Dasara Run Time: నాని దసరా మూవీ రన్‌టైమ్ ఎంతో తెలిసిపోయింది-dasara run time locked as the movie to release on march 30 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dasara Run Time Locked As The Movie To Release On March 30

Dasara Run Time: నాని దసరా మూవీ రన్‌టైమ్ ఎంతో తెలిసిపోయింది

Hari Prasad S HT Telugu
Mar 20, 2023 04:15 PM IST

Dasara Run Time: నాని దసరా మూవీ రన్‌టైమ్ ఎంతో తెలిసిపోయింది. ఈ మధ్యే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కానుండగా.. యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.

దసరా ట్రైలర్ లో నాని
దసరా ట్రైలర్ లో నాని

Dasara Run Time: నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా మూవీ దసరా. తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన ఈ మూవీ కోసం దేశమంతా ఆసక్తిగా చూస్తోందంటూ ప్రమోషనల్ ఈవెంట్స్ లో నాని చెబుతున్నారు. ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కానుండగా.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న నాని.. ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో ఎప్పుడూ కనిపించని అవతారంలో నాని ఈ దసరా మూవీలో కనిపిస్తున్నాడు. అంతేకాదు తొలిసారి తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పాడు.

దీంతో ఇటు ఫ్యాన్స్ లోనూ దసరా మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక యూ/ఎ సర్టిఫికెట్ అందుకున్న ఈ దసరా మూవీ రన్ టైమ్ 2 గంటల 36 నిమిషాలుగా ఉంది. చాలా వరకూ తెలుగు, హిందీ సినిమాలు ఉండే నిడివే ఇది. మరీ ఎక్కువా కాదు.. మరీ తక్కువా కాదు. తెలుగుతోపాటు అన్ని దక్షిణాది, హిందీ భాషల్లోనూ మార్చి 30న దసరా రిలీజ్ కాబోతోంది.

ఈసారి దసరా ముందే వచ్చేస్తోందంటూ ఈ మూవీని భారీ ఎత్తున ప్రమోట్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. నానితోపాటు కీర్తి సురేశ్ కూడా ప్రెస్ మీట్లలో పాల్గొంటూ సినిమా విశేషాలు పంచుకుంటున్నారు. ఈ మూవీ ద్వారా శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. సుధారర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించాడు.

ఈ దసరా మూవీలో నాని, కీర్తి సురేశ్ తోపాటు దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని, సాయి కుమార్ కీలకపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని పాటలు ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం