తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial Today: కృష్ణకి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మీరా.. ఆదర్శ్ వల్లే ముకుంద తల్లి అవుతుందన్న భవానీ

Krishna mukunda murari serial today: కృష్ణకి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మీరా.. ఆదర్శ్ వల్లే ముకుంద తల్లి అవుతుందన్న భవానీ

Gunti Soundarya HT Telugu

18 May 2024, 7:56 IST

google News
    • Krishna mukunda murari serial today may 18th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఆదర్శ్ వల్ల ముకుంద తల్లి కాబోతుందని భవానీ అనుమానపడుతుంది. దీని గురించి కృష్ణతో మాట్లాడుతుంది. తనకి టెస్ట్ చేయమని చెప్తుంది. 
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 18వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 18వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 18వ తేదీ ఎపిసోడ్

Krishna mukunda murari serial today may 18th episode: కృష్ణ డల్ గా కూర్చుని ఏదో ఆలోచిస్తుంటే మురారి వచ్చి పలకరిస్తాడు. మనం ఇప్పటికే చాలా టెన్షన్ లో ఉన్నాం మళ్ళీ కొత్త వాటి గురించి ఆలోచించద్దని చెప్తాడు. నీకు మీరా నచ్చదు తను వాంతి చేసుకుంటే నేను చెవులు పట్టుకుంటే నీకు అసలు నచ్చదని అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మురారి చెప్పడానికి చూస్తాడు.

మీరాని అపురూపంగా చూసుకుంటా

నేనేమీ మిమ్మల్ని అపార్థం చేసుకోలేదు. అయినా నేను ఎందుకు అపార్థం చేసుకుంటానని అంటుంది. కారులో లిఫ్ట్ ఇచ్చినందుకు అలా అలిగావు ఈరోజు తన తల పట్టుకున్నాను. భార్య ముందు పరాయి ఆడదాన్ని పట్టుకుంటే ఏ భార్య ఒప్పుకుంటుందని అంటాడు.

తను మన బిడ్డని మోస్తుందని చెప్తాడు. మీరు మన బిడ్డ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఈరోజు చూశాను. మన బిడ్డని మోస్తున్న అమ్మాయిని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మీరా ప్రవర్తన వల్ల లేనిపోని అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను.

ఇప్పుడు నాకు మన బిడ్డ ముఖ్యం. తల్లితో నాకు సంబంధం లేదు. మీరు మాటిచ్చారు కదా ఇప్పుడు మీరాని కూడా బాగా చూసుకుంటాను అపురూపంగా కంటి పాపని చూసుకుంటున్నట్టు చూసుకుంటానని మాట ఇస్తున్నా. తన కడుపులో ఉన్న మన బిడ్డ ఆరోగ్యంగా పెరగాలని చెప్తుంది.

మీరా నెల తప్పింది

భవానీ కృష్ణకి ఫోన్ చేసి మాట్లాడటానికి రమ్మని పిలుస్తుంది. కృష్ణ భయపడుతూ వస్తుంది. మీరా నెల తప్పిందని భవానీ అనేసరికి కృష్ణకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. సరోగసి గురించి తెలుసుకుందేమోనని కృష్ణ టెన్షన్ పడుతుంది. ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పినా అందరికీ చెప్పి హడావుడి చేస్తారు.

మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చిందని కృష్ణ అడుగుతుంది. అనుమానం కాదు కాన్ఫమ్ గా చెప్తున్నా. మనం భోజనం చేసేటప్పుడు వాంతులు చేసుకుంది కదా అప్పుడు ఆదర్శ్ ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా అని అడిగాడు. మీరా నెల తప్పడానికి ఆదర్శ్ కారణం కాదు అసలు ఆ సంగతి ఆదర్శ్ కి తెలియదని కృష్ణ మనసులో అనుకుంటుంది.

మీరాకి టెస్ట్ చెయ్యి

ఇంకా పెళ్లి కాలేదు కదా అంటే పెళ్లి కానట్టు ఉంటున్నారా అని భవానీ అంటుంది. ఏ అనుమానం అయితే రాకూడదని అనుకున్నానో అదే అనుమానం వచ్చిందని కృష్ణ అనుకుంటుంది. కృష్ణ అలాంటిది ఏమి జరగదని నచ్చజెప్పడానికి చూస్తుంది.

అలా డౌట్ వస్తే ప్రెగ్నెన్సీ తెలిసిపోతుంది. సరోగసి ద్వారా వచ్చే బిడ్డ వద్దని చెప్తే బిడ్డ కంటే ఆదర్శ్ తో పెళ్లి ముఖ్యమంటే నా చేతులతో నా బిడ్డని తీసేయాల్సి వస్తుందని కృష్ణ బాధపడుతుంది. నా అనుమానం నిజమై తను నిజంగానే తల్లి కాబోతుందని తెలిస్తే నిన్ను చూసుకున్నట్టే తనని జాగ్రత్తగా చూసుకుంటాను.

టెస్ట్ చేస్తే ఎందుకో పాజిటివ్ వస్తుందని అనిపిస్తుంది. రేపే వెళ్ళి టెస్ట్ చేయమని చెప్తుంది. టెస్ట్ అని తనకు చెప్పొద్దు ఏదో ఒకటి చేసి తెలుసుకోమని అంటుంది. అదంతా మీరా వింటూనే ఉంటుంది. మురారికి విషయం చెప్తుంది. మీరా గర్భవతి అని తెలిసిపోతుంది.

నిజం చెప్పేద్దామన్న కృష్ణ

బిడ్డని వద్దనుకోవాలా అనేసరికి మురారి కంగారుపడతాడు. వద్దని అనుకుంటే నేను ఉంటానా? పరిస్థితులన్నీ అక్కడికే తీసుకెళ్తున్నాయని టెన్షన్ పడుతుంది. టెస్ట్ చేశాను గర్భం లేదని అబద్ధం చెప్పి తప్పించుకోమని చెప్తాడు. ఎంతకాలం ఇలాగా నా గర్భం పోయింది మీకు వారాసులని ఇవ్వాలని సరోగసికి వెళ్లానని చెప్పేస్తానని అంటుంది.

మురారి వద్దని చెప్తాడు. ఈ నరకం అనుభవించడం కంటే అదే మంచిదని అంటుంది. ఇందులో ఆదర్శ్ జీవితం కూడా ముడిపడి ఉంది. ఎప్పుడెప్పుడు మీరాని పెళ్లి చేసుకుంటానని కలలు కంటున్నాడు. ఇప్పుడు అదే మీరా ఒక బిడ్డని కడుపులో మోస్తుందని తెలిస్తే తట్టుకోగలడా అంటాడు.

ముకుంద మిస్సింగ్

ఈరోజు కాకపోతే మూడు నెలల తర్వాత అయినా తెలిసిపోతుంది కదా అంటుంది. ఆదర్శ్ కంగారుగా ముకుందని వెతుకుతూ ఉంటాడు. తనేమైన చిన్న పిల్లా అని భవానీ, రేవతి అంటారు. ఫోన్ చేయవచ్చు కదా అంటే స్విచ్చాఫ్ వస్తుందని చెప్తాడు. మురారి వాళ్ళకి తెలుసు ఏమో కనుక్కోవాలని అనుకుంటాడు.

ఆదర్శ్ చూపిస్తున్న కంగారు చూసి అదంతా ప్రేమ అంతా మంచిదేనని భవానీ వాళ్ళు మురిసిపోతారు. మీరాకి ముందు విషయం చెప్పాలని తను జాగ్రత్త పడుతుందని మురారి అంటాడు. ఆదర్శ్ కంగారుగా ముకుందని చూశారా రాత్రి నుంచి కనిపించడం లేదని చెప్తాడు.

ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్తుందని అంటాడు. ఎవరికీ చెప్పలేదు నాకు చాలా కంగారుగా ఉంది. నాతో పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయిందని అనుకుంటే ఆ ఛాన్స్ లేదు నేనంటే తనకు చాలా ఇష్టం. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నామని అంటాడు.

మా అమ్మని ఇస్తుంది

నందిని ఇంటికి వస్తుంది. వాళ్ళతో పాటు సుమలత, ప్రసాద్ కూడా వస్తారు. ఇల్లంతా సందడిగా ఉంటుంది. నందిని సంతోషంగా కృష్ణని ఎత్తుకుని తిప్పేస్తుంది. నాకు మేనల్లుడిని ఇస్తున్నావా మేనకోడలిని ఇస్తున్నావా అని నందిని కృష్ణని అడుగుతుంది. నాకు మా అమ్మని ఇస్తానని కృష్ణ మాట ఇచ్చిందని భవానీ సంతోషంగా చెప్తుంది.

మురారి, కృష్ణ ఎమోషనల్ గా చూస్తారు. మా అమ్మ కోరిక తీర్చినందుకు థాంక్స్ అంటుంది. ప్రసాద్, సుమలత కంగ్రాట్స్ చెప్తారు. ముకుంద ఇంకా రాలేదు ఏంటని ఆదర్శ్ టెన్షన్ పడతాడు. రేవతి వాళ్ళు ఆట పట్టిస్తారు. అప్పుడే మీరా కృష్ణకి ఫోన్ చేస్తుంది.

మీరా ఎక్కడ ఉన్నావ్ అందరూ నీకోసం కంగారుపడుతున్నారని అడుగుతుంది. మనం ముగ్గురం కలిసిన రెస్టారెంట్ కి రమ్మని అక్కడికి వచ్చాక మాట్లాడుకుందామని చెప్తుంది. మురారిని పిలిచి మీరా ఫోన్ చేసిందని చెప్తుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

తరువాయి భాగంలో..

రెస్టారెంట్ లో ముగ్గురు కలుసుకుంటారు. ఒక లెటర్ కృష్ణకి ఇస్తుంది. అది చూసి కృష్ణ ఏడుస్తుంది. లాగిపెట్టి మీరాని ఒకటి పీకుతుంది. నా బిడ్డని నీ కడుపులో పెంచుతానని మాట ఇచ్చి గర్భం తీయించుకుంటావా అని నిలదీస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం