Dasara Trailer: ఎట్లయితే గట్లాయె చూసుకుందం.. నాని ఊర మాస్ అవతార్.. దసరా ట్రైలర్-dasara trailer released today on march 14th with nani mass avatar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Dasara Trailer Released Today On March 14th With Nani Mass Avatar

Dasara Trailer: ఎట్లయితే గట్లాయె చూసుకుందం.. నాని ఊర మాస్ అవతార్.. దసరా ట్రైలర్

దసరా ట్రైలర్ లో నాని
దసరా ట్రైలర్ లో నాని

Dasara Trailer: ఎట్లయితే గట్లాయె చూసుకుందం అంటూ నాని ఊర మాస్ అవతార్ లో వచ్చేశాడు. దసరా ట్రైలర్ మంగళవారం (మార్చి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Dasara Trailer: లవర్ బాయ్ లా ఉండే నేచురల్ స్టార్ నానిని ఇంతకు ముందెప్పుడూ ఇంత ఊర మాస్ అవతార్ లో చూసి ఉండరు. దసరా మూవీతో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ హీరో అదరగొట్టాడు. దసరా మూవీ ట్రైలర్ మంగళవారం (మార్చి 14) రిలీజైంది. ఇది ఇప్పటికే యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ పండుగ అయిన బతుకమ్మతో ఈ ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ మొత్తం పక్కా తెలంగాణ యాసతో నటీనటులంతా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నాని తనకు అలవాటైన రీతిలో అత్యంత సహజంగా ఈ తెలంగాణ యాసను కూడా పండించాడు. సింగరేణి బొగ్గు దొంగతనం చేసే క్యారెక్టర్ లో నాని నటించాడు. అతనికితోడు వెన్నెల అనే క్యారెక్టర్ లో కీర్తి సురేశ్ కనిపించింది.

నిజానికి ట్రైలర్ మొత్తం నాని దున్నేశాడు. మాస్ లుక్, డైలాగులు చెప్పే తీరు, యాక్షన్ సీన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ ట్రైలర్ తో అసలు సినిమా స్టోరీ ఏంటన్నది తెలియకపోయినా.. మాస్ ప్రేక్షకులకు మాత్రం పండగే అని చెప్పొచ్చు. ధరణి అనే పాత్రలో నానిని ఇంతకుముందెన్నడూ చూడని అవతారంలో చూడటం ఖాయం.

సింగరేణి ప్రాంతంలో ఉండే వీర్లపల్లి అనే ఊరి చుట్టూ తిరిగే కథ ఇది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీసినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నానిలోని మాస్ యాంగిల్ ను పర్ఫెక్ట్ గా బయటకు తీసుకురావడంలో శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. నాని తన చివరి మూవీ అంటే సుందరానికి లోని క్యారెక్టర్ కు పూర్తి భిన్నమైన క్యారెక్టర్ దసరాలో పోషించాడు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. ఈ దసరా మూవీలో పాన్ ఇండియా స్థాయిలో మార్చి 30న రిలీజ్ కాబోతోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.