NNS 20th March Episode: అమర్, మనోహరి వివాహానికి ముహూర్తం పెట్టిన పూజారి.. అరుంధతి ఫొటోను మిస్సమ్మ చూస్తుందా?
Nindu Noorella Savasam 20th March Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్‍లో అమర్, మనోహరి వివాహాన్ని ఆపాలని మిస్సమ్మ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ సీరియల్‍లో నేటి ఎపిసోడ్‍లో ఏం జరగనుందంటే..
NNS 20th March Episode: జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. నేటి ఎపిసోడ్ (మార్చి 20)లో ఈ సీరియల్‍లో ఏం జరగనుందో ఇక్కడ తెలుసుకోండి. భాగమతికి తన గురించి నిజం తెలిసిపోయిందని తెలుసుకున్న మనోహరి తన దారికి అడ్డు రావద్దని బెదిరిస్తుంది. తాను ఉండగా ఎట్టి పరిస్థితుల్లో అమర్ కుటుంబంలో మనోహరిని అడుగుపెట్టనివ్వనని ఛాలెంజ్ చేస్తుంది భాగమతి (మిస్సమ్మ). గుడి నుంచి ఇంటికి వచ్చిన మిస్సమ్మ.. మనోహరిని అడ్డుకోడానికి అరుంధతిని సహాయం కోరుతుంది. “నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నన్నే సహాయం అడుగుతున్నావా మిస్సమ్మ” అని అరుంధతి మనసులో అనుకుంటుంది.
జాతకాలు కలిశాయన్న పూజారి
అమర్, మనోహరి జాతకాలు బాగా కలిశాయని పెళ్లి ముహూర్తం పెట్టేందుకు వచ్చిన పూజారి చెబుతారు. “అయ్యా జాతకాలు బేషుగ్గా కలిశాయి. అచ్చం మీ పెద్ద కోడలు అరుంధతి జాతకం ఉన్నట్టే ఈ (మనోహరి) జాతకం కూడా ఉంది” అని పంతులు అంటారు. “మనోహరి, అరుంధతి అక్కాచెల్లెళ్లు కాదు కదా.. పంతులుగారు అలా ఎలా ఒకలా ఉంటాయి” అని అమరేంద్ర అంటాడు. “తెలియదు బాబు కానీ జాతక మాత్రం బ్రహ్మాండంగా అలాగే ఉంది” అని అంటారు పంతులు. “ఈ ఇంటికి రాబోయే కోడలు జాతకం అచ్చు అరుంధతి జాతకంలాగే ఉంది. ఈ ఇంటిని ఈ ఇంట్లో ఉండే పిల్లలను తన పిల్లలాగే చూసుకుంటుంది. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కష్టం రాకుండా కాపరి అవుతుంది” అని పూజారి చెబుతాడు. అయితే మనోహరి మాత్రం “నేను ఈ ఇంటి కోడలు అయిన తర్వాత ఇవన్నీ చేయాలనుకోలేదు కదా పంతులు ఏంటి ఇలా చెప్తున్నాడు” అని మనసులో అనుకుంటుంది.
నాలుగు రోజుల్లో ముహూర్తం
అయితే కచ్చితంగా మళ్లీ మా ఇంటికి మా అరుంధతే రాబోతుందా? అంటాడు అమర్ తండ్రి శివరామ్. “అవును అరుంధతి ప్రతిరూపమే ఈ ఇంటి కోడలుగా రాబోతుంది. అది కూడా ఆవిడ సంకల్పబలంతోనే ఆవిడ ఆశీస్సులతోనే ఈ పెళ్లి జరుగుతుంది” అని అంటాడు పంతులు. ఈ ఇంటి కోడలి గురించే కదా చెప్తున్నారని అడుగుతుంది మనోహరి. అవునమ్మా.. అంటున్న పంతులుతో ఈ ఇంటికి కాబోయే కోడలు తానే అంటుంది. పంతులు పెళ్లి ఎప్పుడు పెట్టుకోవాలో చెబితే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటాం అంటుంది నిర్మల. ఇంకో 4 రోజుల్లో ముహూర్తం ఉందని పూజారి చెప్పడంతో.. మనోహరి ఆ ముహూర్తమే ఓకే చేయండి అని చెబుతుంది. దీంతో అందరూ అదే ముహూర్తం ఓకే చేస్తారు.
ఫొటో తీసేయడం
ఇంతలో గుప్త ఇంట్లోకి లోపలికి పరిగెత్తుకొస్తాడు. తనని చూసి ఆశ్చర్యపోయిన అందరినీ చూసి “నేనే మీ తోటమాలిని” అంటాడు. “ఏంటయ్యా నువ్వు ఈ వేషం వేసుకున్నావు అయినా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు నువ్వు” అంటాడు శివరామ్. “అదే నేను ఇందాకన్నుంచి అరుస్తున్నాను సార్. తను ఇష్టం వచ్చిన్నప్పుడు వచ్చి ఇష్టం లేనప్పుడు వెళ్లిపోతే ఎలా సార్” అంటాడు రాథోడ్. “అయినా నీకు ఇంట్లో ఏం పని వెళ్లు బయటకి.. ఫస్ట్ ఆ గెటప్ తీసేవరకు జనాలకు కనిపించకు వెళ్లు” అంటుంది మనోహరి. “నాకొక చిన్న సందేహం అండి. పంతులును అడిగి సమాధానం తెలుసుకునేందుకు వచ్చాను” అంటూ పెళ్లి జరిగే ఈ ఇంట్లో అరుంధతి ఫోటో ఉండటం మంచిదేనా అని గుప్త అడగడంతో పంతులు ఏమీ కాదని చెప్తాడు. బయట అరుంధతితో మాట్లాడుతున్న మిస్సమ్మ లోపలికి వెళ్తుంది. అదిచూసిన మనోహరి, అరుంధతి, గుప్త టెన్షన్ పడుతుంటారు. ఇంతలో మిస్సమ్మకు ఫోన్ రావడంతో బయటే ఆగిపోతుంది. దీంతో గుప్త, మనోహరి, అమర్ కు కొన్ని సెంటిమెంట్ మాటలు చెప్పి ఫోటో తీయడానికి ఒప్పిస్తారు. దీంతో లీల.. అరుంధతి ఫోటో తీసుకుని లోపలికి వెళ్తుంది. మిస్సమ్మ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అందరూ వెళ్లిపోతారు.
మళ్లీ వార్నింగ్
“ఇందాకా నాతో చాలెంజ్ చేశావు.. ఇప్పుడేంటి నోట్లోంచి మాట కూడా రావడం లేదు. నువ్వు ఇంటికి వచ్చేలోపే నేను నా పెళ్లి ముహూర్తం పెట్టించుకున్నాను. అమర్‌తో పెళ్లి చేసుకుంటాను. పిల్లలను ఆయనకు దూరం చేస్తాను. ముసలొళ్లను వృద్దాశ్రమంలో వేస్తాను” అని మిస్సమ్మతో అంటుంది మనోహరి. “చూస్తావు.. మనోహరి.. ఇవన్నీ నువ్వు చేయాలనుకున్నా నేను ఆపడం నువ్వు చూస్తావు. నేను కూడా ఒకటి చూస్తా.. అది ఆయన నిన్ను ఇంట్లోంచి గెంటేయడం. నీ పాపాలు పండి నువ్వు జైలుకు వెళ్లడం అన్నీ చూస్తా” అంటూ మరోసారి మనోహరికి మిస్సమ్మ వార్నింగ్ ఇస్తుంది.
తండ్రి ఇంటికి అరుంధతి
అరుంధతి ఆలోచిస్తూ ఉండటం చూసి గుప్త వెళ్లి ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. “నాకు భాగీకి, వాళ్ల నాన్నకు ఏ సంబంధం లేకుండా వాళ్లకే ఎందుకు కనిపిస్తున్నాను. ఈ ప్రశ్నకు నాకు సమాధానం కావాలి గుప్తగారు” అని అడుగుతుంది అరుంధతి. దీంతో గుప్త షాక్ అవుతాడు. “నేను రేపే వెళ్లి నా ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటాను” అని అరుంధతి వెళ్లిపోతుంది. భాగీ ఇంటికి వెళ్లిన అరుంధతిని తండ్రి రామ్మూర్తి చూడగలుగుతాడా? రామ్మూర్తే తన తండ్రి అని అరుంధతికి తెలిసిపోనుందా? అనే విషయాలు తెలియాలంటే నేడు మార్చి 20న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాలి.
టాపిక్