తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukund Murari April 12th: లెటర్ చూసేసిన ఆదర్శ్.. ముకుందకు షాక్ ఇచ్చిన భవానీ, మురారి కృష్ణ గిల్లికజ్జాలు

Krishna mukund murari april 12th: లెటర్ చూసేసిన ఆదర్శ్.. ముకుందకు షాక్ ఇచ్చిన భవానీ, మురారి కృష్ణ గిల్లికజ్జాలు

Gunti Soundarya HT Telugu

12 April 2024, 8:05 IST

google News
    • Krishna mukund murari serial april 12th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కృష్ణకి భవానీ రాసిన లెటర్ చూసి ముకుంద రగిలిపోతుంది. దాన్ని కోపంగా చింపేయడం ఆదర్శ్ చూస్తాడు. ఏం లెటర్ అని ముకుందని అడుగుతాడు. 
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 12వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 12వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 12వ తేదీ ఎపిసోడ్

Krishna mukund murari serial april 12th episode:  శ్రీనివాస్ ఇల్లుని అమ్మేస్తాడు. వడ్డీ వ్యాపారి ఇల్లు ఎందుకు అమ్ముతున్నారని అడుగుతాడు. మీ అమ్మాయి తిరిగిన ఇల్లు కదా జ్ఞాపకంగా ఉంచుకోకుండా ఎందుకు అమ్మేస్తున్నారని అంటాడు. అమ్మాయి చనిపోయిందని పొద్దాక అంటుంటే శ్రీనివాస్ సీరియస్ అవుతాడు.

నా ప్రేమ పట్టించుకోలేదు

ముకుందకు ఫోన్ చేసి విషయం చెప్పాలని చూస్తాడు. లిఫ్ట్ చేసి తండ్రి మీద అరుస్తుంది. అవసరం అయితే నేనే ఫోన్ చేస్తాను అప్పటి వరకు చేయవద్దని చెప్పి తిట్టి పెట్టేస్తుంది.కృష్ణ హడావుడిగా ఏదో వెతుకుతూ ఉంటుంది. ఏం వెతుకుతున్నావని మురారి అంటాడు. తన మీద చిరాకు పడుతుంది.

మురారి కృష్ణకి చక్కిలిగిలి పెడతాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం ముకుంద చూస్తుంది. ప్రేమిస్తున్నానని చెప్పి ఎంత వెంట పడ్డాను అసలు పట్టించుకోలేదు. ఈవిడ కొంచెం చిరాకుపడితే చాలు నవ్వించడానికి తెగ తంటాలు పడుతున్నాడని తిట్టుకుంటుంది.

తల్లి కావాలని కోరుకున్న కృష్ణ

కృష్ణ తగలడంతో టేబుల్ మీద ఉన్న కొన్ని పేపర్స్ కిందపడిపోతాయి. వాటిలో భవానీ రాసిన లెటర్ కనిపిస్తుంది. నువ్వు అమ్మవి అయితే చూడాలని ఉందని భవానీ రాసిన లెటర్ చూసి తప్పకుండా తల్లిని అవుతాను మనవడినో, మనవరాలినో ఇచ్చి మిమ్మల్ని సంతోషపెడతానని అనుకుంటుంది. అత్తయ్యతో చెప్పి శోభనానికి ఏర్పాట్లు చేయించాలని అనుకుంటుంది.

ఆ లెటర్ ముకుంద చూసి రగిలిపోతుంది. రేవతి కృష్ణని పిలుస్తుంది. ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయాయి కదా అంటూ శోభనం గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతూ సిగ్గు పడుతూ మెలికలు తిరిగిపోతుంది. రేవతి కృష్ణ బిహేవియర్ చూసి గాలి తీసేస్తుంది. హాస్పిటల్ కి వెళ్లాలని అనుకుంటున్నావ్ కదా వెళ్ళు అని రేవతి అంటుంది.

మురారి నా బిడ్డకే తండ్రి

కృష్ణ కోపంగా అది కాదని సీరియస్ అవుతుంది. బుర్ర పెట్టి ఆలోచించండని అంటుంది. తనని అర్థం చేసుకోవడం లేదని కృష్ణ రేవతిని తెగ తిట్టేస్తుంది. కోడలి కడుపు పండితే చూడాలని ఆశగా లేదా అని అసలు విషయం చెప్పేస్తుంది. ఇదా నువ్వు చెప్పాలని అనుకుంటుందని రేవతి భవానీతో ముహూర్తం గురించి మాట్లాడతానని అంటుంది.

ముకుంద కోపంగా లెటర్ చూస్తూ తల్లి అవుతుందా? ఈవిడ తల్లి అయితే తండ్రి ఎవరు? మురారి కదా. నో మురారి నా బిడ్డకు మాత్రమే తండ్రి కావాలి. మురారి నీడ కూడా కృష్ణ మీద పడనివ్వను. అయినా తల్లి కావాలంటే ముందు శోభనం జరగాలి కదా. ఒకటి కాదు వంద సార్లు ముహూర్తాలు పెట్టినా జరగకుండా చెడగొట్టేస్తాను. నిన్ను బిడ్డకు తల్లిని కానివ్వనని అనుకుంటుంది.

దొరికిపోయిన ముకుంద

ముకుంద కోపంగా లెటర్ చింపేయడం ఆదర్శ్ చూస్తాడు. ఏమైంది ఏదో లెటర్ ని చింపేస్తున్నావని ఆదర్శ్ అడుగుతాడు. ఏదో పాత లెటర్ అని కవర్ చేస్తుంది. లెటర్ అంత కోపంగా కసిగా చింపేశావ్ ఏంటని అంటాడు. కోపం ఏమి లేదని కవర్ చేసేందుకు చూస్తుంది.

ఆదర్శ్ చింపేసిన లెటర్ ముక్క ఒకటి తీస్తాడు. అందులో కృష్ణ అని కనిపిస్తుంది. కృష్ణ గురించి రాసి ఉంది ఏంటని అంటాడు. దొరికిపోయానని టెన్షన్ పడుతుంది. అది ముకుంద నాకు రాసిన ఉత్తరమని చెప్తుంది. ఈ లెటర్ లో కృష్ణ గురించి రాసింది. తను చేసిన దురాగతాలన్నీ రాసింది. అది చదవగానే కన్నీళ్ళు ఆగలేదు కృష్ణ మీద కోపం ఆగలేదు. ఆ కోపంతోనే లెటర్ చింపేశాను.

మురారి కృష్ణ గిల్లీకజ్జాలు

ఒక ఆడదానిగా ఇంత అన్యాయం ఎలా చేస్తారని డ్రామా వేస్తుంది. పాపం ముకుంద ఎంత నరకం అనుభవించిందో అది తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుందని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఆదర్శ్ కృష్ణ మీద కోపంతో రగిలిపోతాడు. రేవతి భవానీ దగ్గరకు వచ్చి కృష్ణ వాళ్ళ శోభనం గురించి మాట్లాడుతుంది.

ముకుంద గురించి ఆలోచిస్తూ కృష్ణ తన జీవితంలో సంతోషం లేకుండా చేసుకుంది. ఇప్పటికైనా వాళ్ళని ఒక్కటి చేస్తే మనవడిని మనవరాలిని ఇస్తారని సుమలత అంటుంది. భవానీ కృష్ణ, మురారి వాళ్ళని పిలవమని చెప్తుంది. కాసేపు కృష్ణ, రేవతి పోట్లాడుకుంటారు. కృష్ణ, మురారి కాసేపు గిల్లిగజ్జాలు ఆడుకుంటారు. అటు ఇటూ పరిగెడుతూ ముకుంద చుట్టూ తిరుగుతారు.

తరువాయి భాగంలో..

ఇప్పటికైనా మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఏ స్వార్థం లేకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకోమని భవానీ కృష్ణకు చెప్తుంది. పంతులుకు ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టిద్దామని రేవతి అంటే అవసరం లేదని భవానీ అంటుంది. ముహూర్తం పెట్టిన ప్రతిసారి ఏదో ఒక సమస్య. ఎప్పుడో భార్యాభర్తలు అయిన మీరు ఈరోజు నుంచి నిజమైన భార్యాభర్తలుగా మలుచుకోండని చెప్పడంతో కృష్ణ, మురారి సంతోషపడతారు. ముకుంద కోపంగా చూస్తూ ఉంటుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం