తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nithiin: నితిన్ సినిమాలో ఒక్క ఫైట్‍కు అన్ని కోట్ల ఖర్చా!: వివరాలివే

Nithiin: నితిన్ సినిమాలో ఒక్క ఫైట్‍కు అన్ని కోట్ల ఖర్చా!: వివరాలివే

24 April 2024, 20:26 IST

google News
    • Nithiin - Thammudu Movie: తమ్ముడు సినిమాలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండనునందని తెలుస్తోంది. ఈ ఫైట్‍కు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట మేకర్స్. ఆ వివరాలివే..
Nithiin: నితిన్ సినిమాలో ఒక్క ఫైట్‍కు అన్ని కోట్ల ఖర్చా!: వివరాలివే
Nithiin: నితిన్ సినిమాలో ఒక్క ఫైట్‍కు అన్ని కోట్ల ఖర్చా!: వివరాలివే

Nithiin: నితిన్ సినిమాలో ఒక్క ఫైట్‍కు అన్ని కోట్ల ఖర్చా!: వివరాలివే

Nithiin: యంగ్ స్టార్ హీరో నితిన్ నాలుగేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. 2020లో భీష్మ మూవీ తర్వాత ఆ నితిన్‍కు ఆ రేంజ్ హిట్ రాలేదు. రంగ్‍దే మోస్తరుగా ఆడినా.. మాచర్ల నియోజకవర్గం, గతేడాది ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో సక్సెస్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నితిన్ రెండు చిత్రాలు చేస్తున్నారు. రాబిన్‍హుడ్‍తో పాటు తమ్ముడు సినిమాలోనూ నటిస్తున్నారు. కాగా, తమ్ముడు చిత్రంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఓ సమాచారం బయటికి వచ్చింది.

రూ.8కోట్ల బడ్జెట్‍తో..

తమ్ముడు సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసమే రూ.8కోట్లను ఖర్చు చేస్తున్నారట మేకర్స్. ఈ ఫైట్ సీన్ చిత్రకరణ ప్రస్తుతం జరుగుతోందని సమాచారం బయటికి వచ్చింది. హైదరాబాద్‍లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 10 రోజుల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరగనుంది. సుమారు 50 ఫైటర్లతో ఈ సీక్వెన్స్ రూపొందనుంది.

తమ్ముడు సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఒక్క యాక్షన్ సీక్వెన్స్‌కే రూ.8కోట్లు ఖర్చు చేస్తున్నారంటే.. నితిన్ కెరీర్లోనే భారీ బడ్జెట్‍తో రూపొందే చిత్రంగా తమ్ముడు ఉండొచ్చు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

తమ్ముడు సినిమాలో నితిన్‍కు జోడీగా కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‍గా నటిస్తున్నారు. నటి లాయా ఈ చిత్రంలో నితిన్ చెల్లి పాత్ర చేస్తున్నారు. అక్కను కాపాడుకునేందుకు ఏమైనా చేసే తమ్ముడి స్టోరీతో ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్‍తో పాటు ఎమోషనల్‍గానూ ఉంటుందని తెలుస్తోంది. అజ్నీశ్ లోకనాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

రాబిన్‍హుడ్ ఇలా..

తనకు భీష్మ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో రాబిన్‍హుడ్ చిత్రం కూడా నితిన్ చేస్తున్నారు. ఈ మూవీ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుంది. ఈ చిత్రం డిసెంబర్ 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా విడుదల తేదీని మూవీ టీమ్ ఖరారు చేసింది.

రాబిన్‍హుడ్ చిత్రంలో నితిన్‍కు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఈ మూవీలో కీలకపాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కూడా కీరోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

రాబిన్‍హుడ్, తమ్ముడు తర్వాత 90s వెబ్ సిరీస్ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్‍తో నితిన్ మూవీ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ మూవీ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నట్టు ఆదిత్య తెలిపారు. ఇలా వరుస సినిమాలతో మళ్లీ హిట్ ట్రాక్ పట్టాలని నితిన్ పట్టుదలగా ఉన్నారు.

మరోవైపు, రాబిన్‍హుడ్ చిత్రానికి నాగచైతన్య ‘తండేల్’ సినిమా పోటీగా వచ్చేలా కనిపిస్తోంది. క్రిస్మస్ సెలవులు కలిసి రానుండటంతో తండేల్ మూవీని కూడా డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. దీంతో బాక్సాఫీస్ వద్ద నితిన్, నాగచైతన్య పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తదుపరి వ్యాసం