Rana on Rana Naidu: రానా నాయుడు 'ఎ' కంటెంట్.. ఒంటరిగానే చూడండి: రానా ఇంట్రెస్టింగ్ ట్వీట్-rana on rana naidu says its a content strictly watch alone ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rana On Rana Naidu Says Its A Content Strictly Watch Alone

Rana on Rana Naidu: రానా నాయుడు 'ఎ' కంటెంట్.. ఒంటరిగానే చూడండి: రానా ఇంట్రెస్టింగ్ ట్వీట్

Hari Prasad S HT Telugu
Mar 12, 2023 03:27 PM IST

Rana on Rana Naidu: రానా నాయుడు 'ఎ' కంటెంట్.. ఒంటరిగానే చూడండి అంటూ రానా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ఈ సిరీస్ లో విపరీతమైన బూతుపై నెటిజన్లు ట్రోల్ చేస్తుండటంతో రానా ఈ వార్నింగ్ ఇవ్వడం విశేషం.

రానా నాయుడులో వెంకటేశ్, రానా
రానా నాయుడులో వెంకటేశ్, రానా (MINT_PRINT)

Rana on Rana Naidu: టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేశ్, రానా కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇప్పటి వరకూ కేవలం సిల్వర్ స్క్రీన్ కు పరిమితమైన వీళ్లు తొలిసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీళ్లు రావడమే ఓ పెద్ద బూతు సిరీస్ తో వచ్చారు. రానా నాయుడు వెబ్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరూ వామ్మో ఇదేం బూతు సిరీస్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఈ సిరీస్ ను అస్సలు ఫ్యామిలీతో చూసే సాహసం చేయకండి అంటూ కొందరు సోషల్ మీడియాలో సూచిస్తున్నారు. తాజాగా ఆదివారం (మార్చి 12) ఈ ట్రోల్స్ పై రానా స్పందించాడు. తమ సిరీస్ చూడాలనుకునే వారికి ఓ హెచ్చరిక జారీ చేశాడు. "కచ్చితంగా ఒంటరిగానే చూడండి. కేవలం 18 ఏళ్లు పైబడిన వాళ్లే. ఇది ఎ కంటెంట్" అంటూ రానా ట్వీట్ చేయడం విశేషం.

రానా నాయుడు సిరీస్ కుటుంబంతో కలిసి చూడటం చాలా దారుణంగా ఉందంటూ మీడియా,ప్రేక్షకులు ఫిర్యాదు చేస్తున్నారంటూ వచ్చిన ఓ ట్వీట్ పై రానా ఇలా స్పందించాడు. ఇక మరో ట్వీట్ పైనా అతడు స్పందిస్తూ.. ఇది కూడా కరెక్టే అని అన్నాడు. "రానా నాయుడును తిడుతున్న వాళ్లు కాస్త ఆలోచించాలి. ప్రతిదీ కుటుంబంతో వెళ్లి చూసే సంక్రాంతి సినిమా కాదు. పరిణతి చెందిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. వాళ్ల కోసమే ఈ సిరీస్" అని ఓ వ్యక్తి చేసిన ట్వీట్ పై రానా ఇలా స్పందించాడు.

ఇక ఇన్నాళ్లూ ఓ ఫ్యామిలీ హీరోగా ముద్ర వేసుకున్న వెంకటేశ్ ఈ సిరీస్ లో పోషించిన పాత్రపైనా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అతని స్థాయికి ఈ పాత్ర సరికాదని అంటున్నారు. దీనిపై ఓ అభిమాని ట్వీట్ చేస్తూ.. ఇందులో తప్పేముంది. వెంకటేశ్ కూడా తన కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి కొత్త పాత్రలు ట్రై చేయాల్సిందే అని అన్నారు.

దీనికి రానా స్పందిస్తూ.. థ్యాంక్యూ సర్ అని ట్వీట్ చేశాడు. హాలీవుడ్ లో వచ్చిన రే డోనోవాన్ కు రీమేక్ ఈ రానా నాయుడు సిరీస్. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలోని వాళ్ల సమస్యలను పరిష్కరించే ఫిక్సర్ చుట్టూ తిరిగే కథ ఇది. నిజ జీవితంలో తన అన్న కొడుకైన రానాకు ఈ సిరీస్ లో తండ్రిగా వెంకటేశ్ నటించాడు. మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం