తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari February 27th: సా....గుతున్న శోభనం గోల, మళ్ళీ మొదటికొచ్చిన ముకుంద, మురారి ఏం చేయబోతున్నాడు?

Krishna mukunda murari february 27th: సా....గుతున్న శోభనం గోల, మళ్ళీ మొదటికొచ్చిన ముకుంద, మురారి ఏం చేయబోతున్నాడు?

Gunti Soundarya HT Telugu

27 February 2024, 7:12 IST

google News
    • Krishna mukunda murari serial february 27th episode: ఎట్టి పరిస్థితిలోనూ శోభనం జరగకుండా ఆపేయాలని లేదంటే చచ్చిపోతానని ముకుంద మురారిని బెదిరిస్తుంది. అటు శోభనం కోసం ఆదర్శ్ ఆరాటంగా ఎదురుచూస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. 
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 27 వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 27 వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 27 వ తేదీ ఎపిసోడ్

Krishna mukunda murari serial february 27th episode: ఇంటి దగ్గర కృష్ణ మురారి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే ముకుంద ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. వాకింగ్ కి వెళ్లానని చెప్తుంది. అంటే కాలు నొప్పి తగ్గిపోయిందని కృష్ణ అంటుంది. ముకుంద కాఫీ అడిగితే మురారి కోసం తీసుకొచ్చిన కాఫీ కృష్ణ ఇస్తుంది. ఈరోజు మురారి కోసం కలిపిన కాఫీ ఇచ్చావ్ రేపు తనని కూడా ఇవ్వాల్సి వస్తుందేమో, నీకు అన్యాయం చేయాలని నాకు అసలు లేదు. కానీ నాకు ఆదర్శ్ వద్దని చెప్పిన తర్వాత రేపు ఏం జరుగుతుందో చెప్పలేం కదాని మనసులో అనుకుంటుంది.

షాక్ లో ఉండిపోయిన మురారి

మురారితో నిజం చెప్పాక ఎంత ప్రశాంతంగా ఉంది, గుండెల్లో భారం అంతా దింపేసుకున్నాను. ఇక అంతా మురారీనే చూసుకుంటాడని ముకుం సంతోషంగా ఉంటుంది. మురారి ఒంటరిగా నిలబడి ముకుంద మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? అన్ని చక్కబడ్డాయి అనుకుంటే మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ముకుంద మారిపోయిందని కృష్ణ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమైపోతుంది.

సమయానికి పెద్దమ్మ కూడా ఊర్లో లేదు. ఇక్కడ ఎవరితోనైనా చెప్దామంటే చనిపోతానని బెదిరిస్తుంది. తను చనిపోవడం కాదు రేపే మాపో విడుదలై వస్తున్న ప్రభాకర్ మావయ్యకి ఈ విషయం తెలిస్తే ఆయనే చంపేస్తాడు. కృష్ణకి అన్యాయం జరుగుతుందని తెలిస్తే అసలు క్షమించడు. ఏది ఏం జరిగినా కృష్ణకి మాత్రం తెలియకూడదు. నేనే దీనికి పరిష్కారం ఆలోచించాలని అనుకుంటాడు.

కాఫీ షేర్ చేసుకున్న ఆదర్శ్, ముకుంద

ముకుంద దగ్గరకి ఆదర్శ్ వచ్చి పలకరిస్తాడు. శోభనం ముహూర్తంలోగా ఏదో ఒకటి చేసి మురారిని ఆదర్శ్ పంపించేస్తాడు. ఇక నేను ఎందుకు టెన్షన్ పడటం. ఈలోపు ఏదో ఒకటి మ్యానేజ్ చేస్తే సరిపోతుందని అనుకుంటుంది. అంతా ఒకేనా కాలు నొప్పి తగ్గిపోయిందా? అంటే తగ్గిపోయిందని బయటకి వెళ్ళి వాకింగ్ చేసి వస్తున్నానని చెప్తుంది. కృష్ణ కాఫీ తీసుకొచ్చి ఆదర్శ్ కి ఇస్తుంటే ముకుందకి ఇవ్వమని అంటాడు. నేను తాగేశానని ముకుంద అంటే పర్లేదు మళ్ళీ తాగు అంటాడు. దీంతో కృష్ణ ఒకే కాఫీని ఇద్దరూ షేర్ చేసుకోండి, ఎలాగూ పాలు పంచుకుంటారు కదా అంటుంది. కృష్ణ ఎందుకు ఇలా చావగొడుతున్నావ్ గ్యాప్ కూడా ఇవ్వకుండా టార్చర్ చేస్తున్నావని ముకుంద తిట్టుకుంటుంది.

ఆదర్శ్ ఎంగిలి కాఫీ పొరపాటున కూడా తాగకూడదని అనుకుంటుంది. ఆదర్శ్ తో బాగానే ఉంటుంది మరి శోభనం అంటే ఎందుకు తప్పించుకుంటుందని కృష్ణ అనుమానపడుతుంది. ఆదర్శ్ ఇంటి బయట నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంట్లో నుంచి రేవతి, అప్పుడే ఇంటికి వచ్చిన మురారి తన మాటలు వింటారు. మూడు రోజులు శోభనం కదా బయటకి రావడం కుదరదని ఆదర్శ్ తన ఫ్రెండ్ తో ఫోన్లో చెప్తూ ఉంటాడు.

ముకుంద మనసు మార్చాలని డిసైడ్ అయిన మురారి

ఆదర్శ్ ఆశలు పెంచుకుంటున్నాడు మధు ఏమో అసలు ముకుందకి ఆదర్శ్ అంటే ఇష్టం లేదని అంటున్నాడు ఏం జరుగుతుందోనని రేవతి కంగారుపడుతుంది. ఆదర్శ్ నువ్వు ముకుందని ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థం అవుతుంది. రెండేళ్ల తర్వాత నిన్ను ఇంటికి తీసుకొచ్చింది నీ జీవితం చక్కదిద్దటానికి అంతే కానీ తిరిగి మంచు కొండల్లోకి పంపించడానికి కాదు. ఏదో ఒకటి చేసి ముకుంద మనసు మార్చి నీ లైఫ్ సెటిల్ అయ్యేలా చేస్తాను. నిన్ను మాత్రం ఈ ఇంటికి దూరం కానివ్వనని మురారి ఫిక్స్ అవుతాడు.

నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? లేదు నాప్రేమ కోసం ఆలోచిస్తూ దాన్ని గెలిపించుకోవడం తప్పు ఎలా అవుతుంది. అందరి కోసం ఆలోచిస్తూ నాకు నేను అన్యాయం చేసుకుంటున్నాను అది తప్పు అవుతుంది. నేను మురారితో అలా మాట్లాడటం తప్పు కాదు. కానీ మురారి ఏం చేయబోతున్నాడు నా మాట విని ఆదర్శ్ ని పంపించేస్తాడు కదా. నేను పట్టుబడితే ఎలా ఉంటుందో తనకి బాగా తెలుసు. ఏది ఏమైనా నేను పట్టువదలకూడదు అలా చేస్తే మురారిని వదులుకున్నట్టేనని ముకుంద అనుకుంటుంది. ఆదర్శ్ వచ్చి తన ఫ్రెండ్ ఫోన్ చేశాడు రేపు వస్తున్నాడు కదా రమ్మని పిలుస్తున్నాడని అంటే వెళ్ళమని ముకుంద సంతోషంగా చెప్తుంది.

శోభనం ఎగ్జైట్ మెంట్ లో ఆదర్శ్

ఏం చెప్తున్నావ్ రేపు మన శోభనం కదా ఎలా వెళ్తాను. అక్కడ ఫ్రెండ్ తో తాగేసి ఉంటే శోభనం ఇష్టం లేక ఉండిపోయానని అనుకుంటారు. తాగేసి అక్కడే పడిపోతే బాగుండేది మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందేనని ముకుంద డిసప్పాయింట్ అవుతుంది. ఏంటి అలా డిసప్పాయింట్ అయ్యావ్ నేను నిన్ను కన్వీన్స్ చేసి మందు తాగడానికి వెళ్తానని అనుకుంటున్నావా? అలా అసలు చేయను పాల గ్లాసు పట్టుకునే చేతితో మందు గ్లాసు ఎలా పట్టుకుంటాను అని కాసేపు శోభనం గురించి ముచ్చట పెడతాడు. నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చినా తన దగ్గరకి నేను వెళ్ళడం లేదు నాకు నువ్వే ముఖ్యమని అంటాడు. నీకు దూరంగా ఉన్న ఈ రెండు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలియదు కానీ నీకు దూరంగా రెండు రోజులు ఉండటం మాత్రం కష్టంగా ఉందని చెప్తాడు.

ఈయన ఎప్పుడు క్షణాలు వస్తాయా అని ఎదురుచూస్తున్నాడు. నేను ఎప్పుడు ఈయన దూరం అవుతాడా అని ఆలోచిస్తున్నాను. మురారి తొందరగా ఏదో ఒకటి చెయ్యి అని కోరుకుంటుంది. నీ జీవితంలో కృష్ణ తప్ప ఎవరూ ఉండరని ముకుంద చెప్పిన మాటలు మురారి గుర్తు చేసుకుంటాడు.

తరువాయి భాగంలో..

మురారి శోభనం ఆపడానికి ప్లాన్ చేస్తున్నావ్ కదాని ముకుంద అడుగుతుంది. ఆదర్శ్ ని ఇంట్లో నుంచి పంపించేస్తున్నావ్ కదా, కృష్ణకి ఎలాగో సర్ది చెప్పేసి మనం ఒకటి అయిపోదాం. నన్ను మరొక మనిషికి దగ్గర చేస్తుందంటే నీ నుంచి నన్ను శాశ్వతంగా దూరం చేస్తుందంటే అది నా వల్ల కాదు అందుకే ఈ మౌనం వీడుతున్నాను. నాకు నచ్చింది జరగాలని డిమాండ్ చేస్తున్నానని ముకుంద అంటుంది. వీళ్ళ మాటలు కృష్ణ విన్నట్టు చూపించారు. కానీ నిజంగా విన్నదో లేదో తెలియాలంటే రేపటి వరకు ఎపిసోడ్ చూడాల్సిందే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం