King of Kotha OTT: ‘కింగ్ ఆఫ్ కొత్త’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ ఖరారు.. డిస్నీ+ హాట్‍స్టార్‌లో..-ott news king of kotha will stream on disney plus hotstar from september 29 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  King Of Kotha Ott: ‘కింగ్ ఆఫ్ కొత్త’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ ఖరారు.. డిస్నీ+ హాట్‍స్టార్‌లో..

King of Kotha OTT: ‘కింగ్ ఆఫ్ కొత్త’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ ఖరారు.. డిస్నీ+ హాట్‍స్టార్‌లో..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 25, 2023 07:44 PM IST

King of Kotha OTT: కింగ్ ఆఫ్ కొత్త సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. ఈ వివరాలను డిస్నీ+ హాట్‍స్టార్ అధికారికంగా ప్రకటించింది.

King of Kotha OTT: అఫీషియల్: ‘కింగ్ ఆఫ్ కొత్త’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ ఖరారు
King of Kotha OTT: అఫీషియల్: ‘కింగ్ ఆఫ్ కొత్త’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ ఖరారు

King of Kotha OTT: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ డిస్నీ+ హాట్‍స్టార్ వెల్లడించింది. గ్యాంగ్‍స్టర్స్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు యంగ్ డైరెక్టర్ అభిలాష్ జోషి. కింగ్ ఆఫ్ కొత్త మూవీలో గ్యాంగ్‍స్టర్‌గా రస్టిక్ లుక్‍లో కనిపించారు దుల్కర్. ఆగస్టు 24న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అందుబాటులోకి రానుంది.

‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి డిస్నీ+ హాట్‍స్టార్ నేడు అధికారికంగా ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 29వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందని వెల్లడించింది. మలయాళంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవడం ఖరారైంది. అయితే, తెలుగు, హిందీ వెర్షన్స్ స్ట్రీమింగ్ విషయంలో డిస్నీ+ హాట్‍స్టార్ క్లారిటీ ఇవ్వలేదు. కింగ్ ఆఫ్ కొత్త సినిమాలో గ్యాంగ్‍స్టర్ రాజు పాత్ర చేశారు దుల్కర్. మాస్ యాక్షన్ లుక్‍లో అదరగొట్టారు.

‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమా సెప్టెంబర్ 22నే స్ట్రీమింగ్‍కు వస్తుందని తొలుత అంచనాలు వినిపించాయి. అయితే అలా జరగలేదు. ఇప్పుడు సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని డిస్నీ+ హాట్‍స్టార్ వెల్లడించింది.

కింగ్ ఆఫ్ కొత్త సినిమాను దుల్కర్ సల్మాన్ స్వయంగా వేఫారర్ బ్యానర్‌ కింద నిర్మించారు. మలయాళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, మిక్స్డ్ టాక్ రావటంతో ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. సుమారు రూ.20కోట్ల వరకు ఈ సినిమా నష్టాలను మూటగట్టుకుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు.

కింగ్ ఆఫ్ కొత్త మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‍గా నటించగా.. డ్యాన్సింగ్ రోజ్ షబ్బీర్, ప్రసన్న, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల సురేశ్, శాంతి కృష్ణ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ చేశారు.

Whats_app_banner