OTT Crime Thriller: ఒకే రోజు ఓటీటీలోకి...టీవీలోకి వస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ - ట్విస్ట్‌లను ఊహించడం కష్టమే!
27 October 2024, 14:19 IST
OTT Crime Thriller: కోలీవుడ్ సీనియర్ యాక్టర్ ప్రశాంత్ హీరోగా నటించిన అంధగాన్ మూవీ ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. అదే రోజు ఓవర్‌సీస్‌లో ఆస్ట్రో టీవీలో అంధగాన్ మూవీ టెలికాస్ట్ కాబోతోంది.
క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ
OTT Crime Thriller: కోలీవుడ్ హీరో ప్రశాంత్ నటించిన అంధగాన్ మూవీ ఓటీటీలోకి వస్తోంది.ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు అంధగాన్ మూవీ టీవీలోకి రాబోతోంది. ఆస్ట్రో విన్‌మీన్ ఛానెల్‌లో టెలికాస్ట్ కానుంది. అయితే ఈ టీవీ ప్రీమియర్‌ను కేవలం ఓవర్‌సీస్ ఆడియెన్స్‌కు మాత్రమే చూడొచ్చు. అంధాగాన్ ఒకే రోజు ఇండియాలో ఓటీటీలో.. ఓవర్‌సీస్‌లో టీవీలో రిలీజ్ కావడం ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్ మూవీ రీమేక్...
బాలీవుడ్‌లో నేషనల్ అవార్డుతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించిన అంధాధూన్‌కు రీమేక్‌గా అంధగాన్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రశాంత్, సిమ్రాన్, ప్రియా ఆనంద్, సీనియర్ హీరో కార్తీక్ తో పాటు సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తూ ప్రొడ్యూస్ చేశాడు. 2022లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అనివార్య కారణాల వల్ల రెండేళ్లు ఆలస్యంగా థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది.
పది కోట్ల బడ్జెట్...
ఆగస్ట్‌లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ పదిహేను కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
అంధగాన్ కథ ఇదే...
క్రిష్ (ప్రశాంత్_ ఓ పియానిస్ట్. కంటిచూపు బాగానే ఉన్నా అంధుడిగా నటిస్తుంటాడు. జూలీ (ప్రియా ఆనంద్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు క్రిష్. తాను గుడ్డివాడు కాదనే నిజం ఆమెకు చెప్పాలని అనుకుంటాడు. కార్తిక్ (కార్తిక్) అనే హీరో తన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా భార్య సిమి (సిమ్రాన్) కోసం సర్‌ప్రైజ్ పార్టీ అరెంజ్ చేస్తాడు. ఆ పార్టీలో పియానో వాయించడానికి ఒప్పుకున్న క్రిష్...కార్తిక్ ఇంటికివస్తాడు. కానీ అక్కడ కార్తిక్ రక్తపు మడుగులో ఉంటాడు.
శవం కళ్ల ముందే ఉన్నా...అంధుడిగా ఆడుతోన్న నాటకం కారణంగా డెడ్‌బాడీ తనకు కనబడనట్లుగా క్రిష్ మ్యానేజ్ చేస్తాడు. క్రిష్ గుడ్డివాడు కాదని సిమితో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ మనోహర్‌కు (సముద్రఖని) డౌట్‌వస్తుంది. అతడు ఆడుతోన్న నాటకాన్ని నిజం చేస్తూ క్రిష్ కంటిచూపును పొగొడుతుంది సిమి. ఆ తర్వాత ఏమైంది? తాము చేసిన హత్యలను కళ్లారా చూసిన క్రిష్‌ను సిమి, కార్తిక్ ఏం చేశారు? వారి బారి నుంచి తప్పించుకోవడానికి క్రిష్ ఏం చేశాడు అన్నదే ఈ మూవీ కథ.
జీన్స్, జోడితో పాటు...
ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోగా కొనసాగాడు ప్రశాంత్. శంకర్ జీన్స్‌తో పాటు జోడి, మజ్ను లాంటి ప్రేమకథా చిత్రాలతో యువతరం ప్రేక్షకుల్ని మెప్పించాడు తెలుగులోనూ తొలిముద్దు, ప్రేమశిఖరం సినిమాలు హీరోగా ప్రశాంత్‌కు మంచి పేరుతెచ్చిపెట్టాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ప్రశాంత్ రామ్‌చరణ్ వినయవిధేయరామా, దళపతి విజయ్ ది గోట్ సినిమాల్లో కీలక పాత్రలు చేశాడు.