్ లో కాకపోయినా.. ఎంతోకొంత అలరిస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా చివరి ఎపిసోడ్ మాత్రం మంచి థ్రిల్ ను పంచుతుంది.

సంబంధిత కథనం