తెలుగు న్యూస్  /  Entertainment  /  Keerthy Suresh Stunt As She Drank A Bottle Water With Out Touching It

Keerthy Suresh Stunt: బాటిల్ ఎత్తి దించలేదుగా.. కీర్తి సురేశ్‌ను చూసి షాక్ తిన్న నాని, రానా

Hari Prasad S HT Telugu

23 March 2023, 13:43 IST

  • Keerthy Suresh Stunt: బాటిల్ ఎత్తి దించలేదు కీర్తి సురేశ్‌. ఆమెను చూసి నాని, రానా షాక్ తిన్నారు. దసరా మూవీ ప్రమోషన్ల కోసం ముంబైలో ఉన్న నాని, కీర్తి.. అక్కడి అభిమానులతో తెగ సందడి చేస్తున్నారు.

కీర్తి బాటిల్ ఎత్తి తాగుతుంటే.. చీర్ చేస్తున్న నాని, రానా
కీర్తి బాటిల్ ఎత్తి తాగుతుంటే.. చీర్ చేస్తున్న నాని, రానా

కీర్తి బాటిల్ ఎత్తి తాగుతుంటే.. చీర్ చేస్తున్న నాని, రానా

Keerthy Suresh Stunt: ఈ వీడియో చూస్తే అమ్మో.. కీర్తి సురేశ్ మామూలుగా లేదుగా అనిపించక మానదు. అందం, నటనలోనే కాదు.. తాను ఏ విషయంలోనూ తక్కువ కాదని కీర్తి నిరూపిస్తోంది. ఎత్తిన బాటిల్ దించకుండా తాగడం అబ్బాయిలకు ప్రెస్టేజ్ ఇష్యూ. మరి ఇందులో అమ్మాయిలు కూడా తామేమీ తక్కువ కాదన్నట్లుగా అదే బాటిల్ ను చేత్తో ముట్టుకోకుండా ఎత్తి తాగితే ఎలా ఉంటుంది?

ట్రెండింగ్ వార్తలు

Ranveer Singh: రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ సినిమాకు టైటిల్ ఇదేనా?

Panchayat Season 3 OTT: పాపులర్ సిరీస్ పంచాయత్ మూడో సీజన్‍పై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్

Romeo OTT: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ సినిమా! కానీ..

Mahesh Babu new look: పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల

ఇప్పుడు ముంబైలో కీర్తి సురేశ్ చేసిన ఈ స్టంట్ చూసి నాని, రానాలు అలాగే షాక్ తిన్నారు. బుధవారం (మార్చి 22) ఉగాది నాడు ముంబైలో వీళ్లు దసరా మూవీ ప్రమోషన్లలో బిజీగా గడిపారు. ముందుగా రానా, నాని బాటమ్స్ అప్ చేసి చూపించారు. తర్వాత కీర్తి కూడా రంగంలోకి దిగి వాళ్లకు దీటుగా నోట్లో పెట్టుకున్న బాటిల్ ముట్టుకోకుండా మొత్తం ఖాళీ చేసేసింది.

అయితే ఆమె తాగింది నీళ్లే అనుకోండి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కీర్తి ఈ స్టంట్ చేస్తున్న సమయంలో నాని, రానా ఆమెను చీర్ చేస్తూ కనిపించారు. క్రీమ్ కలర్ చీరలో కీర్తి చాలా అందంగా కనిపించింది. దసరా మూవీలో ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న నాని.. ఇలాగే ఎత్తిన బాటిల్ దించకుండా, చేత్తో ముట్టుకోకుండా తాగేస్తాడు.

ఇప్పుడు మూవీ ప్రమోషన్లలో భాగంగా దానిని లైవ్ లో చేసి చూపించారు వీళ్లు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న దసరా మూవీలో కీర్తి సురేశ్.. వెన్నెల అనే పాత్రలో కనిపించింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లో తాగుడు సీన్లను మరీ ఎక్కువగా చూపించడంపై కూడా నాని స్పందించాడు. బొగ్గు గనుల్లో పని చేసే వాళ్లు మందు లేకుండా పనిలోకి దిగబోరని, అంతే తప్ప వీళ్లు మందుకు బానిసయ్యారని చెప్పడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశాడు.

దసరా మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇండియాలోని ప్రధాన నగరాల్లోనూ ఈ సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. దసరా మూవీ మార్చి 30న రిలీజ్ కాబోతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.