తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam Today Episode December 3: పారిజాతంపై జ్యోత్స్న ఆగ్రహం.. శౌర్య గురించి నిజం తెలుసుకునేందుకు దీప ప్రయత్నం

Karthika Deepam Today Episode December 3: పారిజాతంపై జ్యోత్స్న ఆగ్రహం.. శౌర్య గురించి నిజం తెలుసుకునేందుకు దీప ప్రయత్నం

03 December 2024, 7:32 IST

google News
    • Karthika Deepam 2 Today Episode December 3: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్య రిపోర్ట్స్ వచ్చాయని కార్తీక్‍కు ఫోన్ వస్తుంది. ఆసుపత్రికి వెళ్లేందుకు కార్తీక్ సిద్ధమైతే.. వద్దన్నా దీప కూడా వెంట వెళుతుంది. దాసు చెప్పిన మాటలకు జ్యోత్స్న ఆందోళనగా ఉంటుంది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా చూడండి.
Karthika Deepam Today Episode December 3: పారిజాతంపై జ్యోత్స్న ఆగ్రహం.. శౌర్య గురించి నిజం తెలుసుకునేందుకు దీప మరో ప్రయత
Karthika Deepam Today Episode December 3: పారిజాతంపై జ్యోత్స్న ఆగ్రహం.. శౌర్య గురించి నిజం తెలుసుకునేందుకు దీప మరో ప్రయత

Karthika Deepam Today Episode December 3: పారిజాతంపై జ్యోత్స్న ఆగ్రహం.. శౌర్య గురించి నిజం తెలుసుకునేందుకు దీప మరో ప్రయత

కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 3) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న కాళ్లపై పడి వేడుకోవడంతో దీపే వారసురాలు అనే నిజం తన నోటితో ఎవరికీ చెప్పనని, కానీ దీపకు అన్యాయం చేయనని దాసు అంటాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అర్థం కాకుండా మాట ఇచ్చాడని జ్యోత్స్న అనుకుంటుంది. “నేనోదే నాన్న అని పిలిచి.. అమ్మను గుర్తు చేసి.. ఎమోషనల్‍గా లాక్ చేద్దామనుకుంటే సగం అర్థమై.. అర్థం కానట్టు చెప్పి వెళ్లాడు. నీ నీటితో చెప్పవు కానీ.. అన్యాయం చేయవా. అంటే న్యాయం చేస్తావ్. చెయ్ నాన్న. అయినా నువ్వు నా నాన్న ఏంటి.. గ్రానీకి కొడుకువు అంతే” అని జ్యోత్స్న అనుకుంటుంది.

ఎలా న్యాయం చేస్తావో చూస్తా

దీపకు ఎలా న్యాయం చేస్తావో చూస్తానని, ఆమెను చంపేస్తానని జ్యోత్స్న అనుకుంటుంది. “నీ కూతురిగా నేను బతకలేను.. ఆ ఇంటికి వారసురాలిగానే బతుకుతాను. నువ్వేదో అన్యాయం చేయనని అన్నావ్ కదా. న్యాయం చేయాలంటే దీప బతికి ఉండాలి కదా” అని జ్యోత్స్న అనుకుంటుంది.

శౌర్యపై కార్తీక్ కోపం

ఈరోజు స్కూల్‍కు వెళ్లనని దీప వద్ద శౌర్య మారాం చేస్తుంది. నాన్న, నువ్వు, నేను ఎక్కడికైనా బయటికి వెళదామంటుంది. అంతలోనే కార్తీక్ వస్తాడు. స్కూల్‍కు వెళ్లనని, సినిమాకు వెళ్లనని శౌర్య అంటే కోప్పడతాడు. తాను ఎప్పుడూ స్కూల్‍కు డుమ్మా కొట్టలేదని చెబుతాడు. ఎప్పడూ లేని విధంగా శౌర్యపై ఫైర్ అవుతాడు. బుద్ధి ఉందా నీకు.. బెత్తం వాడతానంటాడు. దీంతో నువ్వేనా ఇలా అంటోందని అని శౌర్య ఆశ్చర్యపోతుంది. దీప కూడా అలాగే ఫీల్ అవుతుంది.

డాక్టర్ ఫోన్.. మాట మార్చేసిన కార్తీక్

ఇంతలోనే డాక్టర్ దగ్గరి నుంచి కార్తీక్‍కు ఫోన్ వస్తుంది. శౌర్య ఆరోగ్యం గురించి రిపోర్ట్ వచ్చిందని చెబుతాడు. ఇంతలోనే కార్తీక్ మాట మార్చేస్తాడు. ఈరోజు స్కూల్‍కు వెళ్లొద్దులే అని శౌర్యతో కార్తీక్ అంటాడు. ఇంతసేపు కోప్పడి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారని దీప అడుగుతుంది. దీంతో తాను, శౌర్య ఆసుపత్రికి సరదాగా వెళతామని అంటాడు. దీంతో ఎందుకు అని దీప అడిగితే.. తనకు తలనొప్పి అని అందుకే వెళతామని చెబుతాడు. తాను వస్తానని దీప అంటే.. కార్తీక్ వద్దంటాడు. శౌర్యకు ఎందుకు అని దీప ప్రశ్నిస్తుంది. అయితే, శౌర్యకు కూడా చూపిస్తానని కార్తీక్ అంటాడు.

దీపకు మళ్లీ అనుమానం.. నేనూ వస్తానంటూ..

శౌర్య గురించి కార్తీక్ ఏదో నిజం దాస్తున్నారని మనసులో అనుమానిస్తుంది దీప. మీతో నేను వస్తానని కార్తీక్‍ను అడుగుతుంది. కార్తీక్ కంగారు పడి.. దీపను ఆపాలని అనుకుంటాడు. నువ్వెందుకు దీప అని అంటే.. వస్తానని చెప్పేసింది. నిజాన్ని ఎలా దాచాలని కార్తీక్ ఆలోచిస్తాడు.

పారిజాతంపై జ్యోత్స్న ఫైర్

దీపనే శివన్నారాయణ మనవరాలు అని, అసలైన వారసురాలు అని దాసు చెప్పిన మాటలను గుర్తు చేసుకొని జ్యోత్స్న దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పారిజాతం వస్తుంది. ఏమైంది అలా ఉన్నావని అడుగుతుంది. సైదులు ఆ బిడ్డ(దీప)ను చంపలేదని, పారిజాతం మాత్రం చంపేశాడని అనుకుందని దాసు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత పారిజాతంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రాత్రంతా రూమ్‍లో లైట్ వెలుగుతూనే ఉంది.. నిద్రపోలేదా అని, తలుపు కొట్టినా తీయలేదని జ్యోత్స్నను పారిజాతం అడుగుతుంది. దీంతో కోపంగా చూస్తుంది జ్యోత్స్న.

పెళ్లి సంబంధం చూసేందుకే మీ అమ్మానాన్న వెళ్లారని పారిజాతం చెప్పినా జ్యోత్స్న పెద్దగా రియాక్ట్ అవదు. దీంతో పెద్ద విషయం చెప్పినా స్పందం లేదని పారిజాతం అంటుంది. ఒకడు లాగిపెట్టి కొడితే బాధ పడాలా.. పొడిచినందుకు బాధపడాలా అంటూ.. లాజిక్ మాట్లాడుతుంది జ్యోత్స్న. కత్తితో పొడిచింది ఎవరు అని పారిజాతం అడిగితే నీ కొడుకు అంటుంది. అయితే, దీపే వారసురాలు అని దాసు చెప్పిన నిజాన్ని పారిజాతానికి చెప్పకుండా జ్యోత్స్న దాచేస్తుంది.

“బిడ్డను చంపాడో లేదో తెలుసుకోకుండా సైదులును ఎందుకు చంపావ్” అని పారిజాతంతో ఆగ్రహంగా అంటుంది జ్యోత్స్న. ఇలాంటి మాటలు గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావ్.. మీ తాత ఇంట్లోనే ఉన్నాడు.. వింటే నన్ను సైదులు దగ్గరికి పంపిస్తాడు అని పారిజాతం కంగారు పడుతుంది. నువ్వు అక్కడికే పంపాలని ఆగ్రహిస్తుంది జ్యోత్స్న.

ఆ బిడ్డ తిరిగి వస్తే..

నువ్వు ఆరోజు ఆ బిడ్డను లేకుండా చేసి ఉంటే బాగుండేదని జ్యోత్స్న అంటే.. ఇప్పుడు దాని గురించి ఎందుకే అని కంగారు పడుతుంది పారిజాతం. “ఆ బిడ్డ తిరిగి వస్తే. అసలైన వారసురాలు తిరిగి వస్తే ఏం చేస్తావ్” అని జ్యోత్స్న అంటుంది. నోరు మూస్తావా.. అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడొద్దని, అలాంటివి మనసులో కూడా అనుకోవద్దని పారిజాతం వారిస్తుంది. అసలు వారసురాలిని కనిపెడతానని దాసు చెప్పినా అది సాధ్యం కాదని పారిజాతం అంటే.. అది జరిగిందని మనసులో జ్యోత్స్న అనుకుంటుంది. కానీ పారిజాతానికి నిజం చెప్పకుండా దాచేస్తుంది.

