Krishna mukunda murari serial february 6th: ప్రపోజ్ చేసిన ఆదర్శ్.. ఇష్టం లేదని చెప్పిన ముకుంద, కృష్ణ భయం నిజం కాబోతుందా?
06 February 2024, 7:18 IST
- Krishna mukunda murari serial february 6th episode: ఆదర్శ్ తో క్లోజ్ గా నటించడం నరకంగా ఉందని ముకుంద ఫీల్ అవుతుంది. అటు ఆదర్శ్ మాత్రం రోజు రోజుకీ భార్య మీద ఆశలు పెంచుకుంటూ ఉండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 6వ తేదీ ఎపిసోడ్
Krishna mukunda murari serial february 6th episode: కృష్ణ పంతులు చెప్పినట్టు దేవుడి ముందు హారతి కర్పూరం వెలిగించి కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టుకుంటుంది. ఒక్కసారిగా హారతి ఆరిపోతుంది. దీంతో కృష్ణ భయం మరింత పెరుగుతుంది. గాలికి దీపం ఆరుతుంది కానీ కర్పూరం ఆరుతుందా అని కృష్ణ కంగారుపడుతుంది. భయపడకమ్మ ఏదో చిన్న పరీక్ష కోసం కర్పూరం వెలిగించమని చెప్పాను కానీ ఇది కీడు అని చెప్పలేదని అంటాడు. నీ జీవితంలో ఏదో కీడు జరగబోతుందని చెప్పి నిన్ను ఇంకా భయపెట్టలేనని పంతులు మనసులో అనుకుంటాడు.
మలుపు తిరగబోతున్న కృష్ణ జీవితం
మీరు ఏదో దాస్తున్నారు పంతులు ఇది దేనికి సంకేతం ఏదో జరుగుతుందని కృష్ణ అడుగుతుంది. దేవుడి రాసిన రాతని ఎవరైనా ఎదుర్కోవాల్సిందే భారం దేవుడి మీద వేస్తే ఆయన చూసుకుంటారని పంతులు సర్ది చెప్తాడు. కానీ కృష్ణ మాత్రం మనసుకి సర్ది చెప్పుకోలేకపోతుంది. మనసులో వాటి గురించే ఆలోచిస్తూ దిగులుగా వెళ్ళిపోతుంది. ఈ సంకేతాలు చూస్తుంటే మీ దాంపత్య జీవితానికి ఏదో ఆపద కలగబోతుందని అనిపిస్తుంది. ఈమె జీవితం ఏ మలుపు తిరగబోతుందోనని కంగారుపడతాడు.
ఐలవ్యూ చెప్పిన ఆదర్శ్ షాక్లో ముకుంద
గులాబీ పూలు చేతిలో పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని ఐలవ్యూ అని ప్రపోజ్ చేస్తాడు. ముకుంద షాకై చూస్తుంది. రెస్పాన్స్ లేదేంటి ఐలవ్యూ టూ చెప్పమని అడుగుతాడు. ఆదర్శ్ మళ్ళీ హ్యాపీ వాలంటైన్స్ డే చెప్తాడు. ముకుంద మాత్రం ఫేస్ చిరాకుగా పెడుతుంది. ఇప్పుడు వాలెంటైన్స్ డే ఏంటని అడుగుతుంది. ప్రాక్టీస్ చేస్తున్నాను బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో ఇలాంటివి ఉంటాయి కదా అందుకే ఇలా. ఎలాగైనా మనమే గెలవాలని ఇంట్లో వాళ్ళు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మనమే గెలవాలి. మనం బాగా ప్రాక్టీస్ చేయాలని ఆదర్శ్ చెప్తాడు.
నేను కొన్ని డాన్స్ మూమెంట్స్ కూడా చూశాను ఒకసారి ట్రై చేద్దామా అని ఆదర్శ్ అడుగుతాడు. ఇప్పుడు తనకి డాన్స్ ప్రాక్టీస్ చేసే మూడ్ లేదు. అసలు నాకు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపెట్ చేయాలని లేదు అంటుంది. షాకైన ఆదర్శ్ ఎందుకు లేదు. కాంపిటీషన్ లో మన గతం గురించి మాట్లాడితే నేను ఎక్కడ హర్ట్ అవుతానో అని వద్దని అంటున్నావ్ కదా. నువ్వు నాకోసం ఆలోచించావ్ చూడు అది చాలు మిగతా వాళ్ళు ఏమని అనుకుంటున్నారో నాకు అనవసరం. మనం మన మధ్య దూరాన్ని అధిగమించి ఒకటి అయ్యాం. మనం ఆల్రెడీ బెస్ట్ కపుల్. మనమే గెలుస్తామని ఆదర్శ్ సర్ది చెప్తాడు.
కాంపిటీషన్ లో పార్టిసిపెట్ చేయడం ఇష్టం లేదన్న ముకుంద
నాకు గెలుపు అవసరం లేదు. అసలు నాకు కాంపిటీషన్ లో పార్టిసిపెట్ చేయాలని లేదు అందరి ముందు అలా చెప్పలేక మిమ్మల్ని కారణంగా చూపించానని అంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ ఏమైంది నీకు? నువ్వు మారావాని చెప్తేనే కదా నేను వచ్చాను ఒక్క విషయం చెప్పు నువ్వే కృష్ణ మురారిని పంపించావ్ కదా. మన మధ్య దూరం చెరిగిపోయిందని అనుకుంటే మళ్ళీ ఎందుకు దూరం పెంచుతున్నావ్. నా పక్కన నిలబడి డాన్స్ చేయడం ఇష్టం లేకనే వద్దని అంటున్నావ్ కదా నిలదీస్తాడు.
అదేం లేదు నేను అందరి ముందు డాన్స్ చేయలేను అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. మన కృష్ణ ఉంది తనకిఈ కొత్త పాత ఉండదు. డాన్స్ ఏమైనా చేస్తుంది కానీ నేను అలా కాదు. నాకంటూ ఒక లోకం సృష్టించుకుని అందులోనే బతకడం అలవాటు అయింది. మీరు లేని రెండు సంవత్సరాలు ఒంటరి తనం అలవాటు అయ్యింది. దాని నుంచి బయటకి రావడం చాలా కష్టం. టైమ్ పడుతుంది. ఇలా సడెన్ గా వచ్చి డాన్స్ చేయాలని అంటే కష్టం దయచేసి అర్థం చేసుకోమని అడుగుతుంది.
ఆదర్శ్ ని కన్వీన్స్ చేసిన ముకుంద
బయటకి వెళ్దామని అంటే డస్ట్ అలర్జీ అంటావ్, కాంపిటీషన్ అంటే అందరి ముందు చేయలేను అంటావ్. కానీ ఇవేవి అందరి ముందు చెప్పవు. అక్కడ సైలెంట్ గా ఉండి నా ముందు చెప్తే ఎలాగా?అంటాడు. ఇవన్నీ వాళ్ళ ముందు చెప్తే ఇష్టం లేక సాకుగా చెప్తున్నాను అనుకుంటారని అంటుంది. మీరే ఏదో ఒకటి చెప్పి కాంపిటీషన్ లో మనం పార్టిసిపెట్ చేయడం లేదని అబద్దం చెప్పమని చెప్తుంది.
నేను చెప్తే అనుమానం రాకుండా ఉంటుందా? నేను నీ భుజం మీద చెయ్యి వేస్తే గట్టిగా అరిచి తొండ పడిందని అబద్దం చెప్పావ్ నేను అలాగే చెప్పాల్సి వచ్చింది. దానికి మధుకి నమ్మకం కుదరక తొండ తొండ అంటున్నాడు. ఇప్పుడు కాంపిటీషన్ కి వెళ్ళమని చెప్తే ఏమనుకుంటారో ఏమో అంటాడు. ఏదో ఒకటి చేయమని ఆదర్శ్ ని బతిమలాడుతుంది.
కంగారుగా కృష్ణ
మురారి కృష్ణని తీసుకుని ఫుడ్ తినడానికి వస్తాడు. కృష్ణ మాత్రం జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ డల్ గా ఉంటుంది. గుడికి వెళ్ళి పంతులుని కలిశావ్ కదా ఇంకెందుకు టెన్షన్ అని అడుగుతాడు. ఇంట్లో దీపం ఆరిపోతే గుడిలో ఏకంగా హారతి కర్పూరం కూడా ఆరిపోయిందని భయపడుతూ చెప్తుంది. గాలికి ఆరిపోయిందని మురారి నచ్చజెప్పడానికి చూస్తాడు. సరే నీ భయానికి అర్థం ఉందని ఒప్పుకుంటాను పంతులు ఏమని అన్నాడని అడుగుతాడు.
దేవుడి మీద భారం వేయమని ధైర్యం చెప్పి పంపించారని చెప్తుంది. మనం భార్యాభర్తలుగా ఉంటామని అనుకున్నామా? ముకుందని ప్రేమించాను తనని ఆదర్శ్ కి ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అగ్రిమెంట్ రాసుకున్నాం విడిపోవాలని అనుకున్నాం కానీ అది జరగలేదు కదా. సంతోషంగా ఉందామని అనుకుంటే సమస్యలు కష్టాలు వచ్చాయి. వాటి వల్ల మన బంధం మరింత బలపడింది. ఏదో జరుగుతుందని భయపడే కంటే ఈ క్షణం సంతోషంగా ఉందామని అంటాడు.