Karthika Deepam Today December 21: అన్నీ వదిలి ఇంటి నుంచి బయటికి కార్తీక్, దీప కుటుంబం.. జ్యోత్స్నను కొట్టిన సుమిత్ర
21 December 2024, 7:41 IST
- Karthika Deepam 2 Today Episode December 21: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది కార్తీక్ కుటుంబం. దశరథ్ చెప్పినా మాట వినలేదు. శివన్నారాయణ కూడా తగ్గలేదు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో ఇక్కడ పూర్తిగా చూడండి.
Karthika Deepam Today December 21: అన్నీ వదిలి ఇంటి నుంచి బయటికి కార్తీక్, దీప కుటుంబం.. జ్యోత్స్నను కొట్టిన సుమిత్ర
కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. విసిరిన సవాల్ మీదే నిలబడతానని, ఈ క్షణమే కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతానని తాత శివన్నారాయణతో కార్తీక్ గట్టిగా చెబుతాడు. అమ్మా ఏమంటావని కార్తీక్ అడిగితే.. నీ మాటే నా మాట అంటూ కాంచన చెప్పేస్తుంది. దీంతో శివన్నారాయణ, జ్యోత్స్న కూడా షాక్ అవుతారు. అత్తా అర్థమైందా అని జ్యోత్స్న అంటే.. మా అమ్మకు అర్థమైంది.. నీకే అర్థం కాలేదని కార్తీక్ అంటాడు.
దీపను బ్యాగ్ తెచ్చుకోవాలని కార్తీక్ చెబుతాడు. తనకు సంబంధించినవి ఏవీ వదలొద్దని, ఇంట్లోది ఏదీ తెచ్చుకోవద్దని అంటాడు. దీంతో బ్యాగ్ సర్దుకునేందుకు లోపలికి వెళతారు దీప, అనసూయ.
ఆపేందుకు దశరథ్ ప్రయత్నం
అంతలోనే దశరథ్ ఎంట్రీ ఇస్తాడు. బావను, అత్తను నువ్వే ఆపాలని జ్యోత్స్న అడుగుతుంది. ఆపడమేంటి అని దశరథ్ అంటే.. బావ ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటున్నాడని జ్యోత్స్న చెబుతుంది. “అన్నీ నీ ఇష్టమేనా కంపెనీ నుంచి వెళ్లిపోయావ్. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోతావా. అన్ని నిర్ణయాలు నీకు నచ్చినట్టే తీసుకుంటావా” అని కార్తీక్‍ను చూస్తూ దశరథ్ అంటాడు. కార్తీక్‍కు నువ్వైనా చెప్పాలని, ఏమైందని కాంచనను అడుగుతాడు. నాన్ననే అడగాలని కాంచన అంటుంది.
నాకేం కావాలో నేనే సంపాదిస్తా
దీంతో ఏం జరిగిందని శివన్నారాయణను దశరథ్ అడుగుతాడు. సొంత డబ్బుతోనే రెస్టారెంట్ పెడతానని ఛాలెంజ్ చేశాడని, నేను సంపాదించింది వద్దని అన్నీ వదిలేసి కుటుంబంతో కలిసి వెళుతున్నాడని శివన్నారాయణ అంటాడు. మతి ఉండే ఈ నిర్ణయం తీసుకున్నావా అని దశరథ్ అంటాడు. “మామయ్య ప్లీజ్.. ఎవరో ఇచ్చిన జీవితంతో నేను బతకలేను. నాకు ఏం కావాలో నేనే సంపాదించుకుంటున్నాను. ఇదంతా మీది అందుకే వదిలేసి వెళ్లిపోతున్నా” అని కార్తీక్ అంటాడు. మాది అంటే మీది కూడా కదా అని దశరథ్ అంటే.. కాదు అని నాన్న చెప్పాడు అన్నయ్యా.. అని కాంచన బాధతో చెబుతుంది.
కార్డులు, బంగారం అన్నీ ఇచ్చేసి..
కోడలు పేరుతో రెస్టారెంట్ పెట్టేందుకు తండ్రి ఆస్తులు కావాల్సి వచ్చాయని, కానీ పర్మిషన్ మాత్రం తీసుకోలేదని కాంచనను ఉద్దేశించి శివన్నారాయణ అంటాడు. తాను వచ్చాను కాబట్టే లోన్ కాగితాలు ఇలా చిరిగిపోయానని, లేకపోతే బజారులో తమ పరుపు పేపర్లలాగానే దీప చేతిలో చిరిగిపోయేవని అరుస్తాడు. క్రెడిట్, డెబిట్ కార్డులు ఇందులో ఉన్నాయంటూ పర్సును టేబుల్‍పై పెడతాడు కార్తీక్. ఇంటి కాగితాలు, పాస్‍బుక్స్ లోపల ఉన్నాయని చెబుతాడు. వాచ్, ఉంగరాలు, చైన్, కారు కీస్ అన్నీ టేబుల్‍పై పెట్టేస్తాడు.
