RDX Movie Review: ఆర్‌డీఎక్స్ రివ్యూ - ఎలివేషన్స్ పీక్స్ - యాక్షన్ లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా!
RDX Movie Review: మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్‌డీఎక్స్ (రాబర్డ్ డానీ జేవియర్ మూవీ) ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో షేన్ నిగమ్, ఆంటోనీ వర్గీస్, నీరజ్ మాధవ్ హీరోలుగా నటించారు.
RDX Movie Review: ఆర్‌డీఎక్స్(రాబర్డ్ డానీ జేవియర్)... మలయాళంలో (Malayalam) చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. కేవలం 8 కోట్ల బడ్జెట్‌తో రూపొందినఈ సినిమా 80 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. షేన్ నిగమ్, ఆంటోనీ వర్గీస్, నీరజ్ మాధవ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించాడు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మలయాళం మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ (Netflix) ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే...
ముగ్గురు స్నేహితుల కథ...
కొచ్చిలో చర్చి ఉత్సవాలు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించే బాధ్యతను ఫిలిప్ (లాల్) చేపడతాడు. పాల్సన్ అనే వ్యక్తితో పాటు అతడి అనుచురులు ఉత్సవాల్లో గొడవలు సృష్టిస్తారు. ఫిలిప్‌పై దౌర్జన్యం చేస్తారు. ఫిలిప్ కొడుకు డానీ (ఆంటోనీ వర్గీస్) ఆ రౌడీలను చితకబాదుతాడు. డానీపై పగను పెంచుకున్న పాల్సన్ రాత్రిపూట అతడి ఇంటిపై దాడిచేస్తాడు.
ఫిలిప్ తో పాటు డానీ భార్య, అతడి కూతురిని తీవ్రంగా గాయపరుస్తాడు. తన కుటుంబంపై దాడి జరిగిన విజయం తెలిసి ఫిలిప్ మరో కొడుకు రాబర్ట్ (షేన్ నిగమ్) చాలా ఏళ్ల తర్వాత కొచ్చిలో తిరిగి అడుగుపెడతాడు, డానీ, రాబర్ట్ తమ ప్రాణ స్నేహితుడు జేవియర్(నీరజ్ మాధవ్)తో కలిసి పాల్సన్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు?తన కుటుంబానికి, స్నేహితులకు రాబర్ట్ దూరమవ్వడానికి కారణం ఏమిటి?
మినిని (మహిమా నంబియార్) ప్రాణంగా ప్రేమించిన రాబర్ట్ ఆమె ప్రేమను ఎందుకు వదులుకోవాల్సివచ్చింది? పాల్సన్‌తో డానీ, రాబర్ట్‌లకు ఇది వరకే శత్రుత్వం ఉందా? పాల్సన్ గ్యాంగ్ నుంచి తన కుటుంబాన్ని డానీ, రాబర్ట్ ఎలా కాపాడుకున్నారు? ఆర్‌డీఎక్స్(RDX Movie Review) మూవీ కథ.
యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్...
ఆర్‌డీఎక్స్ రొటీన్ రివేంజ్ డ్రామా మూవీ. కానీ టేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌లో నిలబెట్టాడు డైరెక్టర్ నిహాస్ హిదాయత్. హీరోల క్యారెక్టర్స్‌కు సంబంధించిన ఎలివేషన్స్, వారి ఆటిట్యూడ్ పీక్స్‌లో స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు.
కేజీఎఫ్ స్టంట్ మాస్టర్స్ అన్బుఅరివు డిజైన్ చేసిన యాక్షన్ కొరియోగ్రఫీ ఆర్‌డీఎక్స్‌ను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జాతర నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్, విలన్ ను ఫాలో అవుతూ తమకు తెలియకుండా అతడి ఉచ్చులో హీరోలు ఇద్దరు చిక్కుకోవడం, వారిరి జేవియర్ సేవ్ చేసే ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు క్లైమాక్స్ ఫైట్ ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయి.
మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో...
మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ధీటుగా అన్భుఅరివు ఈ సినిమాలోని ఫైటింగ్ సీన్స్‌ను కంపోజ్ చేశారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు ఏ సినిమాలో ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియెన్స్ చూసి ఉండరంటే అతిశయోక్తి కాదు. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఓ పీరియాడికల్ లవ్ స్టోరీని జోడించి రెండు టైమ్ పీరియడ్స్‌లో ఈ సినిమాను(RDX Movie Review) నడిపించారు డైరెక్టర్.
విలన్ గ్యాంగ్ ఎటాక్...
ఫిలిప్‌పై విలన్ గ్యాంగ్ ఎటాక్ చేయడంతోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత జాతరలో పాల్సన్‌తో డానీ గొడవ పడటం, పగతో రగిలిపోయిన పాల్సన్ తన మనుషులతో ఫిలిప్, డానీలపై దాడిచేసే సీన్స్‌తో సినిమా ఇంట్రెస్టింగ్‌గా నడుస్తుంది. ఆ తర్వాత రాబర్డ్ గతం, అతడి లవ్‌స్టోరీతో సినిమా సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లోకి టర్న్ అవుతుంది.
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఆ సన్నివేశాలు కాస్తంత సాగదీసినట్లుగా అనిపిస్తాయి. కొచ్చిలో రాబర్ట్ తిరిగి అడుగుపెట్టడం, ముగ్గురు స్నేహితులు తిరిగి కలవడంతో ఈ సినిమా వేగం అందుకుంటుంది. తన కుటుంబంపై దాడిచేసిన ఒక్కో రౌడీపై డానీ, రాబర్ట్ రివేంజ్ తీర్చుకునే సీన్స్ థ్రిల్లింగ్‌ను పంచుతాయి.
షేన్ నిగమ్...
ముగ్గురు హీరోల్లో షేన్ నిగమ్‌కు క్యారెక్టర్‌కు డైరెక్టర్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అతడి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. స్టైలిష్ లుక్‌తో కనిపించాడు. డానీగా ఆంటోనీ వర్గిస్, జేవియర్‌గా నీరజ్ మాధవ్ కూడా తమ యాక్టింగ్‌తో మెప్పించారు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఈ ముగ్గురు చెలరేగిపోయి నటించారు.
హీరోల తండ్రిగా లాల్, జేవియర్ ఫాదర్‌గా బాబ్ ఆంటోనీ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారు. చివరలో బాబ్ ఆంటోనీ చేసే చిన్న యాక్షన్ ఎపిసోడ్ మెప్పిస్తుంది. . మినిగా మహిమా నంబియార్ సహజ నటనను కనబరిచింది. సామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ ఫీల్‌ను హైలైట్ చేసింది.
RDX Movie Review -యాక్షన్ లవర్స్ మస్ట్ వాచ్ మూవీ...
ఆర్‌డీఎక్స్.. యాక్షన్ లవర్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. కొరియన్ మార్షల్ ఆర్ట్స్ సినిమాను మనం కూడా తీయోచ్చునని ఆర్‌డీఎక్స్‌తో చాటిచెప్పాడు డైరెక్టర్. కథ లో కొత్తదనం లేకపోయినా యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రం థ్రిల్లింగ్‌ను కలిగిస్తాయి.