అర్థమైందా అని పారిజాతం అంటుంటే.. శివన్నారాయణ ఎంట్రీ ఇస్తాడు. ఏ మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తాడు. ఆఫీస్ విషయాలు అని పారిజాతం అంటే.. నీతోనా అని వెటకారంగా అంటాడు శివన్నారాయణ. రాత్రంతా రూమ్‍లో లైట్ వెలుగుతూనే ఉంది.. నిద్రపోలేదా అని జ్యోత్స్నను అడుగుతాడు. కొన్ని విషయాలు తెలిశాక.. అవి నిద్రపోనివ్వడం లేదని జ్యోత్స్న అంటుంది. ఏంటవి అని ప్రశ్నిస్తే.. సీఈవో పోస్ట్ నుంచి తీసేశాక బావ పనిపై దృష్టి పెట్టడం లేదని కారణం చెబుతుంది. కార్తీక్ వినకపోతే తనకు చెప్పాలని శివన్నారాయణ అంటాడు. దీప పోయాకే ప్రశాంతంగా పడుకుంటానని మనసులో అనుకుటుంది జ్యోత్స్న.

కార్తీక్‍‍తో కలిసి ఆసుపత్రికి దీప

కార్తీక్‍ వద్దన్నా.. ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధమవుతుంది దీప. ఎలాగైనా శౌర్య గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. దీపకు కనిపించకుండా త్వరగా వెళ్లాలని కార్తీక్ కంగారు పడతాడు. అయితే, అప్పటికే ముందుగానే కారులో కూర్చొని ఉంటుంది దీప. ముగ్గురు సరదాగా తిరిగి రావాలని అనసూయ, కాంచన చెబుతారు. దీప వచ్చేలోగా వెళ్లాలని కార్తీక్ అనుకుంటాడు. అయితే, వెనుక సీట్లో కూర్చున్న దీపను చూసి షాక్ అవుతాడు. నువ్వేందుకు అని దీప అడిగితే.. మీ కోసం వస్తున్నానంటుంది. దీంతో నానమ్మ విన్నావా.. నాన్న కోసం అమ్మ వస్తోందట అని శౌర్య అంటే.. కాంచన, అనసూయ ఆనందిస్తారు. శౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి దీపకు నిజం తెలియకుండా ఆసుపత్రిలోనే ఏదో మ్యానేజ్ చేయాలని కార్తీక్ అనుకుంటాడు.

ఫాలో అయిన జ్యోత్స్న

కారు నడుపుతూ దాసు మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. దాసు నిజం చెప్పాడని పూర్తిగా నమ్మకం లేదని ఆలోచిస్తుంది. ఇంతలో కార్తీక్ కారును చూసి జ్యోత్స్న ఫాలో అవుతుంది. ఆసుపత్రి రాగా.. ముందు శౌర్యతో కలిసి కార్తీక్ కారు దిగుతాడు. ఎందుకు వచ్చారా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంతలోనే దీప కూడా కారులో నుంచి దిగుతుంది. దీంతో జ్యోత్స్న కోపంగా చూస్తుంది. దీప అసలైన వారసురాలు అని దాసు చెప్పిన మాటలను మరోసారి గుర్తు చేసుకుంటుంది. దశరథ్ అన్నయ్య అసలు కూతురు దీప మెడలోనే కార్తీక్‍తో దేవుడు తాళి కట్టించాడని దాసు అన్న మాటల గురించి జోత్స్న ఆలోచిస్తుంటుంది.

అసలైన వారసురాలు చావాలి

కార్తీక్, దీప, శౌర్య ఆసుపత్రిలోకి వెళుతుంటే కారులో నుంచే చూస్తుంది జ్యోత్స్న. “అసలైన వారసురాలు ఎక్కడో అనాథలా బతుకుతూ ఉంటుంది. నాకెందుకులే అనుకున్నా. కానీ నా ఇంటికి అనాథగా వచ్చిన దీపే కొంచెం కూడా అనుకోలేకపోయాను. దశరథ్, సుమిత్రల కూతురిగా నేను ఉండాలంటే అసలైన వారసురాలు చావాలి” అని మనసులో జ్యోత్స్న అనుకుంటుంది.

తాను, శౌర్య డాక్టర్ వద్దకు వెళతానంటే దీప తాను కూడా వస్తానంటుంది. దీంతో నిజం తెలుస్తుందే అని కార్తీక్ కంగారు పడతాడు. ముందుగా తానొక్కడినే వెళ్లి డాక్టర్‌కు సమస్య చెబుతానని అంటాడు. దీంతో దీప, శౌర్య కూర్చుంటే డాక్టర్ దగ్గరికి కార్తీక్ వెళతాడు. చిల్డ్రన్ స్పెషలిస్ట్ మీ కోసమే వేచిచూస్తున్నారని డాక్టర్ అంటాడు. “ప్రాబ్లం ఏంటంటే నాతో పాటు నా వైఫ్ కూడా వచ్చింది” అని కార్తీక్ అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 3) ఎపిసోడ్ ముగిసింది.

తదుపరి వ్యాసం