తాతను తీసుకొస్తే దీప పేరుతో రెస్టారెంట్ పెట్టడం ఆగిపోతుందని అనుకుంటే.. ఇలా జరుగుతుందేంటని జ్యోత్స్న కంగారు పడుతుంది. నువ్వైనా బావకు చెప్పాలని దశరథ్‍ను జ్యోత్స్న అడిగితే.. ఇప్పుడు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని కార్తీక్ అంటాడు. బయటికి వెళితే కుటుంబం పరువు పోతుందని దశరథ్ అంటాడు.
దీపే ఎక్కువంట.. వెనక్కి తగ్గని శివన్నారాయణ
ఇది కరెక్ట్ కాదు నాన్న, ఆగాలని చెప్పు అని శివన్నారాయణను దశరథ్ అడుగుతాడు. “తాత కంటే, తాత ఇచ్చిన ఆస్తుల కంటే దీపే ఎక్కువంట. పోనీ.. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు” అని శివన్నారాయణ అంటాడు. వెళ్లొద్దని కాంచనను కూడా దశరథ్ అంటాడు.
తాళికి డబ్బు తర్వాత ఇస్తా
కాంచన కూడా తన ఒంటిపై బంగారాన్ని తీసేస్తుంది. తన తల్లి జ్ఞాపకంగా ఉన్న బంగారు గాజులను తీసేస్తుంది. ఇప్పటికే చాలా వదులుకున్నానని, వీటికి బాధపడతానా అని దీపతో అంటుంది కాంచన. గాజులతో పాటు చైన్, ఉంగరాలు, కమ్మలు ఇలా అన్నీ తీసేస్తుంది కాంచన. ఒంటిపై బంగారమంతా తీసేశానని, మిగిలిన బంగారం ఇంట్లో ఉందని శివన్నారాయణతో చెబుతుంది. తాళి కూడా మీరు ఇచ్చిందేనని, దీన్ని కూడా తీసి ఇచ్చేయమంటావా నాన్న అని ఏడుస్తూ అడుగుతుంది. శివన్నారాయణ ఏ మాత్రం కరగకుండా గంభీరంగా ఉంటాడు.
భర్త బతికి ఉండగా తాళి తీయకూడదు కదా నాన్న అని కాంచన అంటుంది. తాళి ఉండనీ చెల్లెమ్మ అని అనసూయ చెబుతుంది. “అన్నయ్యా మాట్లాడడం లేదు. పోనీ నాన్న దీనికి ఎంత రేటు కడతాడో అడుగు. నా కొడుకు డబ్బులు సంపాదించగానే పంపించేస్తాను” అని కాంచన అంటుంది. మీరు ఎక్కడికీ వెళ్లేందుకు వీలులేదని బాధతో గట్టిగా అంటాడు దశరథ్.
వంట మనిషి కోసం..
వెళ్లొద్దని చెప్పాలని మరోసారి శివన్నారాయణను దశరథ్ అడుగుతాడు. వంట మనిషి కోసం నన్నే కాదనుకొని వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారంటే, వాళ్లు దృష్టిలో నేను బతికి లేనట్టే కదా అని శివన్నారాయణ అంటాడు. సవాల్ చేసింది వాళ్లు, నిర్ణయం తీసుకుంది వాళ్లు, వెళ్లిపోతుంది వాళే అని చెబుతాడు. “నీ మేనల్లుడు నాపై గెలవడానికి నాదీ అనుకున్నదంతా వెళ్లిపోతున్నాడు. మనల్ని వద్దనుకున్న వారు మనకు అవసరం లేదు. పోనీ దశరథా” అని శివన్నారాయణ తెగసి చెబుతాడు. అన్నీ వదిలేశాం తాత.. కట్టుబట్టలతో ఇంటికి వదిలేసి వెళ్లిపోతున్నామని శివన్నారాయణతో కార్తీక్ అంటాడు. నిద్రపోతున్న శౌర్యను బయటికి వెళతున్నామంటూ తీసుకెళతాడు. బయట తాత.. చాలా మంది ఉన్నారని, కంగారు పడొద్దని చెబుతాడు. ఊరు వెళుతున్నామని, అమ్మను ప్రశ్నలు అడగొద్దని అంటాడు. ఏమైనా మర్చిపోయావా అని శౌర్య అంటే.. లాకెట్ గుర్తొచ్చి తీసుకుంటాడు కార్తీక్.
దీపపై నీరు పారేసుకున్న జ్యోత్స్న
ఇప్పుడు హ్యాపీగా ఉందా దీప.. మా బావ నిన్ను పెళ్లి చేసుకున్నందుకు అందరినీ దూరం చేశావంటుంది జ్యోత్స్న. “మా బావకు అందరినీ దూరం చేసి నీ స్థాయికి తీసుకొచ్చావ్. ఇప్పుడు నడి రోడ్డు మీదకు తీసుకెళుతున్నావ్. నువ్వొక దరిద్రానివి. నీతో ఉంటే ఎవరైనా దరిద్రం అనుభవించాల్సిందే” అని జ్యోత్స్న అరుస్తుంది. ఇక ఆపితే మంచిదని కార్తీక్ గట్టిగా అంటాడు.
ఇవి తన కూతురు స్కూల్ బ్యాగ్ అని, పుస్తకాలే ఉన్నాయని, కావాలంటే చెక్ చేసుకోవచ్చని కార్తీక్ అంటాడు. ఈ పొగరే తగ్గించుకోకపోతే ఎక్కడా నిలబడలేవని శివన్నారాయణ అంటాడు. థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. హాయ్ అని శౌర్య చెప్పినా.. ఎవరూ పలుకరించరు. మాతో పాటు మీరు ఊరికి వస్తున్నారా అని శౌర్య అంటే.. మన ఫ్యామిలీ మాత్రమే వెళుతున్నామని కార్తీక్ అంటాడు.
భార్యతోనే యుద్ధానికి వెళుతున్నా
మరోసారి తప్పు చేస్తున్నావని కార్తీక్‍తో జ్యోత్స్న అంటుంది. “పూర్వం రాజులు యుద్ధానికి వెళ్లేటప్పుడు భార్యలు వీర తిలకం దిద్ది పంపేవారు. ఎందుకో తెలుసా విజయంతో తిరిగిరావాలని. అలాంటిది నేను యుద్ధానికి భార్యతోనే వెళుతున్నా. నా విజయం ఎంత గొప్పగా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. గుడ్‍బై మై డియర్ మరదలా” అని కార్తీక్ అంటాడు.
కట్టుబట్టలతో బయటికి..
కార్తీక్, దీప, కాంచన, శౌర్య, అనసూయ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతారు. కాంచన, దీప, అనసూయ కన్నీరు పెట్టుకుంటారు. నేను పుట్టి పెరిగిన ఇల్లు అంటూ మనసులో అనుకొని ఎమోషనల్ అవుతాడు కార్తీక్. నువ్వు ఎక్కడికి పోయినా వదలనని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. దీపను పెళ్లి చేసుకొని ఏం కోల్పోయావో తెలిసేలా చేస్తాను.. నిన్నైతే వదిలి పెట్టనని ఆలోచిస్తుంది. ఈ ఇంటితో రుణం తీరిపోయిందని కాంచన అనుకుంటుంది. కారులో వెళదామని శౌర్య అంటే.. కారులో వెళ్లడం లేదని పదా చెబుదామని కార్తీక్ అంటాడు.ఆ తర్వాత నడుచుకుంటూ కుటుంబంతో పాటు బయటికి వెళ్లిపోతాడు కార్తీక్. దశరథ్ కూడా కన్నీరు పెట్టుకుంటాడు.
“శివన్నారాయణ ఇంటి వారసురాలు అనాథలా నడిరోడ్డు మీద మొగుడిని తీసుకొని నడిచివెళుతోంది. ఏం గతి పట్టిందే నీకు. నిన్నైతే వదిలి పెడతానని అనుకోకు. నువ్వు చావాలి. బావ నాకు కావాలి. ఈ రెండు జరిగే వరకు నేను వెండుతూనే ఉంటాను” అని మనసులో జ్యోత్స్న అనుకుంటుంది.
జ్యోత్స్నకు సుమిత్ర చెంపదెబ్బ
ఆ తర్వాత శివన్నారాయణ, దశరథ్, జ్యోత్స్న తమ ఇంటికి వస్తారు. ఏమైదండి.. అక్కడ ఏమీ జరగలేదు కదా అని కంగారుగా దశరథ్‍ను అడుగుతుంది సుమిత్ర. కట్టుబట్టలతో కుటుంబంతో సహా కార్తీక్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని దశరథ్ చెప్పడంతో.. సుమిత్ర షాక్ అవుతుంది. పారిజాతం సంతోష పడుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారని దశరథ్‍ను సుమిత్ర అడుగుతుంది. వంట మనిషి దీప కోసం తాతపై పంతానికి వెళ్లి బావ బయటికి వెళ్లాడని జ్యోత్స్న అంటుంది. దీంతో కోపంతో జ్యోత్స్న చెంపపై కొడుతుంది సుమిత్ర. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 21) ఎపిసోడ్ ముగిసింది. మరి కార్తీక్ కుటుంబం ఎక్కడికి వెళుతుందో, ఎలా ఎదుగుతుందో తరువాయి భాగాల్లో చూడాలి.