తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari February 22nd Episode: రంగంలోకి దిగిన కృష్ణ.. ఇక ముకుంద పని అవుట్, మళ్ళీ శోభనానికి ఏర్పాట్లు

Krishna mukunda murari february 22nd episode: రంగంలోకి దిగిన కృష్ణ.. ఇక ముకుంద పని అవుట్, మళ్ళీ శోభనానికి ఏర్పాట్లు

Gunti Soundarya HT Telugu

22 February 2024, 7:21 IST

google News
    • Krishna mukunda murari serial february 22nd episode: ముకుంద ఆడుతున్న నాటకం గురించి ఎలాగైనా తెలుసుకునేందుకు కృష్ణ రంగంలోకి దిగుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. 
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 22 వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 22 వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 22 వ తేదీ ఎపిసోడ్

Krishna mukunda murari serial february 22nd episode: ముకుంద, ఆదర్శ్ కారులో దూరంగా కూర్చునేసరికి దగ్గరకి తీసుకోమని కృష్ణ చెప్తుంది. ఒకటి తప్పించుకోవాలని చూస్తే ఇంకొకటి వస్తుంది. ఈ నాటకం ఇలా కంటిన్యూ చేయక తప్పదని ముకుంద మనసులో అనుకుంటుంది. ఆదర్శ్ ముకుంద పక్కకి జరిగి కూర్చుంటాడు. కాసేపు ఆదర్శ్ భుజం మీద తలవాల్చి రిలాక్స్ అవమని చెప్తుంది. ఇక నుంచి ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూనే ఉంటాను ముకుంద నీ మనసు ఆలోచనలు ఏంటో నేను తెలుసుకోవాలని కృష్ణ మనసులో అనుకుంటుంది.

ముకుంద ఎందుకు నటిస్తుంది?

రేవతి మధు మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మధు వచ్చి కాఫీ ఇస్తాడు. ముకుంద గురించి ఆలోచిస్తూ ఉన్నట్టు ఉన్నావ్ కదా ఏది జరిగితే అదే జరుగుతుందని అంటాడు. ముకుందకి ఆదర్శ్ అంటే ఇష్టం లేదు మురారి కావాలంటే ఇచ్చేస్తామా అన్ని అడుగుతాడు. అది ఎలా కుదురుతుందని చెప్తుంది. కుదరదు కదా ముకుంద తన మనసు మార్చుకుని ఆదర్శ్ తో బతకాలి. లేదంటే తను తప్పు చేస్తున్నట్టే అప్పుడు తప్పు చేసిన వాళ్ళు మాత్రమే శిక్ష అనుభవించాలని చెప్తాడు. మన అనుమానాలు నిజం కాకూడదని కోరుకోవడం తప్ప ఏమి చేయలేమని అంటుంది.

ఆదర్శ్ తో బాగానే ఉంది కదా అతనంటే ఇష్టం లేకపోతే అంత ప్రశాంతంగా తల వాల్చి ఎలా నిద్రపోతుంది. మరి ఇష్టం ఉంటే కాలు నొప్పి అని చెప్పి శోభనం ఎందుకు ఆపింది. ఏమి అర్థం కావడం లేదని కృష్ణ ఆలోచిస్తుంది. ఒక్కోసారి ఆదర్శ్ ఇష్టం ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి ఆదర్శ్ తో తప్పక పక్కన ఉంటునట్టు అనిపిస్తుంది. ఏది నిజం ముకుంద మారిందా? మారినట్టు నటిస్తుందా అనుకుంటుంది. ఇక ఇలాగే నటించడం నా వల్ల కాదు ఒకసారి తప్పించుకున్నా మరొకసారి దొరికిపోతున్నాను. ఆదర్శ్ ని తీసుకొస్తామంటే మౌనంగా ఉండి తప్పు చేశాను ఏమో అప్పుడే వద్దని చెప్పి ఉండాల్సిందని ముకుంద అనుకుంటుంది.

ముకుంద నాటకం గురించి నోరు జారిన కృష్ణ 

ఆదర్శ్ ని తీసుకొస్తామంటే ఎందుకు మౌనంగా ఉంది అప్పుడే ఇష్టం లేదని చెప్పవచ్చు కదా. ఇప్పుడు ఈ దెబ్బ తగిలినట్టు నాటకం ఆడేవరకు నాకు ఎలాంటి అనుమానం రాలేదు. అసలు ఎందుకు ఈ నాటకం ఎలా ఆడింది శోభనం నుంచి తప్పించుకోవడానికేనా కృష్ణ అనుకుంటుంది. శోభనం ఇప్పుడు తప్పించుకున్నా ఇంటి దగ్గర తప్పించుకోలేను. ఆదర్శ్ ని నా జీవితంలో నుంచి వెళ్లిపోయేలా చేయాలని ముకుంద అనుకుంటుంది. కృష్ణ, ముకుంద మౌనంగా ఉండేసరికి అంత సీరియస్ గా ఏం ఆలోచిస్తున్నారని ఆదర్శ్ అడుగుతాడు. నేను ముకుంద గురించి ఆలోచిస్తున్నాను అసలు తనకి కాలు నొప్పి లేదని నోరు జారి అనేస్తుంది. దీంతో షాక్ అవుతారు. తర్వాత మళ్ళీ అదేం లేదు రేపటికి తగ్గిపోతుందని కవర్ చేస్తుంది.

శోభనం కోసం ఎంతో ఆలోచించి డెకరేట్ చేయించి జరగనందుకు ఎంత బాధపడుతుంది. నువ్వేం బాధపడకు శోభనానికి మంచి ముహూర్తం పెట్టుకుందామని కృష్ణ చెప్తుంది. మళ్ళీ శోభనం పెట్టేలోపు ఆదర్శ్ కి నిజం చెప్పేస్తే తనే ఇంట్లో నుంచి వెళ్లిపోతాడని ముకుంద ప్లాన్ చేస్తుంది. రేవతి మురారి వాళ్ళ కోసం ఇంటి దగ్గర టెన్షన్ గా ఎదురుచూస్తుంటే కృష్ణ వాళ్ళు వస్తారు. ముకుందని ఆదర్శ్ పట్టుకుని తీసుకొస్తాడు. కాలికి ఏమైందని రేవతి కంగారుగా అడుగుతుంది. ప్రేమ ఎక్కువై దెబ్బ తగిలిందని కృష్ణ వెటకారంగా అంటుంది. జరిగింది చెప్పి పాపం ఆదర్శ్ కోసం దెబ్బ తగిలించుకుందని చెప్తుంది. ఇది అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని మధు డౌట్ గా అడుగుతాడు. కనీసం వచ్చేటప్పుడు అయినా ముకుంద ఆదర్శ్ తో ఉందా లేదంటే కృష్ణ పక్కనే ఉందా అని వెటకారంగా అడుగుతాడు.

శోభనం ఏర్పాట్లు చేయించే ఆలోచనలో కృష్ణ 

మురారి చివాట్లు పెడతాడు. ఏదేదో చెప్పి భయపెట్టావ్ ముకుంద వాళ్ళు బాగానే ఉన్నారు కదాని రేవతి అంటుంది. నాకు అయితే వాళ్ళ మీద నమ్మకం లేదు నువ్వు కూడా ముకుందని ఒక కంట కనిపెట్టి ఉండటం మంచిదని చెప్తాడు. కృష్ణ గదిలో ముకుంద గురించి ఆలోచిస్తుంది. ముకుంద ఆదర్శ్ తో మాట్లాడే తీరు చూస్తుంటే అసలు అనుమానం రావడం లేదు. మురారి తన మనసులో ఉంటే ఆదర్శ్ తో అంత క్లోజ్ గా ఉండదు కదా. రాత్రి తగలని దెబ్బకి ఎందుకు అంతగా నటిస్తుంది. తన శోభనం చెడగొట్టి మా శోభనం చెడగొట్టడానికి నాటకం ఆడినట్టు అనిపిస్తుంది. రాత్రి ఈ విషయం అడగాలని అనుకున్నా కానీ తను మారితే నేను అడిగిన దానికి ఫీల్ అవుతుంది. పెద్దత్తయ్య కూడా ఇదే విషయంలో అనుమానంగా ఉందా? అందుకే నమ్మడం లేదా అని ఆలోచిస్తూ ఉండగా మురారి వచ్చి ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు.

ఎప్పుడు శోభనం ముహూర్తం పెట్టినా ఏదో ఒకటి అడ్డు వస్తుందని మురారి అంటాడు. ఏ ముహూర్తం చూడకుండా ఎప్పుడు పడితే అప్పుడు చూస్తే ఇలాగే జరుగుతుందని కృష్ణ అంటుంది. దీని గురించి ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. ముకుంద, ఆదర్శ్ ని ఎలా ఒకటి చేయాలా అని ఆలోచిస్తున్నానని చెప్తుంది. మంచి ముహూర్తం పెట్టి ఆదర్శ్ వాళ్ళకి శోభనం ఏర్పాటు చేయిద్దామని అంటుంది. రేపటి ఎపిసోడ్లో కృష్ణ మళ్ళీ శోభనానికి ముహూర్తాలు పెట్టిస్తుంది. అయితే ఈ ముహూర్తం ఆదర్శ్, ముకుంద జంటకి మాత్రమే ఉందని పంతులు చెప్తాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం